బ్రహ్మంగారిమఠం : మండలంలోని జంగంరాజుపల్లె పంచాయతీ బాలాజీనగర్‌కు చెందిన ఉపాధి ఫీల్డ్‌అసిస్టెంట్ నాగిపోగు అపర్ణపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అమరావతి, వెంకటసుబ్బయ్య , యాదవ సామాజిక వర్గం నాయకుల తప్పడు ఆరోపణలు చేసి ఆమెను విధుల నుంచి తొలగించాలని ఒత్తిడి చేశారు. దీంతో అధికారులు బుధవారం అపర్ణను విధుల నుంచి తొలగించారు. ఈ విషయయై శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ భర్త సంజీవ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పక్షాన చురుగ్గా పాల్గొన్నట్లు నాపై ఎమ్మెల్యే పుట్టాసుధాకర్‌యాదవ్‌కు చేశారన్నారు. ఎన్నికల్లో నేనుగాని, నా కుటుంబ సభ్యులు పాల్గొనలేదని అతడు పేర్కొన్నాడు. 2022 నుంచి తన భార్య పంచాయతీలో ఉపాధి ఫీల్డ్‌అసిస్టెంట్‌గా పనిచేస్తోందన్నారు.ఎక్కడా ఎలాంటి రిమార్కులేదన్నారు. కేవలం రాజకీయ కక్షతో, నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు ఆరోగ్యం సరిగాలేదని రాజీనామా చేస్తున్నట్లు రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాలాజీనగర్ టీడీపీ నాయకుడు అమరావతి వెంకటసుబ్బయ్య కోడుకు 2006 నుంచి 2010 వరుకు ఉపాధి ఫీల్డ్‌అసిస్టెంట్‌గా ఉన్నపుడు దాదాపు ర. 13లక్షలు దొంగ జాబ్ కార్డులతో పోస్టల్ ద్వారా నిధులు మల్లించాడన్నారు. అప్పటిలో సామాజిక తనిఖీలో కూడా ఈ విషయం తేలిందన్నారు. అతనిని అధికారులు తొలగించారు. అటువంటి అవినీతి పరులు మాపై తప్పుడు ఆరోపణలు చేయగానే దళితులమైన మా కడుపు కొడతారా అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment