
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన దాసమనేని ప్ర తాప్‌నాయుడు కుమార్తె ప్రవల్లిక వివాహక వేడుకలలో విదేశీయులు సందడి చే శారు. శుక్రవారం రాత్రి ఈ పెళ్లి వేడుకలు పోట్లదుర్తి గ్రామ పరిధిలోని పెన్నానది ఒడ్డున ఉన్న రెడ్ల కల్యాణ మండపంలో జరిగాయి. వేడుకకు రష్యా, థాయిలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల నుంచి 8 మంది విదేశీయులు వచ్చారు. వారం రోజులుగా జరుగుతున్న మోహందీ, హల్దీ, సంగీత్ పెళ్లి కుమార్తె అలంకరణ తదితర కార్యక్రమాలో ఉత్సహగా పాల్గొని వేడుకలను తిలకించి సందడి చేశారు.