
మహిళపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరి అరెస్టు
ఖాజీపేట : పుల్లూరు పీడబ్ల్యూ బంగళా వద్ద భాగ్య అనే మహిళపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఖాజీ పేట సీఐ మోహన్ తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విష యంలో ఈమైపె హత్యాయత్నం జరిగింది. డ్రైవర్ శివకృష్ణకు గాయాలయ్యా యి. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరితో పాటు కొప్పులోలు వెంకట సూర్య చంద్రారెడ్డి (23) షేక్ మహమ్మద్ రఫీ (38) లను రావులపల్లె క్రాస్ వద్ద అరెస్టు చేసి వారి వద్దనుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటికి 8 మందిని అరెస్టు చేశామని మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాల్సి ఉందన్నారు.
పెన్నా నదిలో పడి వృద్ధుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరానికి చెందిన ఇల్లూరు చిన్నవెంకటేష్ (73) అనే వృద్ధుడు స్నానం చేసేందుకు పెన్నా నదిలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన చిన్న వెంకటేష్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించసాగారు. ఈ క్రమంలో పెన్నానదిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేష్ పశువుల వ్యాపారం చేసేవాడు. అతనికి భక్తి ఎక్కువ. పెన్నానదిలో స్నానం చేసి గుడికి వెళ్లేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం రెండు కుళాయిల సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. స్నానం చేసేందుకు అక్కడ ఉన్న నీళ్లలో దిగాడు. ఈ క్రమంలో సోమవారం అతని మృతదేహం నీళ్లలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లోతు ఎక్కువగా ఉన్న కారణంగా ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతనికి ఆయాసం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మహిళపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరి అరెస్టు