
కడప జిల్లా కళలకు కాణాచి
కడప ఎడ్యుకేషన్: కడపజిల్లా కళలకు కాణాచి అని సంస్కృతి, సంప్రదాయాలకు, ఆత్మీయతకు పెట్టింది పేరని జిల్లా విద్యాశాఖా ధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సభాభవనంలో రచయిత, ఉపాధ్యాయుడు గజ్జల వెంకటేశ్వర రెడ్డి రచించిన మన కడప–ఘన గడప పాటకు సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలోని ఆధ్యాత్మిక స్థలాలు, దర్శనీయస్థలాలు, నదులు, ఖనిజ సంపద, కవులు,ఆటలు తదితల అంశాను కూర్చి అద్భుతమైన పాటను రచించి,గానం చేసి వీడియోగా చిత్రీకరించిన వెంకటేశ్వర రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డీకే చదువులబాబు, ఏఎంఓ. వీరేంద్ర, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షు రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు బాలగంగి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఇలియాస్‌బాషా, ఎన్‌టీఏ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణంరాజు, లెక్కలవారి పల్లె ప్రధానోపాధ్యాయుడు నరసింహులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, మహేష్ బాబు, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు సజ్జల రమణారెడ్డి, ఆర్‌జేయూపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సైన్స్ ఉపాధ్యాయులు వేపరాల ఎబినేజర్, సైన్స్ మ్యూ జియం క్యూరేటర్ రెహ్మాన్ , కౌశల్ జిల్లా కో–ఆర్డినేటర్ విజయ మోహన్ రెడ్డి, సైన్స్ కో ఆర్డినేటర్ సుుబ్బానాయుడు పాల్గొన్నారు.
డీఈఓ షేక్ షంషుద్దీన్