
బాబూ జగ్జీవన్‌రాం ఆదర్శప్రాయుడు
కడప కార్పొరేషన్ : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం ఆదర్శప్రాయుడు అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా కడప మహావీర్ సర్కిల్‌లో జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి శనివారం నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచు పాటి బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్‌రాం అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కులాలకు, మతాలు, పార్టీలకు అతీతంగా ఆయనఅనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయక్, పార్టీ నాయకులు బి. రెడ్డెన్న, పులి సునీల్, సీహెచ్ వినోద్, కె.బాబు, త్యాగరాజు, ఎం.సుబ్బరాయుడు, బండి ప్రసాద్, పి. జయచంద్రారెడ్డి, యానాదయ్య, బీహెచ్ ఇలియాస్,దాసరి శివప్రసాద్, తోటక్రిష్ణ, షఫీ, బసవరాజు, మునిశేఖర్‌రెడ్డి, ఏ1 నాగరాజు, రత్న కుమారి, బండి మరియలు, సుశీలమ్మ, తులశమ్మ తదితరులు పాల్గొన్నారు.