నేలను చిమ్ముకుంటూ .. నింగి వైపు ఎగసిపడుతున్న ఈ నీటి జోరును చూసి ఫౌంటైన్ అనుకుంటే పొరపాటే. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన పైపులైను లీకై న దృశ్యమిది. నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న పైపులైను గేట్‌వాల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నీరు దాదాపు 20 అడుగుల పైకి చిమ్ముతూ ఇదిగో ఇలా ఫౌంటైన్‌ను తలపించింది. సుమారు గంట పాటు నీరు వృథాగా పోయింది. విషయం తెలుసుకున్న సెంచురీ పానెల్స్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై బ్రహ్మంసాగర్‌లో మోటారు నిలుపుదల చేయడంతో నీటి ఉధృతి తగ్గింది. అప్పటికే చుట్టుపక్కల ప్రాంతమంతా భారీగా నీరు నిలిచింది. కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. –బద్వేలు అర్బన్