
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
– కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : జిల్లాలో ని ముస్లిం సోదరులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు, దాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. రంజాన్ పండుగను కలిసికట్టుగా ఆనందంగా జరుపుకోవాలని.. అందరికీ శుభాలు అందాలని మనసారా ఆకాంక్షించారు.
రాయచోటి వాసికి అవార్డు
రాయచోటి టౌన్ : ఒడిశా పోలీసు శాఖ అందించే ప్రతిష్టాత్మకమైన డీజీపీ డిస్క్ అవార్డును రాయచోటి పట్టణానికి చెందిన గుండాల రెడ్డిరాఘవేంద్ర (ఐపీఎస్) అందుకోనున్నారు.ఆయన ప్రస్తుతం ఒడిశాలోని నౌపాడా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2024–25 సంవత్సరానికి అవార్డును అందుకోవడానికి ఎంపికై న పోలీసు సిబ్బంది పేర్లను ఒడిశా పోలీసు రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రకటించింది. చలపతిని ఎన్‌కౌంటర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడంలో కృషి చేసినందుకు అవార్డు అందుకోనున్నారు. అవార్డు గ్రహీతలను 2025 ఏప్రిల్ 1న పోలీసు నిర్మాణ దినోత్సవం సందర్భంగా సత్కరించనున్నట్లు రెడ్డిరాఘవేంద్ర తెలిపారు.
ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?
కమలాపురం : ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అని కమలాపురం మండల పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్ మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై కమలాపురం పాస్టర్ అసిసోయేషన్, పట్టణ క్రైస్తవ సంఘాల ఐక్యతతో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. గ్రామ చావడి నుంచి క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ సాగింది. అనంతరం క్రాస్ రోడ్డు వద్ద కొవ్వొతులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా పాస్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. పాస్టర్లకు ప్రభుత్వాలు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలన్నారు. కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. సెక్రటరీ సునీల్‌దత్, వివిధ చర్చీల పాస్టర్లు పాల్ కుమార్, డేవిడ్ రాజ్, పి. రాజు, విజయ్, సురేంద్ర పాల్, స్టీఫెన్, శౌరీ, హెప్సిబా, రాజ్ కుమార్, జయరాజ్, పి.సామ్యూల్, టిపిఎం బ్రదర్, మనోహర్, అరుల్ ప్రసాద్, యు. సాల్మన్, ఐక్యతరావ్ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు