
● ప్రధాన డిమాండ్లు ఇవీ...
సమ్మె కార్యాచరణ ఇలా..
కడప రూరల్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో వైద్య రంగానికి మహర్దశ పట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక కేంద్రానికి ఇద్దరు చొప్పున వైదులతో పాటు సరిపడా మిగతా వైద్య సిబ్బందిని నియమించారు. అలాగే ‘ఫ్యామిలీ ఫిజీషియన్’ కాన్సెప్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం పల్లె వైద్యానికి కష్టకాలం వచ్చింది.
● కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే జీఓ నంబర్– 85 జారీ చేసింది. ఈ జీఓ రాకతో పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు పనిచేసే వైద్యులకు.. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసే వైద్యులకు పీజీ చేసేందుకు 30 శాతం కోటాను కేటాయించేవారు. జీఓ – 85 కారణంగా ప్రభుత్వం 30 శాతం ఉన్న కోటాను ఏకంగా 15 శాతానికి తగ్గించింది.దీంతో వైద్యులు తమ భవిష్యత్తును ప్రభుత్వం దారుణంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జీఓ –85, 99గా మారింది. అలాగే మిగతా సమస్యల పరిష్కారానికి ఈ నెల 26వ తేదీ నుంచి దశల వారీగా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోషియేషన్ (ఏపీ పీహెచ్‌సీ డీఏ) ఆధ్వర్యంలో సమ్మెను ప్రారంభించారు. 2024 సెప్టెంబర్‌లో కూడా వైద్యులు సమ్మె చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వనించి, సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చింది. ఏడాది దాటినా హామీలు అమలుకాకపోవడంతో మరో మారు వైద్యులు ఆందోళన బాట పట్టారు.
పీహెచ్‌సీలు: 51
ఒక ఆసుపత్రిలో ఉండే వైద్యులు: 02
మొత్తం పనిచేస్తున్న వైద్యులు: 110
లభించే మందుల రకాలు: 175
వైద్య పరీక్షల రకాలు: 63
ఒక రోజుకు వచ్చే పేషెంట్స్:
45 మందికి పైగా
● ఇన్–సర్వీస్ కోటాను పునరుద్ధరించాలి
● టైమ్–బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలి
● గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50% ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలి.
● నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలి..
● చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు రూ 5 వేల అలవెన్స్ మంజూరు చేయాలి
● నేటివిటీ – అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను పరిష్కరించాలి.
తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలు....
● వైద్యులకు కచ్చితమైన పని గంటలు, స్థిరమైన వారాంతపు సెలవు మంజూరు చేయాలి.
● వైద్యుల జాబ్ చార్ట్ ఇవ్వాలి
● అనధికారిక వ్యక్తులు ( ఉదాహరణకు నాన్ మెడికల్ శాఖ కు సంబంధం లేనివారు) విచ్చలవిడిగా తనిఖీలు నిర్వహించకుండా స్పష్టమైన మార్గదర్శకాలు చేయాలి.
28న వాట్సప్ గ్రూప్ బహిష్కరణ
29న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలు మినహా అన్ని ఓపీ సేవలు బంద్
30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు
3 నుంచి విజయవాడలో వైద్యాధికారుల నిరసనలు, నాయకుల నిరవధిక నిరాహార దీక్షలు