మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మల్కన్గిరి జిల్లా కొడియా, కోరాపూట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14మంది మృతి చెందారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మల్కన్ గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఏవోబీ ప్రాంతంలో బాగా బలంగా ఉన్న మావోయిస్టులకు ఇదే అతి పెద్ద ఎదురుదెబ్బ. మావోయిస్టులు సమావేశం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఘటనా ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. గత నెలలో కూడా ఒడిశాలో తొమ్మిదిమంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు నారాయణపూర్ లో ఓ మహిళా మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Published Sat, Sep 14 2013 9:17 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM