కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురు నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా డి. భాగ్యమ్మ, రాష్ట్ర కార్యదర్శిగా కె. ఉమామహేశ్వరి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వై. లక్ష్మి ప్రసన్న, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా బి. వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా పి. వెంకట సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఎం. వీర భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎస్. బసవరాజు, రాష్ట్ర కార్యదర్శిగా కొప్పల శివ వరప్రసాద్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా చింతకుంట బ్రహ్మయ్య, ఏ. వెంకట శివయ్య యాదవ్, స్టేట్ బూత్ కమిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఈవై యెద్దారెడ్డి, స్టేట్ బూత్ కమిటీ కార్యదర్శిగా ఎస్‌బి అబ్దుల్ జబ్బార్, స్టేట్ బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీగా డి. చంద్ర మౌళి, స్టేట్ పంచాయితీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పి. నాగార్జునరెడ్డి, స్టేట్ పంచాయితీరాజ్ వింగ్ కార్యదర్శిగా ఎస్. శివనాగిరెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఎం. రాజారెడ్డిలను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment