22.34 లక్షల మందికి ఉద్యోగాలు: గవర్నర్ | 22.34 lakh employment opportuniites with cii summit, says governor narasimhan | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2017 12:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

విశాఖపట్నం నగరంలో ఇటీవల నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 10.54 లక్షల కోట్ల విలువైన 665 ఎంఓయూలు కుదిరాయని, దీనివల్ల 22.34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తన ప్రసంగంలో చెప్పారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఆయన తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. మాన్యశ్రీ శాసనమండలి అధ్యక్షులు, శాసనసభ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు అందరికీ అభినందనలన్నారు. 2017-18 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సంయుక్త సమావేశాల్లో ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉంది, దీన్ని మహద్భాగ్యంగా భావిస్తున్నానని, స్వల్పకాలంలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement