సిద్దవటం: మండలంలోని వంతాటిపల్లె గ్రామ పంచాయతీ లంకమల అడవీ ప్రాంతంలో వెలసిన శ్రీనిత్యపూజ స్వామి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రూ. 72,470 వచ్చిందని ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను శుక్రవారం దేవదాయశాఖ రాజంపేట ఇన్‌స్పెక్టర్ జనార్థన్, సిద్దవటం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారు, పోలీసులు, భక్తుల సమక్షంలో లెక్కించినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట సురేంద్రబాబు, మెసింజర్ సతీష్, పోలీసు రమణయ్య, ఆలయ ఉద్యోగి చంద్ర, అర్చకులు సుబ్రమణ్యం శర్మ, వంతాటిపల్లెవాసి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.