మళ్లీ తెరపైకి సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు | Court Approved Chargesheet Filed By SIT After Four Years In Drugs Case | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు

Published Thu, Jul 1 2021 4:24 PM | Last Updated on Thu, Jul 1 2021 6:55 PM

Court Approved Chargesheet Filed By SIT After Four Years In Drugs Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత సిట్‌ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేయడంతో పాటు, మరో 27 మందిని అధికారులు విచారించారు. 60 మంది అధికారులు విచారణ చేశారని ఛార్జ్‌షీట్‌లో అధికారులు పేర్కొన్నారు.

12 కేసుల్లో తొలుత 8 కేసులు మాత్రమే సిట్‌.. ఛార్జ్‌షీట్ ఫైల్‌ చేసింది. 11 మంది ప్రముఖులతో పాటు రవితేజ, డ్రైవర్‌ శ్రీనివాస్‌ను కూడా సిట్‌ విచారించింది. డ్రగ్స్‌ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్‌చీట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement