పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తప్పులో కాలేశారు. పాకిస్తాన్ పై అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ పేర్కొన్నట్లు వచ్చిన పుకార్లను నమ్మిన ఆయన పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై అణుబాంబుల వర్షం కురిపిస్తుందని అన్నారు. సిరియాలో పాకిస్తాన్ సేనలను మొహరిస్తే అందుకు ప్రతిగా అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నట్లు పుకార్లు వచ్చాయి.