కట్టుదిట్టంగా గ్రూప్–2 మెయిన్ పరీక్షలు
కడప సెవెన్‌రోడ్స్: ఏపీపీఎస్సీ గ్రూప్–2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలను ఈ నెల 23న కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీపీఎస్సీ గ్రూప్–2 సర్వీసెస్ మెయిన్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో లైజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పార్ట్–1 సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పార్ట్–2 సెషన్ ఉంటుందన్నారు. జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 9.45 గంటల వరకు, 1.30 గంటల నుంచి 2.45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్–2 మెయిన్ పరీక్షలకు సంబంధించి హెల్ప్ డెస్క్ 08562–246344 నంబరు ఈనెల 21 నుంచి 23వ తేది వరకు కార్యాలయ సమయాల్లో పనిచేస్తుందన్నారు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాల వివరాలు
● కేఎల్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, కృష్ణాపురం, తాడిగొట్ల, చింతకొమ్మదిన్నె మండలం
● గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ (ఆర్ట్స్ కాలేజ్), కలెక్టరేట్ వద్ద, రిమ్స్ రోడ్డు, కడప
● కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కృష్ణాపురం, చింతకొమ్మదిన్నె మండలం
● అన్నమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఆర్టీవో ఆఫీస్ వద్ద, రాయచోటి రోడ్డు, చింతకొమ్మదిన్నె మండలం
● గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్‌ల్స్, హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో, కడప.
● శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (స్విస్ట్), పులివెందుల రోడ్, కృష్ణాపురం, తాడిగొట్ల గ్రామం, చింతకొమ్మదిన్నె మండలం
● శ్రీహరి డిగ్రీ కాలేజ్, తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద, బాలాజీ నగర్, కడప
● శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎస్వీ డిగ్రీ కళాశాల వద్ద, బాలాజీ నగర్, కడప
● నారాయణ జూనియర్ కాలేజ్, హరి టవర్స్, నాగరాజు పేట, కడప
● ఎస్‌కెఆర్ అండ్ ఎస్‌కెఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, నాగరాజుపేట, కడప.
● నాగార్జున డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఆర్టీసీ బస్టాండు వద్ద, అరవింద నగర్, కడప.
● శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, వై జంక్షన్ సమీపంలో, పక్కీరుపల్లె రోడ్డు, కడప
● కేఓఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కృష్ణాపురం, చింతకొమ్మదిన్నె మండలం.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియేట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్‌చెరుకూరి తెలిపారు.గురువారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కావేటి విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ విధానంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంటర్ పరీక్షలు ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment