
అసభ్యకర పోస్టులు పెడితే కేసులు
కడప అర్బన్ : సామాజిక మాధ్యమాలు వేదికగా ఇతరులను రెచ్చగొట్టేలా, అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెడితే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ మహిళలు, బాలికలు, అధికారులపై పోస్టులు పెడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని, వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టినా, కులాలు, వర్గాలు, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సోషల్ మీడియా పోస్టులపై గట్టి నిఘా ఉంచి పర్యవేక్షిస్తామన్నారు. యువత సామాజిక మాధ్యమాలకు మంచికోసమే వినియోగించాలని ఎస్పీ సూచించారు. ఎవరైనా బాధితులు ఉంటే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన kadapasocialmedia@gmail. com, లేదా సెల్ నెంబర్ 9121100686కు నేరుగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. యవచ్చనీ ఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, ఎస్‌బీ డీఎస్పీ ఎన్.సుధాకర్, దారెడ్డి భాస్కర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్