ఎస్‌హెచ్‌జీల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో సహకార సంఘాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సహకార సంవత్సరం – 2025ను పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఉద్దేశించిన జిల్లా ప్రణాళికను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి జె.సురేష్ కుమార్, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు, డీపీఓ రాజ్యలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి, డీసీసీబీ సీఈవో రాజామణి, మత్త్య శాఖ, నాబార్డు డీడీఎం, మార్క్‌ఫెడ్, మెప్మా తదితర శాఖల అధికారులు, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎగుమతి సామర్థ్యం పెంచేందుకు కృషి
జిల్లాలో పారిశ్రామిక, ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment