అకాల వర్షం.. అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అపార నష్టం

Published Fri, Apr 4 2025 12:43 AM | Last Updated on Fri, Apr 4 2025 12:43 AM

అకాల

అకాల వర్షం.. అపార నష్టం

కేంద్ర కారాగాలను

పరిశీలించిన జడ్జి

కడప అర్బన్‌ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జి.శ్రీదేవి సూచనల మేరకు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్‌.బాబా ఫక్రుద్దీన్‌ తమ సిబ్బందితో కలిసి గురువారం కడప నగర శివార్లలోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళల కారాగారంలోని ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మానసిక వ్యాధిగ్రస్తులైన ఖైదీలతో మాట్లాడారు. సకాలంలో డాక్టర్‌ సలహాలు తీసుకుంటూ మందులు వాడాలన్నారు. అనంతరం కారాగారం పరిసరాలను, టాయిలెట్లను, వసతి గదులను, రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలను సలహాలను ఇచ్చారు. ఫిర్యాదుల పెట్టెను పరిశీలించడం జరిగినది, ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రాధాన్యతను తెలియజేశారు. కారాగారం లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయము, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం మొదలగు అంశాలను వివరించారు. లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 15100 పై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుషుల కేంద్ర కారాగారము సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు, మహిళ కారాగారపు సూపరింటెండెంట్‌ కృష్ణవేణి, డాక్టర్లు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

కడప అగ్రికల్చర్‌ : పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. మొన్న చక్రాయపేట మండలంలో ఈదురు గాలులకు 2700 ఎకరాలకుపైగా అరటి పంట నేలవాలి దెబ్బతిని రూ.50 కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లింది. ఆ సంఘటన మరువకముందే మళ్లీ గురువారం సాయంత్రం ఉన్నట్లుండి కురిసిన అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో రైతులకు అపారనష్టం కలిగింది. జిల్లాలోని ఖాజీపేట, సికెదిన్నె మండలాల్లో పలువురు రైతులకు చెందిన అరటి చెట్లు నేలకొరిగాయి. దీంతో రైతులకు రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇందులో ఖాజీపేట మండలంలో 30 మంది రైతులకు సంంధించి 71.5 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. దీంతో 7.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సికె దిన్నె మండలంలో 20 మంది రైతులకు సంబంధించి 35 ఎకరాల్లో ఆరటి పంట నెలకొరిగింది. దీంతో వారికి రూ. 3.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఇలా మొత్తంగా 50 మంది రైతులకు సంబంధించి 106.5 ఎకరాల్లో అరటి పంట దెబ్బతినడంతో రూ.10.65 లక్షల నష్టం జరిగిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక నష్ట పరిహారాన్ని గుర్తించారు.

మార్కెట్‌యార్డులో తడిసిన పసుపు

కడప మార్కెట్‌యార్డులోకి వర్షపునీరు చేరి ఎండు పసుపు తడిచి ముద్దయింది. అమ్మకం కోసం మార్కెట్‌యార్డుకు తెచ్చిన పసుపును కుప్పలుగా పోసుకుని ఉండగా.. ఉన్నట్లుండి కురిసిన వర్షంతో నీరంతా పసుపు కొమ్ముల కుప్పల అడుగుభాగంలో చేరి తడిచిపోయింది. వర్షం ప్రారంభం కాగానే పసుపు కుప్పలసై పట్టలు కప్పినా అడుగుభాగంలోకి వర్షపు నీరు చేరడంతో ఎండు కొమ్ములు తడిచాయని గోపులాపురానికి చెందిన వెంకటరెడ్డి, రామాంజనేయరెడ్డి, అప్పరాజుపల్లికు చెందిన విశ్వనాథరెడ్డి, కొత్తపేటకు చెందిన సుబ్బరాయుడులతోపాటు పలువురు రైతులు తెలిపారు. వర్షపునీటితో కొమ్ములు తడవటంతో పసుపు నాణ్యత తగ్గడంతోపాటు బరువు కూడా తగ్గుతుందని వారు వాపోయారు. తడిచిన పసుపు కొమ్ములను మళ్లీ ఆరబెట్టి అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌ యార్డులో సరైన వసతులు లేక పోవడంతోనే ఎండు పసుపు తడిచిందని పేర్కొన్నారు. ఈ విషయమై యార్కెట్‌యార్డు సెక్రటరీ సుజాతతో మాట్లాడగా.. పసుపు తడిచినట్లు రైతులెవరూ తమ దృష్టికి తేలేదని తెలిపారు.

ఈదురు గాలులతో..

చింతకొమ్మదిన్నె : మండలంలో గురువారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలుల ధాటికి అరటి రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలిగింది. నాగిరెడ్డిపల్లె, గూడావాండ్లపల్లె, బుగ్గలపల్లె, లింగారెడ్డిపల్లి తదితర గ్రామాలలో తోటలలో గెలలతో ఉన్న అరటి చెట్లు.. ఈదురుగాలికి చాలా చోట్ల నేలకొరిగాయి. అమృతపాణి రకం అరటి చెట్లు ఎత్తుగా పెరగడం వల్ల నేలపై వాలిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశామని, తీరా చేతికి వచ్చే తరుణంలో ఈదురు గాలులు తమకు శాపంగా మారాయన్నారు. అరటికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం తమను అఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

దెబ్బతిన్న నువ్వుల కట్టె

వేముల : అకాల వర్షాలతో నువ్వుల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డిసెంబర్‌, జనవరి నెలలో సాగు చేసిన రైతులు.. నువ్వుల కట్టెను కోతలు కోసి కల్లాలకు తరలించారు. అక్కడ మూడు రోజులపాటు మగ్గిన తర్వాత నువ్వుల కట్టెను నూర్పిళ్ల కోసం వేశారు. ఎండలు బాగా ఉంటే రెండు, మూడు రోజులలో నువ్వుల కట్టెను తీసి వేసి.. నువ్వులను వేరు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఈలోగా అకాల వర్షాలు రావడంతో కల్లాల్లో ఉన్న నువ్వుల కట్టె తడిసి ముద్దమైంది. నువ్వుల కట్ట కింద ఉన్న నువ్వులు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసి మూడు నెలలపాటు కాపాడుకుంటే నోటికాడికి వచ్చిన తర్వాత వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

నేలకొరిగిన అరటి చెట్లు

లబోదిబోమంటున్న రైతులు

అకాల వర్షం.. అపార నష్టం 1
1/3

అకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం 2
2/3

అకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం 3
3/3

అకాల వర్షం.. అపార నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement