కడప అర్బన్ : ఇటీవల రాయచోటి, చెన్నూరు సంఘటనల నేపథ్యంలో జిల్లాలో మతసామరస్యం కాపాడాలని మంగళవారం అఖిలపక్ష కమిటీ, మైనార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి, ఎన్‌ఆర్‌సీ జేఏసీ కన్వీనర్ అహ్మద్ బాబు బాయ్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, సీపీఐ ఎం ఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య మాట్లాడుతూ జిల్లాలో మత సామరస్యం, శాంతిని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కొందరి కుట్రల కారణంగా మత ఘర్షణలు చెలరేగి శాంతి భద్రతల సమస్య తలెత్తి ప్రజల్లో అనైక్యతకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల శాంతి సంఘాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూల విజయభాస్కర్, ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్, మౌలానా సిరాజ్ బుఖారి, ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మగ్బూల్ బాషా, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ షాజహాన్, సయ్యద్ చాంద్‌బాషా, ఇండిపెండెన్స్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాస్టర్ విజయభాస్కర్, క్రైస్తవ పెద్దలు వారధి జోసెఫ్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మడగలం ప్రసాద్, రాయలసీమ రైతు సంఘం నాయకుడు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.