కడప కల్చరల్ : విశ్వావసు నామ నూతన సంవత్సరాదికి తెలుగు లోగిళ్లు నవ శోభను సంతరించుకున్నాయి. పండగ సామగ్రి కొనడానికి వచ్చిన ప్రజలతో శనివారం మార్కెట్లు కళకళలాడాయి. ప్రజలు ఉదాయన్నే తలంటుస్నానాలు చేసి ఇంటి దైవానికి పూజలు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని సేవిస్తారు. సాయంత్రం దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. ఆయా దేవాలయాలు ముస్తాబయ్యాయి.
జీవితం రుచి తెలిపే పండుగ
జీవితాంతం హాయిగా..ఎలాంటి కష్టాలు లేకుండా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. ఎంత వద్దనుకున్నా..ఎంత ధనవంతులకై నా కష్టాలు తప్పవు....జీవితమంటే కష్టసుఖాల కలయిక అని తెలుపుతూ ఉగాది నాడు షడ్రుచులతో ఉగాది పచ్చడి స్వీకరిస్తా రు. జీవితమంటే చేదు, తీపిల కలయిక అని సందేశం ఇవ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం చేకూర్చే ఉగాది పచ్చడిని ప్రతి తెలుగింటిలోనూ తప్పక తయారు చేస్తారు. ఈ సీజన్‌లో వచ్చే ఎన్నో వ్యాధులను ఈ పచ్చడి తినడం ద్వారా నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
కవుల పండుగ
ఉగాదిని కవుల పండుగగా చెప్పవచ్చు. పండుగ నాడు కవి సమ్మేళనాలు నిర్వహించి అంతో ఇంతో సంభావన ఇచ్చి కవులను సత్కరించడం పండుగ సంప్రదాయం. వైఎస్సార్ జిల్లాను కవుల గడపగా పేర్కొంటారు. జిల్లా అంతటా స్వచ్ఛంద సేవా సంస్థలు, సమాజానికి సేవ చేస్తున్న వారికి ఉగాది పురస్కారాలు అందజేస్తుండగా, సాహిత్య సంస్థలు కవులను ఆహ్వానించి కవి సమ్మేళనాలు నిర్వహించి వారిని ఘనంగా సత్కరించనున్నారు.
మత సామరస్యానికి ప్రతీక
మన జిల్లాను మత సామరస్యానికి మారుపేరుగా పేర్కొంటారు. మొన్నటి ముస్లిం ప్రముఖులు హకీమ్ మంజుమియా నుంచి నేటి పెద్దదర్గా వరకు మత సహనానికి గట్టి పునాదులు వేశాయి. ఉగాది సందర్భంగా దేవునికడప ఆలయంలో పలువురు ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట, రాయచోటిలలో కూడా ఈ ఆచారం ఉంది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెలుపల నాటి ముస్లిం ప్రముఖులు తవ్వించిన ఇమామ్ బేగ్ బావి మత సామరస్యానికి మారుపేరుగా నేటికీ నిలిచి ఉంది. కడప బ్రాహ్మణ వీధిలోని జూల ఆంజనేయస్వామి ఆలయాన్ని ముస్లిం సుల్తాన్ నిర్మింపజేసినట్లు తెలుస్తోంది.
రుచి తెలిపే పండుగ
నేడు ఉగాది
కొత్త ఉషస్సుల విశ్వావసు
కొత్త ఉషస్సుల విశ్వావసు
కొత్త ఉషస్సుల విశ్వావసు