కారు ఢీకొన్న వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం ఉటుకూరు సర్కిల్ సమీ పంలో బైకును వెనుక నుంచి ఫార్చునర్ కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ఎర్రమరెడ్డి వెంకటేశ్వరరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. వివరాలిలా.. మృతుడు ఎర్రమరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఈనెల 20వ తేదీన సాయంత్రం ఉటుకూరు వద్ద వున్న గోపాల్ పొల్యూషన్ షాపు వద్ద తన మోటార్ సైకిల్‌పై వెళుతుండగా కడప వైపు నుంచి వస్తున్న ఫార్చునర్ కారు మోటార్ సైకిల్‌ను ఢీ కొంది. ప్రమాదంలో వెంకటేశ్వురరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కడప రిమ్స్‌కు తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
13 మంది జూదరుల అరెస్టు
– రూ.3.45లక్షల నగదు స్వాధీనం
పులివెందుల రూరల్ : నియోజవర్గంలోని తొండూరు మండలం మల్లేల అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3.45లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రూరల్ సీఐ మాట్లాడుతూ నియోజకవర్గం మండలాల్లో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో మొదటిసారిగా తొండూరు మండలం మల్లేల గ్రామంలో అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో ఓం ప్రకాష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలతోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేశామన్నారు. నియోజకవర్గ మండలంలో ఎక్కడైనా జూదమాడాతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని రింగురోడ్డు పైన జయరాజ్ గార్డెన్స్ వద్ద జరిగిన రోడ్డ ప్రమాదంలో కొండపల్లి సుమంత్ మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ శివ శంకరనాయక్ తెలిపారు. వివరాలిలా.. మతుడు నంద్యాల టౌన్, పొన్నాపురం నివాసి. అతని స్నేహితులు శివ, సురేంద్ర లతో కలసి ముగ్గురు బుల్లెట్ వాహనంపై శుక్రవారం తెల్లవారుజామున తిరుమలకు దైవ దర్శనానికి బయలుదేరారు. చింతకొమ్మదిన్నె పరిధిలోని రింగరోడ్డులో జయరాజ్ గార్డెన్స్ వద్ద స్పీడ్ బ్రేకర్ కనిపించక వేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. గాయపడిన సుమంత్, శివను చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే సుమంత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరికి గాయాలు
వల్లూరు : మండల పరిఽధిలోని గోటూరు సమీపంలోని వంతెన వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు అందించిన వివరాల మేరకు చైన్నె నుంచి ముంబైకి స్క్రాప్ లోడుతో వస్తున్న కంటెయినర్ లారీ గోటూరు సమీపంలోని వంతెన వద్ద అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. దీంతో మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ శివానంద్ లోనీ, క్లీనర్ సంతోష్ గాయపడ్డారు. దీంతో 108 వాహనంలో వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కారు ఢీకొన్న వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Comments
Please login to add a commentAdd a comment