నాలుగు రకాల శ్లాబులతో పన్నురేట్లను ఖరారుచేస్తూ జీఎస్టీ మండలి గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రేట్లు 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం తదితర నాలుగు శ్లాబులుగా ఉండనుంది. ఇందులో నిత్యావసర వస్తువులకు కనీస పన్ను విధించనుండగా, విలాసవంతమైన వస్తువులు, ఇతరత్రా వస్తువులకు గరిష్ఠామొత్తం పన్నురేటు వర్తించ నుంది.