జమ్మలమడుగు/మైలవరం : దాల్మియా సిమెంట్ పరిశ్రమ 4.6 టన్నుల సామర్థ్యంతో 2006లో వంక స్థలంలో కడుతుండగా.. తాము ఇబ్బంది పడతామని చెప్పేందుకు వచ్చిన తమను గేట్లవద్దే అడ్డుకున్నారని
దుగ్గనపల్లి, నవాబుపేట, చిన్న కొమెర్ల , పెద్దకొమెర్ల గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఆరోపించారు. అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా తమను అడ్డుకుని పరిశ్రమను స్థాపించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. మైలవరం మండలం నవాబుపేట సమీపంలో ఉన్న దాల్మియా పరిశ్రమను విస్తరింరు నేపత్యంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. 15 ఏళ్లుగా తాము దాల్మియా పరిశ్రమ వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కలెక్టర్‌కు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే విస్తరించాలని, లేనిపక్షంలో తాము అడ్డుకుంటామని ఆయా గ్రామాల ప్రజలు, బాధితులు అధికారులకు విన్నవించారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అధికారులకు బాధితుల ఫిర్యాదు
దాల్మియా పరిశ్రమ యాజమాన్యంపై ప్రజాగ్రహం
దాల్మియా పరిశ్రమ యాజమాన్యంపై ప్రజాగ్రహం