ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జమ్మలమడుగు రోడ్డులో వైఎస్సార్ సర్కిల్ వద్ద 18 గోవా మద్యం బాటిళ్లను ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రారెడ్డి, సిబ్బందితో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. ఒక స్విఫ్డ్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో 750 ఎంఎల్ గల 18 గోవా మద్యం బాటిళ్లు దొరికాయి. కాటం వీరేంద్ర, ఉప్పు రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని తరలిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
18న పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈపీఎస్ పెన్షనర్‌లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 18న మంగళవారం పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యాసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈపీఎస్ పెన్షనర్స్‌కు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే ఏ రకంగా బతుకుతారని ప్రశ్నించారు. ఆరు నెలలకు ఒకసారి డీఏ చెల్లించాలని, కనీస పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలని, పెన్షన్‌దారులకు ఈఎస్‌ఐ ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని
వృద్ధుడి మృతదేహం
కడప అర్బన్ : కడప రిమ్స్‌లో ఈనెల 9వ తేదీన ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతను ఈనెల 5న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు.
నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని పాత పీఎంఎఫ్ వద్ద నలుగురు క్రికెట్ బుకీలను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇటీవల జరిగిన ఛాంపియన్ షిప్ ట్రోఫీ సందర్భంగా క్రికెట్ పందేలు నిర్వహించి పలువురు డబ్బులు పంచుకుంటున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ సంజీవరెడ్డి, శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ఆర్.నాగేంద్ర, గాలిపోతుల ఆనంద్, ఆర్.మనోజ్, బొమ్మిశెశెట్టి శివప్రసాద్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షలు నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
గోవా మద్యం బాటిళ్లు పట్టివేత
గోవా మద్యం బాటిళ్లు పట్టివేత