durgs mafia case
-
మళ్లీ తెరపైకి సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేయడంతో పాటు, మరో 27 మందిని అధికారులు విచారించారు. 60 మంది అధికారులు విచారణ చేశారని ఛార్జ్‌షీట్‌లో అధికారులు పేర్కొన్నారు. 12 కేసుల్లో తొలుత 8 కేసులు మాత్రమే సిట్.. ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. 11 మంది ప్రముఖులతో పాటు రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్‌ను కూడా సిట్ విచారించింది. డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్‌చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
టాలీవుడ్లో డ్రగ్స్ తీసుకోవడం చూశా..
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో డ్రగ్స్‌పై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ తీసుకోవడం ప్రత్యక్షంగా చూశాని, బయటకు చెప్తే తన ప్రాణానికి ప్రమాదమని భయంతో ఎవరికీ చెప్పలేదని అన్నారు. ఎక్సైజ్ విచారణ తర్వాత కూడా టాలీవుడ్ తీరు మారలేదని ఆమె విమర్శించారు. టాలీవుడ్‌లోనూ డ్రగ్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలని మాధవీలత డిమాండ్ చేశారు. ఇటీవల జిన్నారంలో పట్టుబడ్డ వందల కోట్ల డ్రగ్స్‌కి టాలీవుడ్‌కి సంబంధం ఉంటుందని ఆమె ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ విక్రయించేవారు ఎవరు? బాధితులు ఎవరు అనేది అధికారులు తేల్చాలని అన్నారు. సినీ నటులు అందం, ఫిట్నెస్ కోసం మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటారని అన్నారు. (చదవండి : 'డ్రగ్స్ లేనిదే టాలీవుడ్లో పార్టీలు జరగవు') టాలీవుడ్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దృష్టి పెట్టాలని మాధవి లత డిమాండ్ చేశారు. కాగా, బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నటి మాధవీలత మొదటి నుంచి సమర్థిస్తున్నారు. బాలీవుడ్లోనే కాదు,టాలీవుడ్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారని ఆమె ఆరోపించారు. టాలీవుడ్లో జరిగే పార్టీల్లో డ్రగ్స్ వాడుతారని.. అది లేకుండా అసలు పార్టీలు జరగవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007లో వచ్చిన అతిథి చిత్రంతో వెండితెరకు పరిచమైన మాధవిలత , నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా మారింది. నానితో కలిసి స్నేహితుడు మూవీలో నటించింది. -
డ్రగ్స్ కేసులో హీరో నందు విచారణ పూర్తి
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఫోన్‌కాల్స్ డేటా ఆధారంగా వర్థమాన హీరో నందు అలియాస్ ఆనంద కృష్ణను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం ఉదయం నందు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి హాజరయ్యారు. కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నించనున్నామని సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించిన విషయం విదితమే. ఆ దిశగా సిట్ అధికారులు...నందూను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సుమారు మూడు గంటల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారణ జరిపారు. ప్రధానంగా కెల్విన్‌తో సంబంధంపై సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. నందు విచారణతో తొలి విడత విచారణ పూర్తయింది. కాగా వర్ధమాన నటుడు తనీష్‌ను కూడా సిట్ నిన్న ప్రశ్నించిన విషయం విదితమే. ఇప్పటివరకూ సిట్ అధికారులు చిత్రపరిశ్రమకు చెందిన 11మందిని విచారణ చేశారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరా మెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, హీరో రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్ సిట్ విచారణకు హాజరయ్యారు. కాగా తర్వలో మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
‘టాలీవుడ్‌నే టార్గెట్ చేశారనడం సరికాదు’
-
సిట్ ముందు నాలుగుగంటలే
-
సిట్ ముందు నాలుగుగంటలే
ముగిసిన చిన్నా విచారణ మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన ఆర్ట్ డైరెక్టర్ హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదుపుతున్న డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నాపై సిట్ విచారణ ముగిసింది. కేవలం నాలుగు గంటలపాటే ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం మీడియా కంటపడకుండా ఆయన ఎక్సైజ్‌శాఖ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు విచారించారు. ఇప్పటివరకు దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్, నవదీప్‌లను ప్రశ్నించిన సిట్ అధికారుల ఎదుట తాజాగా ఆర్ట్ డైరెక్టర్ చిన్నా వచ్చారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఎప్పటినుంచి డ్రగ్స్ వాడుతున్నారు? సినీ పరిశ్రమలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు చిన్నాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చిన్నా నుంచి వివరాలు రాబట్టిన సిట్ అధికారులు త్వరగా ఆయన విచారణను ముగించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంతో పెద్దగా సంబంధాలు లేవనే ఉద్దేశంతోనే చిన్నా విచారణను త్వరగా విచారించారా? అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు. -
చార్మి పిటిషన్ పబ్లిసిటీ స్టంట్..
-
‘టాలీవుడ్‌నే టార్గెట్ చేశారనడం సరికాదు’
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో చిత్ర పరిశ్రమనే టార్గెట్ చేశారనడం సరికాదని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఈ కేసులో సిట్ అదికారులు అందరినీ విచారణ చేస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. అందులో భాగంగానే సినీ నటులు విచారణకు హాజరవుతున్నారని పోసాని తెలిపారు. అయితే విచారణకు హాజరైన వారిలో కొందరు బ్లడ్ శాంపిల్స్ ఎందుకు ఇవ్వడం లేదనేది వాళ్ల వ్యక్తిగత విషయమన్నారు. అదే తనను అడిగితే స్వచ్ఛందంగా బ్లడ్ శాంపిల్ ఇస్తానని, ప్రభుత్వం సిగరెట్లు, మద్యాన్ని నిషేధించాలని పోసాని విజ్ఞప్తి చేశారు. -
చార్మి పిటిషన్ పబ్లిసిటీ స్టంట్..
►తప్పు చేయకుంటే భయమెందుకు? హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినీనటి చార్మిని కేవలం సాక్షిగా మాత్రమే విచారణ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను కోర్టు మంగళవారం ఉదయం విచారించింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా చార్మి తరఫు న్యాయవాది చేసిన ఆరోపణలను సిట్ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. చార్మి వేసిన పిటిషన్ కేవలం పబ్లిసిటీ స్టంట్ అని, తప్పు చేయకుంటే భయమెందుకని, ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారమే కేసు విచారణ కొనసాగుతోందని అన్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ వెల్లడించిన ఆధారాలతోనే ఈ విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే చార్మి అంగీకారంతోనే ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తామని సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని గతంలో ఆమెకు తెలిపామని.. ఇందుకు చార్మి స్పందించి విచారణ కోసం సిట్ కార్యాలయానికే వస్తానని తెలిపిందని చెప్పారు. మరోవైపు సిట్ విచారణ చట్ట విరుద్ధంగా సాగుతోందని... బలవంతంగా రక్తనమూనా సేకరణ చేయకుండా ఆదేశాలివ్వాలని చార్మీ తరఫు లాయర్ విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ సమయంలో లాయర్‌ను అనుమతివ్వాలని కూడా కోర్టును కోరామన్నారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోమని కోర్టుకు విన్నవించారు. -
చార్మీ పెళ్లి కాలేదు, మినహాయింపు ఇవ్వండి..
-
చార్మీ పెళ్లి కాలేదు, మినహాయింపు ఇవ్వండి..
►పిటిషన్‌పై ముగిసిన వాదనలు, 2.30 గంటలకు తీర్పు ►రక్త నమూనా సేకరణకు చార్మీకి మినహాయింపు ఇవ్వండి ►స్వచ్ఛందంగానే శాంపుల్స్ హైదరాబాద్ : సినీనటి చార్మీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. చార్మీ తరపు న్యాయవాది విష్ణువర్థన్ రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ కేసులో చార్మి నిందితురాలు కాదని, అలాగే సాక్షి కూడా కాదని, అలాంటిది ఆమెకు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం చార్మీకి నోటీసులు ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే బలవంతంగా రక్త నమూనాలు సేకరించడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ విషయాన్ని ప్రస్తావించారు. చార్మికి ఇంకా పెళ్లి కాలేదని, బలవంతపు రక్త నమునా సేకరణ నుంచి ఆమెను ఉపసంహరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే బలవంతంగా ఎవరి వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం లేదని, స్వచ్ఛందంగానే వాళ్లే ఇస్తున్నారని ప్రభుత్వ తరఫు లాయర్ తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారమే డ్రగ్స్ కేసు విచారణ జరుగుతోందని, అంతేకాకుండా ప్రతిదీ వీడియో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. చార్మి అనుమతి ఇస్తే ఆమె ఇంటికే వెళ్లి విచారణ చేస్తామన్నారు. పూరీ జగన్నాథ్ అనుమతితోనే రక్త నమూనాలు సేకరించామని, అలాగే నిన్న నటుడు నవదీప్ నిరాకరించినందునే శాంపిల్స్ తీసుకోలేదన్నారు. కాగా డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్నచార్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె బుధవారం సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయవాది, మహిళా అధికారుల సమక్షంలోనే తన విచారణ జరిపేలా ఎక్సైజ్ అధికారులను ఆదేశించాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా ఆదేశించాలన్నారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా, బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పిటిషన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
హైకోర్టులో చార్మీ పిటిషన్‌పై విచారణ
-
కొనసాగుతున్న సుబ్బరాజు విచారణ
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో మూడోరోజు సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న సుబ్బరాజు విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం (శుక్రవారం) అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్ అధికారులు సుమారు ఎనిమిది గంటలకు పైగా విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. ఓ దశలో సుబ్బరాజు విచారణ ముగిసిందని వార్తలు వెలువడ్డా... మరికొన్ని గంటల పాటు సుబ్బరాజు ప్రశ్నిస్తామని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. కొద్దిసేపు బ్రేక్ ఇచ్చామని, అనంతరం విచారణ కొనసాగుతుందన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 70 పబ్‌లకు నోటీసులు ఇచ్చామని, రేపు పబ్‌లు, బార్ల యజమానులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తమ అదుపులో ఉన్న పలువురు పబ్‌లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం ఇచ్చారని, 16 పబ్‌ల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని వాళ్లు వెల్లడించారన్నారు. రేపు నటుడు తరుణ్‌ను విచారణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 27న ముమైత్ ఖాన్ విచారణకు పిలిచామన్నారు. విచారణ పూర్తయిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. అంతకు ముందు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే కీలక విషయాలు బయటపడుతున్నాయని, ఇవాళ కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ కేసులో లోతుగా విచారణ చేయాల్సి ఉందని, ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఆ వివరాల గురించి విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ లింకులపై ఆధారాలు లభిస్తున్నాయని, అలాగే నోటీసులు అందుకున్న ముమైత్‌ఖాన్, ఛార్మీ కూడా విచారణకు హాజరు అవుతారని ఆయన తెలిపారు. మరోవైపు సుబ్బరాజు రక్తనమునా సేకరణ కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ అధికారులు వరుసగా నోటీసులు ఇచ్చినవారిని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యాం కె నాయుడును విచారణ చేశారు. శనివారం నటుడు తరుణ్ సిట్ ఎదుట హాజరు అవుతారు.