‘చదువుకు పేదరికం అడ్డుకాదు’
చాపాడు : చదువుకు వృత్తి, పేదరికం అడ్డుకాదని.. పుట్టింది సాధారణ పేదింటి కుటుంబమైనా రైతు బిడ్డగా కష్టపడి చదివి డాక్టర్ పట్టా సాధించి తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులను ఆనందపరిచాడు మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన విద్యార్థి పోలు అంకిరెడ్డి. కేతవరం గ్రామానికి చెందిన పోలు ఆశోక్‌రెడ్డి, విజయలక్ష్మీ దంపతుల కుమారుడు పోలు అంకిరెడ్డి కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకున్నాడు. రైతు కుటుంబానికి చెందిన అంకిరెడ్డి తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా ప్రొద్దుటూరు – మైదుకూరు జాతీయ రహదారిలోని అల్లాడుపల్లె క్రాస్ సమీపంలో టీ షాప్ నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న అంకిరెడ్డి ఎంఎస్ జనరల్ పూర్తి చేసి పేద ప్రజలకు వైద్యం అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment