డ్రగ్స్ కేసులో సినీనటి చార్మిని కేవలం సాక్షిగా మాత్రమే విచారణ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను కోర్టు మంగళవారం ఉదయం విచారించింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు వాయిదా వేసింది.