హామీలపై దృష్టి పెట్టలేదు
గత బడ్జెట్‌లోనూ ఇలాగే మోసం చేశారు. ఈ సారి ప్రవేశ పెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌లో అయినా హామీల అమలుకు నిధుల కేటాయింపులు చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు.
– సురేష్ బాబు, మేయర్, కడప నగరం
వెనుకబడిన ప్రాంతాలపై ఏదీ శ్రద్ధ?
వెనుకబడిన ప్రాంతాల సాగు, తాగునీటి ప్రాజెక్టులపై బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. బడ్జెట్‌లో పది శాతం ఆధారంగా 32,236 కోట్లు వెనుకబడిన ప్రాంతాల కోసం కేటాయించేందుకు సవరణలు చేపట్టాలి. – బి.నారాయణ, అధ్యక్షులు, ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక
ఉక్కు పరిశ్రమ ఊసేలేదు
బడ్జెట్ కేటాయింపుల్లో కడప జిల్లా ప్రజల ఆకాంక్ష ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో తీరని అన్యాయం జరిగింది. రూ.3.2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసెత్తకపోవడం విచారకరం. –జి. చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి
పొగడ్తలతోనే సరి
బడ్జెట్లో గత ప్రభుత్వంపై పరనిందలు, చంద్రబాబు నాయుడుపై పొగడ్తలు మినహా ఏమీ లేవు. ఇంటి పన్నులు, విద్యుత్ పన్నులు, హరియర్స్ పేరుతో సామాన్య ప్రజలపై నూటికి, నూరు శాతం అదనంగా వేశారు, కానీ బడ్జెట్లో విద్యుత్ చార్జీలు, పన్నులు తగ్గిస్తున్నట్లు అబద్ధాలు చెప్పారు. –చంద్రశేఖర్,
సీపీఎం జిల్లా కార్యదర్శి
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
కూటమి ప్రభుత్వం నిరు ద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఏడాదికి 20 వేల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయించలేదు. –దేవిరెడ్డి ఆదిత్య, యువజన విభాగం
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ
హామీలపై దృష్టి పెట్టలేదు
హామీలపై దృష్టి పెట్టలేదు
హామీలపై దృష్టి పెట్టలేదు
హామీలపై దృష్టి పెట్టలేదు
Comments
Please login to add a commentAdd a comment