Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jaganmohan Reddy Strongly Condemned Pahalgam Terror Attack1
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌

తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.జమ్మూకశ్మీర్‌ దుర్ఘటనపై వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘పహెల్‌ గామ్‌ లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యారు. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025టూరిస్టులపై కాల్పులుమంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌ నాగ్‌ జిల్లా పహెల్‌ గామ్‌లో బైసరీన్‌ వ్యాలీని వీక్షించేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులను టార్గెట్‌ చేశారు. ఇండియన్‌ ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు ఉగ్రవాదులు ఓపెన్‌ ఏరియాలో టూరిస్టులపై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి కాల్పులు జరిపారు. ఓపెన్‌ ఏరియా కావడంతో టూరిస్టులు ఎటూ పారిపోలేకపోయారు. ముష్కరుల తూటాలకు బలయ్యారు. ముష్కరుల జరిపిన కాల్పుల్లో 27మంది టూరిస్టులు మరణించారు. పలువురు టూరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.

Terrorist Attack In jammu kashmir Pahalgam2
Pahalgam: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి

జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహెల్‌ గామ్‌లో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల దాడిలో 27మంది టూరిస్టులు మరణించారు. పదిమందికిపై టూరిస్ట్‌లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మర్‌ సీజన్‌ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొనే పహల్గాంలోని బైసరీన్‌ వ్యాలీ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. అయితే, ఈ బైసరీన్‌ వ్యాలీని సందర్శించాలంటే కాలినడకన లేదంటే గుర్రాలమీద చేరాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా భావించిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు.A newlywed’s honeymoon turned into horror in #Pahalgam as terrorists shot her husband for not being Muslim. They asked his name, caste then killed him point-blank in kashmir. Her life shattered forever.#Kashmir #UPSC pic.twitter.com/4s1OYAdsiE— Rebel_Warriors (@Rebel_Warriors) April 22, 2025 భారత ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పెహల్‌ గామ్‌లో ట్రెక్కింగ్‌ టూర్‌కు వెళ్లిన టూరిస్టులను చుట్టుముట్టి వారి ఐడీ కార్డులను చెక్‌ చేశారు.మతం అడిగి తెలుసుకున్నారు. ముస్లింలు కాని వారిని పక్కన నిలబెట్టి కాల్పులు జరిపారు.పేరు, మతం అడిగి తన భర్తపై కాల్పులు జరిపారని ఓ బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరులపై ఎదురుదాడికి దిగాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించాయి.టూరిస్టులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. భారీగా బద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్‌ ముమ్మరం చేశాయి. ఈ దాడులు జరిగిన కొద్ది సేపటికే.. పర్యాటకులపై దాడి చేసింది తామేనని టీఆర్‌ఎఫ్‌ సంస్థ ప్రకటించింది. ప్రధాని మోదీ ఆరాకాల్పుల ఘటనపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని దుబాయ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఖండించారు. కాల్పుల ఘటనపై అమిత్‌షాతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌లోనే పరిస్థితులను అమిత్‌షా వివరించారు. అయితే ఘటనాస్థలికి వెళ్లాలని అమిత్‌షాకు సూచించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో అమిత్‌షా హుటాహుటీన కాశ్మీర్‌కు బయల్దేరారు. I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected. Those behind this heinous act will be brought…— Narendra Modi (@narendramodi) April 22, 2025న్యాయ స్థానం ముందు నిలబెడతాంమరోవైపు ఈ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పెట్టే ప్రసక్తిలేదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయ పడిన వారు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్ష. ఉగ్రవాదంపై పోరాడాలన్న మా సంకల్పం గొప్పది. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయ స్థానంలో నిలబెడతాం’అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.ఇది క్రూరమైన చర్య : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖండించారు. ఇది క్రూరమైన చర్య. అమాయక పర్యాటకులపై దాడి క్షమించరానిది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. The terrorist attack on tourists in Pahalgam of Jammu and Kashmir is shocking and painful. It is a dastardly and inhuman act which must be condemned unequivocally. Attacking innocent citizens, in this case tourists, is utterly appalling and unpardonable. My heartfelt condolences…— President of India (@rashtrapatibhvn) April 22, 2025 ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదుజమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిపై హోంశాఖ అ‍త్యున్నత సమీక్ష నిర్వహించింది. ఉగ్రవాదుల దాడి నన్ను కలిచి వేసింది. ఉగ్రవాదులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని సమీక్షా సమావేశంలో హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. Anguished by the terror attack on tourists in Pahalgam, Jammu and Kashmir. My thoughts are with the family members of the deceased. Those involved in this dastardly act of terror will not be spared, and we will come down heavily on the perpetrators with the harshest consequences.…— Amit Shah (@AmitShah) April 22, 2025 ఉగ్రవాదులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డిజమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడిన దేశ వ్యతిరేక శక్తులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కటై నిలబడుతుందని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

India squad for England Tests: Shreyas Iyer, Sai Sudharsan And Rajat Patidar in contention3
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. శ్రేయ‌స్ రీ ఎంట్రీ? యువ సంచల‌నానికి పిలుపు!

ఐపీఎల్‌-2025 ముగిసిన త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌కు భార‌త జట్టును ఎంపిక చేసిన ప‌నిలో బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ప‌డింది. మే రెండో వారంలో భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్రక‌టించే అవ‌కాశ‌ముంది.అయితే ఇంగ్లండ్ టూర్‌కు త‌మిళనాడు యువ సంచ‌ల‌నం సాయిసుద‌ర్శ‌న్‌ను ఎంపిక చేసే ఆలోచ‌న‌లో సెల‌క్ట‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సుద‌ర్శ‌న్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. దేశ‌వాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. సుద‌ర్శ‌న్ ఇప్ప‌టికే టీ20, వ‌న్డేల్లో భార‌త్ త‌ర‌పున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు టెస్టుల్లో డెబ్యూ చసే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. అత‌డికి ఇంగ్లండ్ రెడ్-బాల్ క్రికెట్ ఆడిన అనుభ‌వం ఉంది. సుద‌ర్శ‌న్ కౌంటీ క్రికెట్‌లో సర్రే తరపున ఆడాడు. అదేవిధంగా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ర‌జిత్ పాటిదార్‌ల‌కు తిరిగి పిలుపునివ్వాల‌ని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయ్య‌ర్, పాటిదార్ ఇద్ద‌రూ గ‌తేడాది భార‌త టెస్టు జ‌ట్టుకు దూరంగా ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉండ‌డంతో ఎంపిక చేయ‌నున్న‌ట్లు వినికిడి. మిడిలార్డ‌ర్‌లో అప్ష‌న్స్ కోసం సెల‌క్ట‌ర్లు వెతుకుతున్నారు. సుద‌ర్శ‌న్‌, పాటిదార్‌, అయ్య‌ర్‌లను ముందే ఇంగ్లండ్‌కు పంపించే అవ‌కాశ‌మున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురు భార‌త-ఎ జ‌ట్టు త‌ర‌పున ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో అధికారిక టెస్టు సిరీస్ ఆడ‌నున్నారు.

Ys Jagan Key Comments At Ysrcp Pac Meeting4
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ పీఏసీ మీటింగ్‌లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్‌ చేస్తున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయులును అరెస్ట్‌ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్‌ అధికారుల పట​ ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్‌ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్‌ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్‌ చేశారు. ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్‌ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్‌ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్‌ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్‌ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్‌ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ తీసేశారు. మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్‌లు నొక్కలేదు అని అడిగాను. బటన్‌లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్‌లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్‌ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్‌ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్‌ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్‌ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్‌ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్‌ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్‌ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్‌ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్‌ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

Mla Chintamaneni Prabhakar Halchal In Eluru Sakshi Office5
ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం

ఏలూరు,సాక్షి: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వీరంగం సృష్టించాడు. మంగళవారం తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సాక్షి జిల్లా కార్యాలయంలోని కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే బాధితుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వేధింపులు తాళలేక బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా ‘ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షిపై చింతమనేని రెచ్చిపోయారు. సాక్షిలో ప్రచురించిన కథనాలకు సంజాయిషీ చెప్పాలంటూ సాక్షి కార్యాలయంలో హడావిడి చేశారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక, టీవీని జిల్లాలో తిరగనివ్వను. సాక్షి పత్రిక ప్రతులను తాడేపల్లి గూడెం దాటనివ్వను.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాధితుడు బాబురావును అసలు చూడలేదని దబాయిస్తూనే బాబూరావు వివాదం వివరాలన్నీ చింతమనేని ప్రభాకర్‌ బయటపెట్టడం గమనార్హం.👉గమనిక: చింతమనేని ఆగడాలపై ‘ఎన్టీఆర్‌ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణం’ అంటూ రాసిన సాక్షి కథనాన్ని యథాతధంగా ప్రచురిస్తున్నాం ఎన్టీఆర్‌ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణంకొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఉసులూరి సత్యనారాయణ, బోస్, నాగబోయిన సత్యనారాయణ కోరారు. అన్ని అనుమతులతో వస్తే అభ్యంతరం లేదని బాబూ­రావు తెలిపారు.అయితే ఎలాంటి అనుమతులూ లేకుండానే అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2,000 లారీల గ్రావెల్‌ను తవ్వేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన దాసరి బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ దారుణంపై దెందులూరు తాహసీల్దార్, మైనింగ్‌ ఏడీ, ఏలూరు ఎస్పీ, దెందులూరు ఎస్సైలకు మూడు నెలల క్రిత­మే బా­బూ­రావు ఫిర్యాదు చేశారు. జనసేన, టీడీపీ పా­ర్టీ కా­ర్యాలయాల్లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.మరోవైపు తమ పార్టీ నేతల­తో రాజీ చేసుకోవాలని.. లేకుంటే అంతు చూస్తాన­ని చింతమనేని ప్రభాకర్‌ నుంచి బాబూరావుకు బెదిరి­ంపులు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన బాబూ­రావు, ఆయన భార్య నాగలక్ష్మి సోమవారం టీ­డీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తమకు న్యాయం జరగ­డంలేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్‌ విగ్ర­హం ఎదుట బాబూరావు తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయ­న భార్య అడ్డుకుని హుటాహుటిన తన భర్తను ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యే శరణ్యం ‘కొద్ది నెలలుగా మా పొలంలో టీడీపీ నేతలు గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలను ఆపి న్యాయం చేయండని తహసీల్దార్‌ నుంచి ఎస్పీ వరకూ మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోగా మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు.. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీబీలు, లారీలు అన్నీ మా పొలం వద్దే ఉన్నాయి. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.’ – నాగలక్ష్మి, బాబూరావు భార్య

Twist in Bengaluru road rage Case6
CCTV: నిను వీడని నీడను నేనే..!

బెంగళూరు: అతనొక ఐఏఎఫ్ ఆఫీసర్.. పేరు సలాధిత్య బోస్. .డీఆర్డీవో పైలట్. ఇదంతా బానే ఉంది. అయితే తనపై కొంతమంది దాడి చేశారని ఆరోపించాడు. తాను ఎయిర్ పోర్ట్ కు వెళుతుంటే పలువురు బైక్ పై అడ్డగించి తనను తీవ్రంగా గాయపరచడమే కాకుండా భార్యను కూడా అసభ్య పదజాలంతో తిట్టారన్నాడు. ఇదంతా బోస్ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పిన మాటలు. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. బోస్ చెప్పిన దానికి పరిశోధనలో తేలిన దానికి పొంతనే లేకుండా ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా బోస్ చెప్పింది అంతా అబద్ధమేనని తేలిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ ల్లో కేవలం విక్రమ్ అనే వ్యక్తిపై బోస్ దాడి చేయడమే కనిపించింది. అతన్ని కిందపడేసి మరీ పిడుగు గుద్దులు కురిపించాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. న్యాయాన్ని బ్రతికించడానికి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లు ఆధారమవుతున్నాయని, లేకపోతే అమాయకులు బలి అవుతారని నెటిజన్లు పేర్కొంట్నునారు. ప్రస్తుతం బోస్ పై హత్యాయాత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బయ్యప్పనహళ్లి పోలీసులు.. బోస్ పై బీఎన్ఎస్ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 109 (హత్యాయత్నం), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 304 (స్నాచింగ్), 324 (అల్లరి), మరియు 352 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.The #DRDO pilot who had alleged that he was assaulted by a motorist on Monday has now been booked for attempted murder of that same motorist, #Bengaluru police sources said. Investigations have revealed that the #wingcommander made several false claims in the vdeo. @DeccanHerald pic.twitter.com/FnaA5jzUD2— Chetan B C (@Chetan_Gowda18) April 22, 2025 ఆఫీసర్‌ చెప్పిన కథ ఇది.. సోమవారం ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాను. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నా. ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను. ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు.

Ktr Fires On Cm Revanth Reddy Over Lagacharla Incident7
‘మా ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని వదిలిపెట్టం’.. పోలీసులకు కేటీఆర్‌ వార్నింగ్‌

హైదరాబాద్‌,సాక్షి: తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రైవేట్‌ సైన్యంలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.వికారాబాద్‌ జిల్లా లగచర్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc) ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా, భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక విడుదలతో లగచర్ల బాధితులు హైదరాబాద్‌ నందినగర్‌లో కేటీఆర్‌తో భేటీ అ‍య్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలి. లగచర్లలో మహిళలపై దాడి చేశారు. బాధితుల పకక్షాన ఎన్‌హెచ్‌ఆర్‌సీని సంప్రదించాం. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతాం. లగచర్లలో ఓవర్‌ యాక్షన్‌ చేసిన అధికారులను వదలం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.

Tollywood Hero Nani Responds On Movie Reviews On First Day8
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?

టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం హిట్-3 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిట్‌ సిరీస్‌లో భాగంగా వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హిట్-3 ట్రైలర్ విడుదల కాగా.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ఇంతకుముందెన్నడు కనిపించని వయోలెన్స్ పాత్రలో నాని కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నాని. ఈ సందర్భంగా మూవీ రివ్యూల అంశంపై ఆయన స్పందించారు. విడుదల రోజే రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందని గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాని కామెంట్స్‌పై ఈ అంశంపై హీరో నాని మాట్లాడుతూ....' రివ్యూలపై ఎందుకు ఆగాలి? ఎందుకు ఆపాలి.. ఎవర్ని ఆపాలి... ఎలా ఆపాలి... ఇప్పుడు ఎవరినీ ఆపలేరు? నాకు నచ్చలేదు అనండి ఓకే. కానీ ఈ సినిమా ఆడదు అని చెప్పకండి. ఈ మూవీ డిజాస్టర్‌ అని ఒక్కరోజులో ఎలా చెప్తారు. సినిమా విడుదలైనా పది రోజులైనా ఎవరూ చూడకపోతే అప్పుడు పెట్టండి డిజాస్టర్‌ అని. ఫస్డ్‌ డే మార్నింగ్‌ షోకే ఎలా డిసైడ్ చేస్తారు. వ్యక్తిగతంగా సినిమాపై అభిప్రాయం ఎలా వ్యక్తం చేసినా ఓకే. కానీ మీడియా ప్రొఫెషనల్స్ అలా చేయడం కరెక్ట్‌ కాదనేది నా అభిప్రాయం' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్‌ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Annamalai Rajya Sabha Entry From Andhra Pradesh9
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై

అమరావతి,సాక్షి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలైకు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.మంగళవారం సీఎం చంద్రబాబు, కేంద్రహోమంతి అమిత్‌షా భేటీలో ఖరారైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేందుకు చంద్రబాబు సుమఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిఇటీవల, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడ్ని బీజేపీ నియమిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఆయన రాజీనామాకు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలేనని తెలుస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు సిద్ధమైంది. అయితే 2023లో అన్నాడీఎంకే నేతలను అన్నామలై తీవ్రంగా విమర్శించారు. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బీజేపీ అధిష్టానానికి షరతు విధించినట్లు సమాచారం. అన్నాడీఎంకే షరతు మేరు అన్నామలైను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. ఇక ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేలా కమలం పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Opting for new tax regime Check these 5 benefits10
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!

దేశంలో కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 115BAC కింద దీన్ని ప్రవేశపెట్టారు. ఇది తక్కువ పన్ను రేట్లతో సరళమైన పన్ను నిర్మాణాన్ని అందిస్తుంది. కానీ పాత విధానంతో పోలిస్తే డిడక్షన్లు, మినహాయింపులు తక్కువ ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్ 2026-27) కోసం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే ఐదు ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1.పన్ను రహిత ఆదాయ పరిమితి ఎక్కువ రూ .12 లక్షల మినహాయింపు పరిమితి, రూ .75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా వేతన జీవులకు రూ .12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మునుపటి రూ .7.5 లక్షల పన్ను రహిత పరిమితి (రూ .7 లక్షలు + రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్) కంటే గణనీయమైన పెరుగుదల. ఇది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.2.అన్ని స్లాబ్‌లలో తక్కువ పన్ను రేట్లుకొత్త విధానంలో రాయితీ పన్ను రేట్లతో ఏడు స్లాబ్‌లు ఉన్నాయి. ఇవి రూ.4 లక్షల వరకు ఆదాయానికి 0% నుండి ప్రారంభమై, రూ.24 లక్షలకు పైబడిన ఆదాయానికి 30% వరకు ఉన్నాయి. ఈ విధానం ముఖ్యంగా రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి, పెద్దగా డిడక్షన్లు క్లెయిమ్ చేయని వారికి, పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. తద్వారా చేతికందే జీతం ఎక్కువౌతుంది.3.సరళమైన పన్ను ఫైలింగ్.. తక్కువ కంప్లయన్స్తక్కువ డిడక్షన్లు, మినహాయింపులతో (ఉదా., HRA, LTA, లేదా సెక్షన్ 80C ప్రయోజనాలు లేకపోవడం), కొత్త విధానం డాక్యుమెంటేషన్, కంప్లయన్స్ ఇబ్బందులను తగ్గిస్తుంది. దీంతో ఈ విధానం యువ ప్రొఫెషనల్స్ లేదా పాత విధానం డాక్యుమెంటేషన్‌ భారంగా భావించే వారికి అనువుగా ఉంటుంది.4.లిక్విడిటీ.. ఆర్థిక సౌలభ్యంతప్పనిసరి పన్ను ఆదా పెట్టుబడుల అవసరాన్ని (ఉదా., PPF, ELSS, లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంలు) తొలగించడం ద్వారా కొత్త విధానం ఖర్చు, ఆదా, లేదా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి డబ్బు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. ఇది కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులకు లేదా లిక్విడిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.5.మెరుగైన స్టాండర్డ్ డిడక్షన్.. ఇతర ప్రయోజనాలుజీతం పొందే వ్యక్తులు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ (గతంలో రూ.50,000 ఉండేది) క్లెయిమ్ చేయవచ్చు. ఫ్యామిలీ పెన్షనర్లు అయితే రూ.25,000 డిడక్షన్ (గతంలో రూ.15,000) పొందవచ్చు. అదనపు డిడక్షన్లలో యాజమాన్యం (పని చేస్తున్న కంపెనీ) ఎన్‌పీఎస్‌ కాంట్రిబ్యూషన్‌ (సెక్షన్ 80CCD(2)), అద్దెకు ఇచ్చిన ఆస్తులపై హోమ్ లోన్ వడ్డీ, అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు విరాళం వంటివి ఉన్నాయి. ఇవి సంక్లిష్ట పెట్టుబడులు లేకుండా కొంత పన్ను ఉపశమనం అందిస్తాయి.ఎవరికి ఎక్కువ ప్రయోజనం?- పెద్దగా డిడక్షన్లు లేకుండా రూ.12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు.- పన్ను ఆదా సాధనాలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టని యువ ప్రొఫెషనల్స్ లేదా కొత్తగా సంపాదించేవారు.- దీర్ఘకాలిక, లాక్-ఇన్ పెట్టుబడులు కాకుండా సరళత, సౌలభ్యాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు.గమనించవలసినవి..కొత్త విధానం ఈ ప్రయోజనాలను అందించినప్పటికీ, ఇది అందరికీ సరిపోకపోవచ్చు. మీకు గణనీయమైన డిడక్షన్లు (ఉదా., రూ.30 లక్షలకు పైబడిన ఆదాయాలకు రూ.3.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ, HRA, సెక్షన్ 80C, లేదా హోమ్ లోన్ వడ్డీతో సహా) ఉంటే, పాత విధానం తక్కువ పన్ను బాధ్యతకు దారితీయవచ్చు. మీ ఆదాయం, డిడక్షన్లు, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా రెండు విధానాలను ఆదాయ పన్ను కాలిక్యులేటర్‌ను ఉపయోగించి పోల్చుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement