టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ తాజాగా మరో 2,850 మంది ఉద్యోగులను తొలగించనున్నది. ఇదివరకు కంపెనీ ప్రకటించిన 1,850 మంది ఉద్యోగుల తొలగింపుతో కలుపుకొని మొత్తంగా కంపెనీ 4,700 ఉద్యోగాల కోత విధిస్తున్నది. ఈ తొలగింపును 2017 ఆర్థిక సంవత్సరం చివరకు పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. నోకియా డీల్ బెడిసికొట్టడం, స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ బిజినెస్‌లో నష్టాలు పెరగడం వంటి పలు అంశాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.
Published Sat, Jul 30 2016 5:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
Advertisement