కష్టం వచ్చినా ఏమని చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియని మూగ జీవులు అవి. నిత్యం తమకు ఆహారం అందిస్తూ వసతి కల్పించిన జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో ఇప్పటివరకూ క్షేమంగా ఉన్నాయి. నాయకులు చేసిన పాపమో ఏమో మరి.. అటవీ అధికారులు సత్రాల కూల్చివేయడంతో వాటికి ఆదరణ కరవైంది. కొన్ని చెట్టు కింద సేద తీరుతుండగా.. మరిన్ని ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. వైస్సార్ కడప–ప్రకాశం జిల్లా సరిహద్దు మండలంలోని జ్యోతి క్షేత్రంలో కాశినాయన నిత్యాన్నదాన సతంరంతోపాటు అతి పెద్ద గోశాలలు ఉన్నాయి. వేయి నుంచి 1500 గోవులు ఇక్కడ సేదతీరుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ క్షేత్రంలో కూల్చివేతలు మొదలయ్యాయి. మొదట గోశాల, గోవుల పశుదాన సత్రంతో మొదలై గత మూడు నెలల్లో నాలుగు సత్రాలు కూలాయి. వేసవిలో సత్రం నీడన ఉండాల్సిన మూగ జీవులు ఎండ వేడిమికి అల్లాడుతున్నాయి. దాతల సహకారంతో ఇప్పటి వరకూ సాగిన సత్రాలకు ఇపుడు కష్టాలు తప్పడంలేదు. కొన్ని చెట్టు నీడన సేదతీరగా.. మరిన్ని మండుటెండలో బిక్క మొహంతో చూస్తున్నాయి. అక్కడికి వచ్చిన భక్తులు ఇది చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి ఫొటో గ్రాఫర్, కడప
● నాయకుల పాపం.. పశువులకు శాపం
● నాయకుల పాపం.. పశువులకు శాపం