వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌! | Kamal hasan ready for the movie sebashnaidu | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 4 2017 4:40 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

వెయిట్‌ అంటే బరువు అనుకునేరు! కాదండీ... ఎదురు చూపులు. లోక నాయకుడు కమల్‌హాసన్‌ కాలికి గాయం కావడంతో కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు కోలుకుంటారో, ఎప్పుడు షూటింగులకు హాజరవుతారోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర పడింది. ఇప్పుడు మేకప్‌ వేసుకోవడానికి కమల్‌ రెడీ! గాయం కారణంగా బ్రేక్‌ పడిన ‘శభాష్‌ నాయుడు’ సినిమాని సెట్స్‌పైకి తీసుకు రావడానికి కమల్‌ రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement