nuclear attack
-
న్యూక్లియర్ వార్‌కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
మాస్కో: ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలను పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలతో దాడి చేసేందుకు రెడీ అయినట్టు హింట్ ఇచ్చాడు.అమెరికా, యూకే సాయంతో ఉక్రెయిన్.. రష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే ‘స్టార్మ్ షాడో’ క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసింది. యూకే పీఎం కైర్ స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో, అప్రమత్తమైన రష్యా.. పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.తాజాగా రష్యా భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో మా దేశంపై దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్‌పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో తాము అణు దాడులు చేసేందుకు వెనుకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. BREAKING:🇷🇺 Vladimir Putin: "We will use NUCLEAR weapons if a mass enemy missile or UAV is launched towards Russia, or when these weapons cross into Russian territory" pic.twitter.com/oDJz1zTTzU— Megatron (@Megatron_ron) September 25, 2024 పుతిన్ హెచరిక తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణలు ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది. ఇక పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్‌తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: 1982 to 2024: ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్జ్బొల్లా రక్తచరిత్ర -
అణు బాంబు దాడిని నిలువరించిన మోదీ!
ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి.. పలు దేశాలు ఆయనకిచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో.. భారీ నష్టం జరగకుండా ఆయన చూపించిన చొరవ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌పై అణు బాంబును వేయాలనుకున్న రష్యా ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపారట!. ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా భద్రతాధికారులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ‘‘2022లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక కొన్నిరోజులకు రష్యా బలగాలకు ఒకదాని వెంట ఒకటి ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో కీవ్ నగరం(ఉక్రెయిన్ రాజధాని)పై అణు బాంబు దాడికి రష్యా దిగబోతోందన్న సమాచారం అమెరికాకు చేరింది. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. మిత్రపక్షంకాని దేశాలతో పాటు భారత్ సహాకారాన్ని కోరింది అగ్రరాజ్యం. .. భారత్, చైనా సహా పలు దేశాలు అణు బాంబు ప్రయోగించాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి చేశాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. అలా తీవ్ర సంక్షోభం తలెత్తకుండా నివారించడంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర దేశాల నుండి వచ్చిన సహకారం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది’’ అని ఆ అధికారులిద్దరూ చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో.. తొలి నుంచి తటస్థ వైఖరి అవలంభిస్తూనే.. మానవ హక్కుల ఉల్లంఘనల చర్యలను ఖండిస్తోంది భారత్. అంతేకాదు ఈ సంక్షోభ ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కారమని చెబుతూ వస్తోంది. ఇక ఉజ్బెకిస్తాన్ వేదికగా కిందటి ఏడాదిలో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు (షాంఘై సహకార సంఘం) సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సమయంలో ‘‘ఇది యుద్ధాల శకం కాదు’’ అని ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన జీ20 సమ్మిట్లోనూ ఈ ప్రకటన హైలైట్ కావడం గమనార్హం. -
అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తరకొరియా
సియోల్: ఉత్తరకొరియా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. తాజాగా పశ్చిమ సముద్ర జలాల్లో అణు దాడి చేసే సామర్థ్యమున్న డ్రోన్‌ను పరీక్షించినట్లు శుక్రవారం ప్రకటించింది. పోర్టులు, యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉందని తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌లు కలిసి ఈ వారంలో జెజు దీవికి సమీపంలో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలకు స్పందనగానే తామీ పరీక్ష జరిపినట్లు చెప్పుకుంది. గత ఏడాది మొదటిసారిగా ఈ డ్రోన్‌ను పరీక్షించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని హెచ్చరించింది. -
ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..
అమెరికా–సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రబలంగా ఉన్న రోజుల్లో ఉభయ శిబిరాలకు పరస్పర ‘అణు’మానాలు ఉండేవి. అందువల్ల ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండేవారు. తమ తమ భూభాగాల్లోని రహస్య ప్రదేశాల్లో అణుబాంబులు మీదపడ్డా చెక్కుచెదరని బంకర్లు నిర్మించుకున్నారు. అప్పట్లో సోవియట్ రష్యా అణుబాంబులను తట్టుకునే భూగర్భ విమానస్థావరాన్ని నిర్మించుకుంది. క్రొయేషియా సరిహద్దుల్లో ప్లజెసెవికా కొండ నడిబొడ్డున నిర్మించిన ఈ జెల్జావా భూగర్భ విమానస్థావరం ప్రపంచంలోని భూగర్భ విమానస్థావరాల్లోనే అతిపెద్దది. అయితే, మూడు దశాబ్దాలుగా ఇది నిరుపయోగంగా పడి ఉంది. సెర్బో–క్రొయేషియన్ యుద్ధం 1992లో మొదలైనప్పటి నుంచి దీని వినియోగం నిలిచిపోయింది. ఇది కేవలం భూగర్భ విమానస్థావరం మాత్రమే కాదు, ఇందులో అనేక సౌకర్యాలు ఉన్నాయి. సోవియట్ పాలకులు 1960లోనే దీనిని 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) ఖర్చుతో నిర్మించుకున్నారు. ఏకంగా 20 కిలోటన్నుల అణువిస్ఫోటాన్ని తట్టుకునేంత శక్తిమంతంగా దీనిని రూపొందించారు. ఇందులో విద్యుదుత్పాదన కేంద్రం, మంచినీటి వడబోత కేంద్రం, గాలి వెలుతురు సోకేందుకు అనువైన నడవలు, వెయ్యిమంది సైనికాధికారులు, సైనిక సిబ్బంది కోసం డార్మిటరీలు, యంత్రాల సాయంతో తెరుచుకునే వంద టన్నుల కాంక్రీటు ద్వారాలు ఉన్నాయి. సైనికులకు అవసరమైన ఆహార పదార్థాలు, ఆయుధాలు నిల్వచేసుకునేందుకు కట్టుదిట్టమైన గిడ్డంగులు ఉన్నాయి. క్రొయేషియా ప్రభుత్వం దీనిని మ్యూజియంగా మార్చింది. ఏటా దాదాపు 1.50 లక్షల మంది పర్యాటకులు ఈ మ్యూజియంను సందర్శిస్తుంటారు. (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
రష్యా అణు యుద్ధ సన్నద్ధత! డ్రిల్స్‌ను స్వయంగా పరిశీలించిన పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో పైచేయి సాధించడమే లక్ష్యంగా రష్యా అధినేత పుతిన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బుధవారం తమ సైనికుల యుద్ధ సన్నద్ధతను ఆయన పుతిన్ స్వయంగా పరిశీలించారు. రష్యా వ్యూహాత్మక అణు దళాలు బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లతో డ్రిల్స్ నిర్వహించాయి. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా సేనలు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ డ్రిల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవేళ తమ దేశంపై అణు దాడి జరిగితే గట్టిగా తిప్పికొట్టాలన్నదే తమ ఉద్దేశమని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు చెప్పారు. తాజాగా ఎక్సర్సైజ్లో భాగంగా ఉత్తర ప్లెసెట్స్క్ లాంచ్ సైట్ నుంచి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. కామ్చాట్కా ద్వీపంలో అణు జలాంతర్గామి ద్వారా సినేవా ఐసీబీఎం క్షిపణిని పరీక్షించారు. అలాగే టూ–95 స్ట్రాటజిక్ బాంబర్ల సాయంతో క్రూయిజ్ క్షిపణులను ఫైర్టెస్టు చేశారు. అన్ని క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు నాటో కూటమి ఉత్తర యూరప్ ప్రాంతంలో వార్షిక మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ నెల 30 దాకా ఈ విన్యాసాలు కొనసాగుతాయి. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అమెరికాకు చెందిన లాంగ్–రేంజ్ బి–52 బాంబర్లు సైతం ఇందులో పాల్గొంటున్నాయి. పరిస్థితి చెయ్యి దాటితే అణ్వస్త్రాల ప్రయోగానికి వెనుకాడబోమని పుతిన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. 40 గ్రామాలపై రష్యా దాడులు కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఉక్రెయిన్‌లోని 40 గ్రామాలపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. దాడుల భయంతో జనం రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపారు. రష్యా సైన్యం ఐదు రాకెట్లు ప్రయోగించిందని, 30 వైమానిక దాడులు, 100కుపైగా మల్టిపుల్–లాంచ్ రాకెట్ సిస్టమ్ దాడులు చేసిందని ఉక్రెయిన్ సైనిక దళాల జనరల్ స్టాఫ్ పేర్కొన్నారు. "We are aware of Ukraine's plans to use a dirty bomb," Putin 🤡 pic.twitter.com/Vt3adkDmTu — ТРУХА⚡️English (@TpyxaNews) October 26, 2022 🚨🇷🇺☢️#Nuclear drill live update: "Under the leadership of Putin, training is being conducted to deliver a massive nuclear strike in response to an enemy nuclear strike" - Shoigu pic.twitter.com/p69BbSG0qE — Terror Alarm (@Terror_Alarm) October 26, 2022 -
రష్యా మొండితనం.. సర్వనాశనానికి సెకన్లు చాలు!
న్యూక్లియర్ ప్లాంట్లను యుద్ధంలో భాగం చేయకూడదు. అవి యుద్ధ స్థావరాలు కాకూడదు. ఉక్రెయిన్ జాపోరిజ్జియా అణు కేంద్రంపై రష్యా దాడుల నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మాట చెప్తోంది. నిజానికి ఇదేం కొత్త మాట కాదు. అలాగే అదొక హెచ్చరిక. ఈ యుద్ధంలో యూరప్‌లోని అతిపెద్ద అణు రియాక్టర్ గనుక పేలితే?.. యూరప్ మొత్తం తుడిచిపెట్టుకుని పోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది ఇప్పుడు. శాంపిల్‌గా.. చెర్నోబిల్ విషాదాన్నే ప్రస్తావిస్తున్నారు. సుమారు 36 ఏళ్ల కిందట(ఏప్రిల్ 26, 1986).. ఒక రాత్రి. చిన్నతప్పిదం, ఏమరపాటుతో వ్యవహరించిన తీరు.. సెకన్ల వ్యవధిలోనే అత్యంత విషాదకరమైన విధ్వంసం చోటు చేసుకుంది. అణు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షిస్తున్న సమయంలో.. కరెంట్ సరఫరా ఆపేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రయోగాలు చేపట్టారు ఇంజినీర్లు. అయితే అప్పటికే అక్కడ చిన్న సమస్య ఉందని గుర్తించలేకపోయారు. నాలుగో నెంబర్ అణు రియాక్టర్లో కూలింగ్ వాటర్ సరఫరా ఆగిపోయి.. ఆవిరి ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఆ దెబ్బకు రియాక్టర్ మూత ఊడిపోయి అందులోంచి ‘కోర్’ బయటకు లీక్ అయ్యింది. చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదం.. పెనువిషాదం చోటు చేసుకుంది. ఘటనలో చెలరేగిన మంటలు పదిరోజుల పాటు మండుతూనే ఉన్నాయి. చెర్నోబిల్ ప్రమాదం జరిగిన టైంలో.. అక్కడికక్కడే చనిపోయింది ఇద్దరే. అటుపై రేడియేషన్ ఎఫెక్ట్‌తో 134 మంది అస్వతస్థకు గురయ్యారు. అందులో 28 మంది కొన్ని నెలలకు, మరికొందరు ఆ తర్వాత చనిపోయారు. కానీ, ఆ ప్రభావం ఏళ్ల తరబడి కొనసాగుతూనే వస్తోంది. ఎంతలా అంటే క్యాన్సర్, చర్మ.. గొంతు సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో సుమారు 2 లక్షల మందికిపైగా చనిపోయారని ఒక అంచనా. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెర్నోబిల్ ప్రమాదంపై పరిశోధనలు చేసిన రీసెర్చలు చెప్తుంటారు. విశేషం ఏంటంటే.. ఆ విషాదం తాలుకా జ్ఞాపకాలు మోస్తూ ఇంకా మంచానికే పరిమితమైన వాళ్లూ ఉన్నారు. బతకడం కష్టమే! చెర్నోబిల్ దుర్ఘటనలో విడుదలైన రేడియో ధార్మికత ప్రభావం కొన్ని వేల కిలోమీటర్లకు విస్తరించింది. హిరోషిమా, నాగసాకిల అణు బాంబు పేలుళ్ల కంటే ఎన్నో రెట్ల రేడియో ధార్మికతను విరజిమ్మింది. సుమారు పదమూడు దేశాలకు రేడియేషన్(ఇందులో రష్యా కూడా ఉంది) విస్తరించింది. ఈ ప్రాంతానికి దూరంగా లక్షల మందిని తరలించి.. నిషేధిత ప్రాంతంగా ప్రకటించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పదుల కిలోమీటర్ల పరిధిలో గట్టి కాపలా ఉంటుంది. చెర్నోబిల్ దుర్ఘటన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నివాస యోగ్యం కాదు. సాగు కూడా నిషేధం. అక్కడ కాసే పండ్లలో, పూసే పువ్వుల్లోనూ రేడియేషన్ ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. రేడియేషన్‌ను తట్టుకోలుగుతున్న కొన్ని జంతువులు మాత్రమే బతకగలుగుతున్నాయి. సోవియట్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న టైంలో జరిగిన ఈ అణు దుర్ఘటన.. ఇప్పటికీ ప్రభావం చూపెడుతోంది. అందుకే ఇక్కడ రోబోలతో అణువ్యర్థాలకు గోరీ కడుతున్నారు. నిషేధిత ప్రాంతం కాబట్టే.. ఇక్కడ ఒక అణు ఇంధన నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం అనుకుంది. కానీ, యుద్ధ పరిణామాలతో అది రష్యా చేతికి వెళ్లింది. రష్యా ఆక్రమణలో భాగంగా పట్టణాల కంటే ముందుగా చెర్నోబిల్నే ఆక్రమించుకుంది రష్యా. ఆ టైంలో రష్యా అణు యుద్ధానికి దిగుతుందేమో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అయ్యింది. కావాలనే రష్యా.. రష్యా యుద్ధ ట్యాంకులకు థర్మల్ ఇమేజ్ స్కానర్లున్నాయి. దేనిపై షూట్ చేస్తున్నారో రష్యా సైనికులకు పక్కాగా తెలుసు. కాబట్టి జాపోరిజ్జియా Nuclear Plantపై జరిగిన దాడి ప్రమాదవశాత్తూ జరిగింది కాదనేది ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆరోపణ. ఒకవేళ ఈ దాడి కావాలనే జరిగినా.. జరిగే నష్టం ఏ రేంజ్లో ఉంటుందో పుతిన్‌కి తెలుసు. ఎందుకంటే చెర్నోబిల్ పరిణామాలను ఆయన దగ్గరుండి చూశాడు.. ఆ ప్రభావానికి గురైన జాబితాలో రష్యా కూడా ఉంది కాబట్టి. అయినా కూడా అణు బూచితో ఉక్రెయిన్ ఆక్రమణలో ముందుకెళ్లాలని చూస్తోంది. ఉక్రెయిన్ను.. మద్ధతుగా వచ్చే దేశాన్ని అణ్వాస్త్ర దాడులతో బూడిద చేస్తామంటూ హెచ్చరిస్తున్నాడు పుతిన్. ఇందులో భాగంగానే ఒకవైపు ప్రధాన నగరాల ఆక్రమణ.. మరోవైపు ఉక్రెయిన్‌లో ఉన్న 15 న్యూక్లియర్ రియాక్టర్ల స్వాధీనం కొనసాగిస్తోంది రష్యా. శుక్రవారం రష్యా బలగాలు దాడి చేసింది, స్వాధీనం చేసుకుంది.. అలాంటి ఇలాంటి రియాక్టర్‌పైన కాదు. యూరప్‌లోనే అతిపెద్ద అణు రియాక్టర్ జాపోరిజ్జియా. జరగరానిది ఏదైనా జరిగితే ఆ విధ్వంసం ఊహించడమే కష్టం. ఎందుకంటే చెర్నోబిల్‌తో పోలిస్తే కొన్ని రెట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. ఉక్రెయిన్ సహా యూరప్ దేశాలు చాలామట్టుకు నామ రూపాలు లేకుండా పోవచ్చు. ఆఖరికి రష్యా కూడా ఆ ప్రతిఫలం అనుభవించాల్సిందే. జాపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్‌లోని ఆరు రియాక్టర్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తూ అది రిన్నోవేషన్లో ఉంది. ఆపరేటింగ్‌లో లేదు. అయితే అందులో అణు ఇంధనం మాత్రం ఉంది. ఆ ఇంధనం కూడా రష్యా నుంచే వచ్చింది. మంటలు అంటుకున్నాక ఆర్పడానికి రష్యా దళాలు ఫైర్ సిబ్బందిని అనుమతించలేదు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది. ఆపై సిబ్బంది అనుమతించడంతో సమయానికి మంటలు ఆపేశారు. ఘోర ముప్పు తప్పింది. అక్కడి వాతావరణంలో రేడియేషన్ లెవల్ కూడా మారలేదు. పుతిన్ ‘అణు దాడి’ హెచ్చరికల వరకు పరిమితం అయితే పర్వాలేదు. చెర్నోబిల్‌లో జరిగిన ఒక చిన్నతప్పిదానికే ఎఫెక్ట్ ఈ రేంజ్లో ఉంటే.. కావాలని దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే.. ఆ ప్రభావం ఇంకా ఏ రేంజ్లో ఊహించడమే భయంకరంగా ఉంది. ::: సాక్షి, వెబ్ ప్రత్యేకం -
రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి..
(వెబ్‌డెస్క్) : ఆగష్టు 6.. జపాన్‌తో పాటు ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదభరితమైన, దుర్దినంగా నిలిచిపోయింది. జపాన్‌లో అతి పెద్ద దీవిగా పేరుగాంచిన హిరోషిమాలో అమెరికన్ బాంబర్ బి–29‘లిటిల్ బాయ్’సృష్టించిన విధ్వంసానికి నేటికి సరిగ్గా 75 ఏళ్లు. సామ్రాజ్య విస్తరణ కాంక్ష, దేశాల మధ్య ఆధిపత్యపు పోరు కారణంగా వేలాది మంది ఉన్నచోటే పడి చచ్చిపోయిన ఈ ఉదంతం మానవాళి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. జన జీవనంతో హడావుడిగా ఉన్న నగరం క్షణాల్లో శ్మశానంలా మారిపోయిన వైనం శత్రుదేశాల ప్రజల చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. అయితే ఆ మహా విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది గానీ... హిరోషిమా వాసుల ఆత్మవిశ్వాసాన్ని కాదు! గడ్డిపోచ కూడా మొలవదని భావించిన ఆ చోటు.. ఇప్పుడు ఆకాశ హార్మ్యాలు, అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, నియాన్ దీపాల వెలుగుజిలుగులతో ‘నక్షత్రాల దీవి’లా అలరారుతోంది. నేటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరంగా ఉనికిని చాటుకుంటోంది. కాలంతో పోటీపడి.. వినాశనానికి ‘విశ్వాసం’తో సమాధానం చెప్పి సగర్వంగా నిలబడింది. భవిష్యత్ తరాలు బాగుండాలని.. ఒక తరం చేసిన సాహసం, త్యాగాల ప్రతిఫలంతో మానవతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అణుబాంబు దాడి చేయడానికి హిరోషిమాను ఎంచుకోవడానికి గల కారణం? అసలు ఆరోజు ఏం జరిగింది? ఎంత మంది చనిపోయారు? అణుబాంబు దాడి తదనంతర పరిణామాలేమిటి? అన్న అంశాలను పరిశీలిద్దాం. టార్గెట్ హిరోషిమానే ఎందుకు? జపాన్‌లో ఉన్న 6,852 దీవుల్లోని అతి పెద్ద దీవి ఇది. హిరోషిమా అంటే వెడల్పైన దీవి అని అర్థం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ప్రాచీన కాలం నుంచే వాణిజ్య కేంద్రగా భాసిల్లింది ఈ దీవి. ఎన్నో కర్మాగారాలకు నెలవు. అంతేగాక జపనీస్ మిలిటరీ, ఆయుధ సంపత్తికి హబ్‌గా ఉండేది. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ను అన్ని రకాలుగా దెబ్బకొట్టేందుకు అమెరికా ఈ నగరాన్ని ఎంపిక చేసుకుందని చెప్పవచ్చు. అణుబాంబు దాడికి కొన్ని రోజుల ముందే ఫైర్ బాంబింగ్ ఆపేసిన అమెరికా.. సరైన సమయం కోసం వేచి చూసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది. ఆగష్టు 6, 1945.. ఆరోజు ఏం జరిగింది? జపాన్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు బీ-29 బాంబర్ ఎనోలా గే.. నాలుగు టన్నుల యురేనియంతో కూడిన బాంబు లిటిల్ బాయ్‌ను అమెరికా హిరోషిమాపై ప్రయోగించింది. 9600 మీటర్ల ఎత్తు నుంచి నగరం నడిబొడ్డున ఉన్న అయోవి బ్రిడ్జ్‌ని లక్ష్యంగా చేసుకుని బాంబును జార విడిచింది. బ్రిడ్జి పైనుంచి కేవలం 600 మీటర్ల ఎత్తులో 43 సెకన్లలోనే లిటిల్ బాయ్ పేలాడు. దీంతో ఒక్కసారిగా భారీ విప్ఫోటనం సంభవించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర అంతా సర్వనాశనమై పోయింది. మంటల(3-4 వేల డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు) ధాటికి అంతా కాలి బూడిదై పోయారు. నగరమంతా పొగతో నిండిపోయింది. విస్పోటనం తర్వాత గంట సేపటి వరకు రేడియోధార్మిక కణాల వర్షం కురుస్తూనే ఉంది. లక్షకు పైగా మరణాలు హిరోషిమాలో లిటిల్ బాయ్ విధ్వంసం ధాటికి డిసెంబరు 31, 1945 వరకు దాదాపు లక్షా నలభై వేల మంది మృతి చెందినట్లు అంచనా. నాటి నగర జనాభాలో(ఆనాటికి 3,50,000) 40 శాతం ఇది. ఘటన సంభవించిన ప్రదేశం నుంచి అర కిలోమీటర్ దూరంలో ఒక్క ప్రాణి కూడా మిగల్లేదు. నేటి వరకు బాంబు ప్రభావం వల్ల మొత్తంగా 3 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా ప్రస్తుతం హిరోషిమా జనాభా దాదాపు 12 లక్షలు. రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి యురేనియం తాలూకు దుష్పరిణామాల వల్ల బాంబు దాడిలో బతికి బయటపడ్డ వారి జీవితం డిసీజ్ ఎక్స్ అనే రోగంతో నరకప్రాయంగా మారింది. రక్తపు వాంతులు, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలతో దాదాపు ఆరు వారాల్లోనే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు కూడా దినదినగండంగానే వెళ్లదీశారు. వివిధ రకాల క్యాన్సర్లు, ఇతరత్రా అనారోగ్య కారణాలతో దయనీయ జీవితం గడిపారు. ప్రభుత్వం వీరి చికిత్స కోసం అనేకానేక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టింది. రెగ్యులర్ చెకప్, ట్రీట్మెంట్తో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించింది. దాదాపు 1,36,700 మందిని హిబాకుష(బాధితులు)లను గుర్తించి సేవలు అందించింది. అయితే బాధిత కుటుంబాల నుంచి ఒత్తిడి కారణంగా 1957లో హిబాకుషాల కోసం ప్రత్యేక చట్టం వచ్చిన తర్వాతే ప్రభుత్వం ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే ఈ రేడియేషన్ తాలూకు రోగాల ప్రభావం కనీసం వంద ఏళ్ళు ఉంటుందని అప్పటి డాక్టర్లు అంచనా వేశారు. కానీ వారి అంచనా తప్పు అని నిరూపించడానికి హిరోషిమా వాసులంతా కంకణ కట్టుకున్నారు. ఇందులో భాగంగా డిసీజ్ ఎక్స్ సోకిన వారంతా ఆటంబాంబ్ క్యాజువాలిటీ కమిషన్‌కి చేరుకుని స్వచ్ఛందంగా తమ శరీరాలని అప్పజెప్పి ఎన్నో ప్రయోగాల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. రాబోయే తరాల క్షేమం కోసం వీటన్నిటినీ పంటి బిగువున భరించి త్యాగధనులయ్యారు. నగరమంతా ఓరెగామి ‘పేపర్ క్రేన్లు’ తమ కోరికలు నెరవేరేందుకు జపాన్ వాసులు పేపర్లు మడిచి కొంగ ఆకారంలో తయారు చేసి వాటిని ఎగురవేస్తారనే కథ ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల వయసులో అణుబాంబు దాడి ప్రభావానికి లోనైన సడాకో సాసకి అనే బాలికకు లుకేమియా బారిన పడింది. పదేళ్ల పాటు మహమ్మారితో పోరాడిన ఆమె.. చికిత్స తీసుకుంటున్న సమయంలో మెడిసిన్ కవర్లను చుట్టి క్రేన్లు తయారు చేసేది. ఈ క్రమంలో పన్నెండేళ్ల వయసులో మరణించిన ఆ బాలికను శాంతి చిహ్నంగా భావిస్తూ నగరమంతా నేడు పేపర్ క్రేన్లు ఎగురవేస్తారు. ఇక అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్,1955లో హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. లొంగిపోయే లోపే లిటిల్ బాయ్, ఫ్యాట్మ్యాన్లతో విధ్వంసం రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించే అంశంపై జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలన్నది నాటి డిమాండ్. అప్పటికి శత్రుదేశాలకు బదులివ్వగల సామర్థ్యం, అధికార బలం అంతగా లేనందున జపాన్ కూడా ఇందుకు సిద్ధమైంది. అయితే జపాన్ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని భావించినందు వల్లే అమెరికా.. హిరోషిమాపై లిటిల్ బాయ్‌ను ప్రయోగించడంతో పాటుగా.. ఆ షాక్ నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో అణుబాంబుతో దాడి చేసిందనే వాదనలు నేటికీ వినిపిస్తున్నాయి. -
హైదరాబాద్‌పై అణుదాడి జరిగితే..
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఆయుధం అణుబాంబు. అణుబాంబు విస్ఫోటన చెందడం వల్ల జరిగే నష్ట తీవ్రత ఊహలకు అందదు. అలాంటి ఆయుధాల సామర్ధ్యాన్ని కొన్ని దేశాలు మరింత పెంచుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఔట్ రైడర్ ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ అణు ఆయుధాల తీవ్రతపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు నడుంబిగించింది. ఈ నేపథ్యంలోనే అణు ఆయుధాలపై పరిశోధన నిర్వహిస్తున్న ఓ నిపుణుడితో వాటి ప్రభావాన్ని లెక్కించింది. అణుదాడి మన ప్రాంతంలో జరిగితే దాని శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ శాంపిల్ టూల్ మ్యాప్‌ను అభివృద్ధి చేసింది. దాని ద్వారా వివిధ ప్రాంతాల్లో అణుదాడి కలుగజేసే నష్టాన్ని ఊహించవచ్చు. అమెరికాకు చెందిన 15కేటీ లిటిల్ బాయ్, 300కేటీ డబ్ల్యూ-87, ఉత్తరకొరియాకు చెందిన 150కేటీ హస్వాంగ్-14 లాంటి అణుబాంబులను హైదరాబాద్‌పై ప్రయోగిస్తే జరిగే నష్ట తీవ్రత ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం. 15కేటీ లిటిల్ బాయ్ 1945 ఆగష్టు 6న రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా విసిరిన లిటిల్‌బాయ్ అణుబాంబును హైదరాబాద్‌పై ప్రయోగిస్తే 1,43,879 మంది ప్రాణాలు కోల్పోవచ్చు. 2, 86, 939 మంది గాయాలపాలు కావొచ్చు. లిటిల్ బాయ్ బాంబును ప్రయోగించిన చోటు నుంచి 0.07 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసిపడతాయి. బాంబు దాడి నుంచి ఉద్భవించే రేడియేషన్ పరిధి 2.18 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాడి వల్ల ఉత్పత్తి అయ్యే వేడి ప్రభావం 3.44 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు. 300కేటీ డబ్ల్యూ-87 అమెరికానే అభివృద్ధి చేసిన 300కేటీ డబ్ల్యూ-87 అణుబాంబుతో హైదరాబాద్‌పై దాడి జరిగితే నష్ట తీవ్రత లిటిల్ బాయ్ వల్ల జరిగే దాని కన్నా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఈ దాడిలో ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. 13 లక్షలకు పైచిలుకు ప్రజలు గాయపడొచ్చు. 300కేటీ డబ్ల్యూ-87ను విస్ఫోటనం చెందిన ప్రదేశం నుంచి 0.73 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసిపడతాయి. పేలుడు నుంచి ఏర్పడే రేడియేషన్ పరిధి 5.56 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాడి వల్ల ఉత్పత్తి అయ్యే వేడి ప్రభావం 48.54 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు. 150కేటీ హస్వాంగ్-14 ఉత్తరకొరియా అభివృద్ధి చేసిన హస్వాంగ్-14 అణుబాంబును హైదరాబాద్‌పై ప్రయోగిస్తే ఆ దాడిలో ఎనిమిది లక్షల మందికి పైచిలుకు ప్రాణనష్టం వాటిల్లొచ్చు. 13 లక్షలకు పైచిలుకు ప్రజలు గాయపడొచ్చు. హస్వాంగ్-14 విస్ఫోటనం చెందిన ప్రదేశం నుంచి 0.42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నిజ్వాలలు ఎగసిపడతాయి. పేలుడు నుంచి వచ్చే రేడియేషన్ పరిధి 4.56 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. వేడి ప్రభావం 26.42 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు. అణు దాడులకు సంబంధించిన ఊహాజనిత నష్టాలను అణు ఆయుధాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త అలెక్స్ వెల్లర్‌స్టెయిన్ అభివృద్ధి చేసిన టూల్ ద్వారా అంచనా వేస్తున్నారు. ఔట్ రైడర్ ఫౌండేషన్ సైతం అణు ఆయుధాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏళ్లుగా కృషి చేస్తోంది. 2017లో ఐ-సీఏఎన్ అనే సంస్థ అణ్వస్త్ర నిరాయుధీకరణకు కృషి చేస్తున్నందుకు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. -
శ్మశానం ముందు తమ్ముడి శవంతో..
సాక్షి, వెబ్ డెస్క్ : లోకం చీకటిమయంగా మారడానికి కారణమైన అణు యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. రెండేళ్ల తమ్ముడి శవాన్ని వీపునకు కట్టుకుని శ్మశానవాటికకు మోసుకెళ్తున్న పదేళ్ల బాలుడి చిత్రం గురించి ప్రత్యేకించి చర్చించారు. అమ్మ ఒడి నుంచి బయటకు రాని పసివాళ్ల చుట్టూ ఉన్న లోకం చీకటి మయం కావడానికి కారణం రెండో ప్రపంచ యుద్ధమని అన్నారు. జపాన్ దేశంలో ఆరేళ్లుగా జరగుతున్న రెండో ప్రపంచయుద్ధ మారణకాండ ఆగష్టు 9, 1945న ఉగ్రరూపం దాల్చింది. జపాన్‌లోని నాగసాకిపై అమెరికా అణుబాంబును విసిరింది. దీంతో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర మారణకాండకు సంబంధించిన చిత్రాలను అమెరికా మెరైన్స్ ఫొటోగ్రాఫర్ జోయ్ ఒ డొన్నెల్ తన కెమెరాలో బంధించారు. 1945 అణుబాంబు దాడి అనంతరం నాలుగేళ్ల పాటు డొన్నెల్ జపాన్‌లోనే ఉన్నారు. ఆయన తీసిన వందల చిత్రాల్లో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడిది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని చూసిన పోప్ ఫ్రాన్సిస్ చలించిపోయారు. యుద్ధ పరిణామాల గురించి ఈ ఫొటో చెబుతున్నంత స్పష్టంగా మరేదీ చెప్పలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో బాలుడి బాధ వర్ణానాతీతం అని చెప్పారు. పళ్లతో పెదవులను అదిమిపెట్టి బాధను ఓర్చుకునేందుకు బాలుడు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ట్రంప్ వర్సెస్ కిమ్ ఉత్తరకొరియా పదే పదే అణుదాడిపై మాట్లాడుతున్న నేపథ్యంలో అణు ఆయుధ వ్యతిరేక సమావేశంలో ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగసాకిపై అణు దాడి ఫొటోలను తిలకించారు. శ్మశానవాటికలో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడి క్షోభ ప్రపంచ దేశాలకు అర్థం కావాలని, అందుకే ఈ ఫొటోను పునః ముద్రించి అందరికీ పంచాలని కోరారు. అణు హెచ్చరికలపై కిమ్ దేశంతో చర్చలు జరిపేందుకు వాటికన్ సిటీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
‘చావును జయించొచ్చు’
బీజింగ్ : అమెరికా - ఉత్తరకొరియాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎప్పుడేం జరుగుతుందో అనే భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉత్తరకొరియా అత్యంత శక్తిమంతమైన హస్వాంగ్ -15ను పరీక్షించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా కొరియన్ పెనిసులాపై దక్షిణ కొరియా - అమెరికా ‘ఆపరేషన్ ఉత్తరకొరియా’ పేరుతో కనివీనీ ఎరుగని రీతిలో వాయు దళ డ్రిల్‌ను చేపట్టాయి. దీంతో అణు దాడి గురించి ఉత్తరకొరియాకు చేరువలోని దేశాలు వణికిపోతున్నాయి. కిమ్ దేశానికి చేరువలో ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. ఉత్తరకొరియా సరిహద్దులో ఉన్న చైనా రాష్ట్రంలోని ప్రజల్లో అణు దాడి భయాన్ని పొగొట్టేందుకు ఆ రాష్ట్రంలోని ఓ నగరమైన జిలిన్కు చెందిన జిలిన్ డెయిలీ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ‘కామన్ సెన్స్’ ఉంటే అణు దాడి నుంచి అవలీలగా బయటపడొచ్చని దిన పత్రిక తన కథనంలో పేర్కొంది. పూర్తిగా ఓ పేజీని ఈ స్టోరీకి కేటాయించిన దిన పత్రిక.. సాధారణ ఆయుధాలతో పోలిస్తే అణ్వాయుధాలు ఎలా భిన్నంగా ఉంటాయో తొలుత వివరించింది. అణు దాడి జరిగినప్పుడు ప్రజలు కాలువల్లో దాక్కోవాలని, చర్మం బయటకు కనబడకుండా దుస్తులు ధరించాలని చెప్పింది. ఇవి కుదరనప్పుడు నదులు, సరస్సుల్లో ఎక్కువ సేపు మునిగి ఉండటం ద్వారా మరణాన్ని జయించొచ్చని తెలిపింది. పత్రికలో ప్రచురించే కార్టూన్‌ను కూడా అణుదాడి నుంచి తప్పించుకోవడం ఎలానో అర్థమయ్యేలా వేశారు. అణుదాడి జరిగినప్పుడు ప్రాణాలు ఎలా పోతాయో వివరించడానికి హిరోషిమా, నాగసాకి ఘటనలను క్లుప్తంగా ప్రస్తావించారు. -
అణ్వస్త్ర రక్షణ బంకర్లొచ్చాయి!
సియోల్ : ఉత్తర కొరియా నిరంతరంగా అణ్వస్త్ర క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తుండడం, వాటిని అమెరికా, దాని మిత్ర దేశాలపై ప్రయోగిస్తామంటూ తరచు బెదిరిస్తుండడంతో భయపడి పోయిన దక్షిణ కొరియా ప్రజలు అణ్వస్త్ర రక్షణ బంకర్ల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రజల భయాన్ని, వారి అవసరాన్ని గుర్తించిన చుందన్ బంకర్ సిస్టమ్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. వీటి ప్రదర్శన కోసం సియోల్‌లో ఓ షోరూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. అణ్వస్త్రాల దాడి నుంచి వెలువడే విష వాయువులు, కురిసే ఆమ్ల వర్షాల నుంచి రక్షించే సదుపాయాలు కూడా ఈ బంకర్లలో ఉన్నాయి. ఇందులో ప్రాథమికంగా నాలుగు బెడ్లు ఉన్నాయి. అవసరార్థం వీటిని ఎనిమిది బెడ్లుగా మార్చుకోవచ్చు. ఎనిమిది మంది నెల రోజుల పాటు ఇందులో సౌకర్యంగా ఉండేందుకు అవసరమైన ఫిల్టర్ గాలి, ఆహార పదార్థాలు నిల్వ చేసుకునే స్థలంతోపాటు ఓ ఫ్రిడ్జ్, కంప్యూటర్లు ఉన్నాయని కంపెనీ యజమాని గో వాన్ హైయోక్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశామని, అయినప్పటికీ అత్యయిక పరిస్థితుల్లో నెల రోజులపాటు విద్యుత్‌ను ఉత్పత్తిచేసే జనరేటర్లు కూడా అమర్చారని తెలిపారు. అణ్వస్త్ర దాడి అనంతరం బయట సాధారణ పరిస్థితులు నెలకొన్నాయా, లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు పెరిస్కోప్ కూడా ఉందన్నారు. మరుగుదొడ్డి లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు విష వాయువులు, ఆమ్ల వర్షాల నుంచి రక్షించే మాస్క్‌లు, గ్లౌస్లు, ఫ్యామిలీ గౌన్ల కూడా బంకర్లలో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ బంకర్లను ఇంటి ఆవరణలో భూ ఉపరితలం కింద ఏర్పాటు చేసుకొనే వెసలు బాటు ఉంది. అత్యయిక పరిస్థితుల్లో అందులోకి వెళ్లేందుకు భూ ఉపరితలం నుంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలున్న ఈ బంకరు ధరను 20 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ప్రజలు వీటిని కొనేందుకు ఎగబడుతున్నారని, ప్రస్తుతం వారి డిమాండ్‌ను అందుకోలేక పోతున్నామని గో వాన్ తెలిపారు. దేశీయ అవసరాలు తీరాక, యూరప్, బ్రిటన్ మార్కెట్లోకి కూడా అడుగు పెడతామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ప్రజలు ఉపయోగించే అణ్వస్త్ర రక్షణ బంకర్లను తయారు చేయడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. -
అణు దాడికి రంగం సిద్ధం..!!
ప్యాంగ్యాంగ్ : అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, గ్వామ్ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అణు బాంబులు విసిరేందుకు సిద్ధమయ్యారనే రిపోర్టులు వస్తున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లోని 15 ప్రదేశాలపై అణు దాడి జరగొచ్చని యూరోపియన్ కమిషన్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్(ఈయూఎఫ్ఆర్) పేర్కొంది. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలను పలుమార్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పింది. ఉత్తరకొరియా ఎంచుకున్న ప్రదేశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోకొంత గుర్తింపు కలిగినవేనని తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్ సాయంతో ఈ సమాచారం సంపాదించగలిగినట్లు వివరించింది. ఉత్తర కొరియా లక్షిత ప్రాంతాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని ప్రదేశాలు : వైట్‌హౌస్, పెంటగాన్, న్యూయార్క్, మన్‌హట్టన్, అమెరికా ముఖ్య నగరాలు జపాన్‌లోని ప్రదేశాలు : మిసావా, టొక్యో, ఒసాకా, యోకోహామా, క్యోటో దక్షిణ కొరియాలోని ప్రదేశాలు : సియోల్, బుసాన్, గ్యాంన్నెయంగ్ ఈ రిపోర్టును బయటకు వెలువరించడంపై కూడా యూరోపియన్ యూనియన్ ఫారిన్ రిలేషన్స్ వివరణ ఇచ్చింది. ఇలాంటి వాటిని బయటపెట్టడం వల్ల ఉత్తరకొరియాలో మళ్లీ కదలికలు మొదలవుతాయని చెప్పింది. అలాంటి పరిస్థితి ఆ దేశం దాడికి ఎప్పుడు దిగుతుందో తెలిసే అవకాశం కలుగుతుందని వివరించింది. -
వార్ రూమ్‌లో కిమ్: 17 నిమిషాల్లో గ్వామ్ ముక్కలు!
ప్యాంగ్యాంగ్: గ్వామ్ ద్వీపాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా-ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు పేలిన తర్వాత పసిఫిక్ సముద్ర జలాల్లో ఉన్న అమెరికాకు చెందిన గ్వామ్ ద్వీపంపై అణు దాడి చేస్తామని, అందుకు తగిన ప్రణాళికను కూడా సిద్ధం చేశామని కిమ్ రాజ్యం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్వామ్‌పై దాడికి కిమ్ నేతృత్వంలోని కీలక అధికారులు సమావేశమైన 'వార్ రూమ్' చిత్రాలను ఆ దేశ మీడియా బయటకు విడుదల చేసింది. ఓ చిత్రంలో గ్వామ్ ద్వీపానికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను కిమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వెనుక భాగంలో కొరియా, జపాన్ దేశాల సముద్రజలాల్లో ఉన్న అమెరికా బేస్‌లకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. కిమ్‌కు సహకరిస్తున్న వారిలో ఉత్తరకొరియా రాకెట్ పితామహుడు కిమ్ జాంగ్ సిక్ కూడా ఉన్నారు. ఉత్తరకొరియా అణు శక్తి కలిగిన క్షిపణులను తయారు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఉత్తరకొరియాకు తూర్పున ఉన్న ఓ నావల్ బేస్ నుంచి జపాన్ మీదుగా గ్వామ్‌పై దాడి చేసేందుకు కిమ్ వ్యూహం రచించారని దక్షిణ కొరియాకు చెందిన మిలటరీ నిపుణుడు ఒకరు తెలిపారు. నాలుగు మధ్యతరహా శ్రేణి క్షిపణులను ఉత్తరకొరియా గ్వామ్ మీద ప్రయోగిస్తుందని చెప్పారు. ఇవి 17 నిమిషాలు పాటు 3,356 కిలోమీటర్లు ప్రయాణించి గ్వామ్ ద్వీపానికి 40 కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాలను ఢీ కొంటాయని వివరించారు. అయితే, అమెరికా సోమవారం ఉత్తరకొరియా విషయంలో ఆచితూచి వ్యవహరించినట్లు కనిపించింది. దీంతో మరికొన్ని రోజుల పాటు గ్వామ్‌పై దాడి చేయాలనే ఆలోచనను ఉత్తరకొరియా పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. -
అణు దాడి చేయనున్న ఉత్తరకొరియా!
-
అమెరికా ముందు ఆరు మార్గాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మాటలు తూటాలై పేలుతుండటంతో ప్రపంచమంతటా యుద్ధమేఘాల భయం అలముకుంది. పలుమార్లు అమెరికాపై అణుదాడి చేస్తామని హెచ్చరించిన ఉత్తరకొరియా నియంత కిమ్ రక్తం ఎప్పుడూ మరుగుతూనే ఉంటుందేమో. అందుకు ప్రతిగా వయసులో పెద్దవాడైన ట్రంప్ కూడా సంయమనం పాటించకుండా కామెంట్లు చేస్తున్నారు. గత యుద్ధాల నుంచి పాశ్చాత్య దేశాలు నేర్వాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఆపదల సమయంలో సంయమనం పాటించి వ్యూహం రచించక నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఉత్తరకొరియాను అదుపు చేయడానికి అమెరికా ముందు ఆరు మార్గాలు ఉన్నాయని ఆక్సఫర్డ్‌కు చెందిన క్రైసిస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మార్క్ ఆల్మండ్ చెప్పారు. వాటిని ఓ సారి చూద్దాం. భారీ దాడికి పోవద్దు అణు ఆయుధాలను తయారు చేస్తున్న ఉత్తరకొరియాపై 1994లో అమెరికా అధ్యక్షుడు క్లింటన్ బాంబర్స్‌తో దాడి చేయించారు. అయితే, అప్పుడు ఉత్తరకొరియా పరిస్ధితి వేరు. ఆ దాడిలో తమ స్ధావరాలను కాపాడుకోలేక ఆ దేశం చతికిలపడింది. కానీ నేటి ఉత్తరకొరియా ఆయుధసంపత్తిలో ఆరి తేరింది. జపాన్, దక్షిణకొరియా, గ్వామ్లలో ఉన్న వాయుదళంతో అమెరికా ఉత్తరకొరియా అణుస్ధావరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే క్షిపణులను అప్పటికప్పుడు తరలించగల శక్తిని జోంగ్ దేశం సాధించింది. అంతేకాదు ఉత్తరకొరియా తాజాగా తయారుచేసుకున్న క్షిపణులను కొద్ది సమయంలోనే సిద్ధం చేసి ప్రయోగించొచ్చు. కాబట్టి, భారీ ఎయిర్స్ట్రైక్తో ఉత్తరకొరియాను అడ్డుకుందామని అనుకుంటే అమెరికా బొక్కబొర్లా పడటం ఖాయం. పూర్తి సైన్యంతో దిగాల్సిందే.. తొలి ఉత్తరకొరియా యుద్ధంలో ఆ దేశానికి నేవీ లేదు. కాబట్టి అమెరికా బలగాలు సముద్రతీరం నుంచి ప్యాంగ్యాంగ్కు వెళ్లడానికి పెద్దగా కష్టపడాల్సిరాలేదు. కానీ, ప్రస్తుత పరిస్ధితి మారిపోయింది. ఉత్తరకొరియా పూర్తిస్ధాయిలో సైన్యాన్ని నిర్మించుకుంది. ఇలాంటి దశలో అమెరికా కేవలం దక్షిణకొరియాలో ఉన్న తన సైన్యాన్ని వినియోగించి యుద్ధరంగంలోకి దిగితే ఓటమి చవిచూడక తప్పదు. ఇలాంటి స్ధితిలో అమెరికా ఆప్ఘనిస్తాన్, ఇరాన్లలో మొహరించిన తన సైన్యాన్నంతటినీ ఉత్తరకొరియాకు తరలించాలి. ఇలా చేయడం అసాధ్యం. కాబట్టి అమెరికా దక్షిణకొరియాకు ఉన్న ఆరు లక్షల యాభై వేల మంది సైన్యాన్ని యుద్ధానికి పంపాలని కోరే అవకాశం ఉంది. కానీ దక్షిణకొరియా అమెరికా అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే.. అమెరికాకు సైన్యాన్ని ఇవ్వడం వల్ల ఉత్తరకొరియా దక్షిణకొరియాపై అణుదాడి చేయడం ఖాయం. ఇకపోతే చైనా. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్న ఆ దేశానికి.. తమ ప్రాంతంలోని ఓ దేశంపై అమెరికా దండెత్తడం రుచించకపోవచ్చు. కాబట్టి ఉత్తరకొరియాపై యుద్ధాని కంటే ముందు అమెరికా.. చైనాతో చర్చించాల్సివుంటుంది. లేకుంటే ఉత్తరకొరియా-అమెరికాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు. వీటన్నింటిని దాటి అమెరికా భారీ సైనిక దళంతో ఉత్తరకొరియాలో ప్రవేశించాలని చూసినా.. జరిగే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కిమ్ వద్ద దాదాపు 60కు పైగా అణు ఆయుధాలు, లెక్కకు మించిన రసాయన, జీవ ఆయుధాలు ఉన్నాయి. సైన్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి ఉత్తరకొరియా అణు ఆయుధ స్ధావరాలను నాశనం చేయడం ఒక్కటే అమెరికాను విజయతీరాలకు చేర్చదు. రక్త దాహానికి అలవాటు పడ్డ కిమ్ లాంటి నియంతను నామరూపాల్లేకుండా చేయాలంటే ఆ దేశ సైన్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించగలగాలి. కనిపించిన సైనికుడిని నరికిపారేసి మారణహోమం సృష్టించాలి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, అతని కీలక కమాండర్లు కౌంటర్ అటాక్‌కు ప్లాన్ చేసే లోపే స్మార్ట్ బాంబు సాయంతో వారిని మట్టుబెట్టగలగాలి. ఒకవేళ కిమ్‌ను అంతం చేయడం మిస్ అయితే, పొరుగుదేశాలైన జపాన్, దక్షిణకొరియా, ఉత్తరకొరియా రేంజ్‌కు అందుబాటులో ఉన్న ప్రతి బేస్ సర్వనాశనం అవుతుంది. ఒకవేళ అమెరికా-దక్షిణకొరియా బలగాలు ఉత్తరకొరియాను తమ అదుపులోకి తీసుకున్నా.. గెరిల్లా యుద్ధాలు మాత్రం ఆగవు. పెద్ద సంఖ్యలో ఉత్తరకొరియన్లు చైనాకు శరణార్థులుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అమెరికా అణు దాడి అగ్రరాజ్యం అణు దాడే శరణ్యంగా భావించే ఉత్తరకొరియా ప్రపంచపటం మీద లేకుండా చేస్తే మిగిలిన ప్రపంచదేశాలు ఆత్మరక్షణలో పడతాయి. అంతేకాదు అమెరికాతో ఏర్పడిన సైనిక కూటములుగా ఏర్పడిన దేశాలు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాయి. చైనా, రష్యాలాంటి దేశాలు భారీ స్ధాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచి ఆయుధసంపత్తిని పెంచుకుంటాయి. చైనాపై ఒత్తిడి చైనాను బతిమాలో బామాలో ఉత్తరకొరియాపై ఒత్తిడి తీసుకొద్దామని ట్రంప్ గతంలో ప్రయత్నించారు. కానీ అవి సఫలం కాలేదు. మరికొంత ఒత్తిడి తెచ్చేందుకు చైనాను హెచ్చరించారు కూడా. అయినా ప్రయోజనం లేదు. కారణం ఉత్తరకొరియాతో చైనాకు ఉన్న సత్సంబంధాలు కూడా అంతంతమాత్రమే. చైనాతో అంటి ముట్టనట్లు ఉంటున్న ఉత్తరకొరియా.. తామరకుపై నీటి బిందువు వలే ఎప్పుడైనా జారిపోయేందుకు సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ చర్య ప్యాంగ్యాంగ్ పదేళ్ల క్రితం అణు పరీక్షలు చేయడం ప్రారంభించిన నాటి నుంచే యూఎన్ భద్రతామండలి ఆ దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూనే ఉంది. ఈ విధంగా చూస్తే అమెరికాకు, రష్యా, చైనాల మద్దతు కూడా బలంగా ఉంది. ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించేందుకు ఆ దేశాలు వెనుకాడటం లేదు. బాహ్య ప్రపంచం నుంచి ఉత్తరకొరియాకు వాణిజ్యపరంగా సహాకారం అందిస్తుంది కూడా ఈ రెండు దేశాలు కావడం గమనార్హం. వాణిజ్యాన్ని నిలిపివేయాలనే తీర్మానం చేయడం వల్ల ఉత్తరకొరియా అతలాకుతలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలా చేస్తే రష్యా, చైనాల మీద కిమ్ అణుదాడికి వెనుకాడకపోవచ్చు. -
అణు దాడి చేయనున్న ఉత్తరకొరియా!
సియోల్/న్యూజెర్సీ: పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధీనంలో ఉన్న ఓ ద్వీపంపై అణుదాడి చేయడానికి ఉత్తరకొరియా పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది. ఉత్తరకొరియాకు 2,128 మైళ్ల దూరంలో ఉన్న గువాం ద్వీపంపై దాడి చేయన్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉత్తరకొరియాపై చేసిన వ్యాఖ్యలే దాడి నిర్ణయానికి కారణమని వెల్లడించింది. గువాం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం. ఈ ద్వీప జనాభా కేవలం ఒక లక్షా అరవై వేలు. దీని తీరంలో అమెరికాకు చెందిన సబ్ మెరైన్ల స్క్వాడ్రన్, ఒక ఎయిర్‌బేస్, కోస్ట్ గార్డు గ్రూప్‌లు ఉన్నాయి. వాటన్నింటిని నాశనం చేసేందుకు పక్కావ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఉత్తరకొరియా చెప్పింది. తమ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ ఆమోదించిన మరుక్షణమే.. గువాంను ప్రపంచపటంలో లేకుండా చేస్తామని ఉత్తరకొరియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఒక వేళ గువాంపై దాడిని అమెరికా అడ్డుకోదలిస్తే.. ఆ దేశ ప్రధాన భూభాగంపై కూడా బాంబులు వేస్తామని ఉత్తరకొరియా మిలటరీ ప్రతినిధి ఒకరు అన్నారు. ఉత్తరకొరియా తాజా ప్రకటనతో ప్రపంచమార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో ఆ దేశంపై దుందుడుకుతనంతో వ్యాఖ్యలు చేయొద్దని కంపెనీలు అమెరికాను అభ్యర్థిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన ఏంటంటే.. మంగళవారం న్యూజెర్సీలో విలేకరుల సమావేశంలో ఉత్తరకొరియాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికాను ఉద్దేశిస్తూ పదేపదే ప్రకటనలు చేయకపోవడం ఆ దేశానికి మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఉత్తరకొరియా వరుసగా జరుపుతున్న ఖండాంతర అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలను యూఎస్ ఏకగ్రీవంగా ఖండించింది. ఆ దేశానికి వ్యతిరేకంగా ఈ తీర్మానం రావడం వెనుక అమెరికా హస్తం ఉందని ఉత్తరకొరియా బలంగా నమ్ముతోంది. -
కిమ్ వేడుకలు: అమెరికాపై బాంబు వేస్తాం
టోక్యో: ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్యోంగ్యాంగ్లో సంబరాలు అంబరాన్నంటాయి. త్వరలోనే అణు వార్‌హెడ్‌ను మోసుకుని అమెరికా భూభాగాన్ని చేరుకోగల సామర్ధ్యం కలిగిన క్షిపణిని తయారు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉత్తరకొరియా ఇంటర్మీడియెట్ రేంజ్ క్షిపణిని పరీక్షించింది. 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్రజలాల్లో కూలి పోయింది. దక్షిణకొరియా అధ్యక్షుడిగా మూన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఉత్తరకొరియా ప్రయోగించిన ఇంటర్మీడియెట్ రేంజ్ మిస్సైల్ క్రమంగా ఖండాంతర క్షిపణి తయారీకి బాటలు వేస్తుందని అమెరికా రాకెట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ప్రయోగాల కంటే కొన్ని రెట్ల మెరుగైన ఫలితాలు ఈ క్షిపణి ప్రయోగంతో ఉత్తరకొరియా చూసిందని తెలిపారు. కేవలం ఒక ఏడాదిలోపే ఖండాతర క్షిపణి వ్యవస్ధను ఉత్తరకొరియా చేరుకోగలదని భావిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు ఖండించాయి. క్షిపణి ప్రయోగంపై ప్రకటన విడుదల చేసిన ప్యోంగ్యాంగ్ మీడియా.. దాని పేరును హ్వాసంగ్-12గా పేర్కొంది. అమెరికా మిలటరీ బలగాలతో తమను రెచ్చగొట్టేందుకు యత్నిస్తే గట్టిగా బదులిస్తామని ఆ దేశం హెచ్చరించింది. విపత్కర పరిణామాలు చూడాలనుకుంటే తమతో పెట్టుకోవాలని అంది. -
ఉత్తరకొరియా దెబ్బకు ట్రంప్ ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్: ఉత్తర కొరియా దెబ్బకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?. తాజా పరిణామాలు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. ఉత్తర కొరియాను అదుపు చేయడానికి చైనా సహకరిస్తే బావుంటుందని ట్రంప్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీట్ ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ ట్వీట్‌ను చైనా చూసి చూడనట్లు ఊరుకుంది. ఉత్తర కొరియా సముద్ర జలాల చేరువలోకి అమెరికా యుద్ధ నౌకలు వెళ్లడంతో ఆ దేశం అమెరికాపై అణుదాడికి తాము వెనుకాడమని ప్రకటించింది. ఉత్తరకొరియా ప్రకటనతో ఒక్కసారిగా ప్రపంచదేశాలు షాక్‌కు గురయ్యాయి. అగ్రరాజ్యంపై ఉత్తరకొరియా వ్యాఖ్యల ధైర్యాన్ని చూసి కొన్ని దేశాలు లోలోపలే నవ్వుకున్నాయి కూడా. ఉత్తరకొరియా కలవరం ట్రంప్‌ను నిద్రపోనిస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే చైనా ద్వారా ఆ దేశానికి చెక్ పెట్టాలని ట్రంప్ యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చైనాతో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌తో తన కెమిస్ట్రీ బాగుందంటూ ట్రంప్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం జిన్ పింగ్‌కు ట్రంప్ ఫోన్ చేశారు. వ్యాపార సంబంధాల విషయం గురించే కాక మరెన్నో అంశాలు చర్చించుకున్నామని మీడియాతో చెప్పుకొచ్చారు ట్రంప్. చైనాతో మంచి వ్యాపారసంబంధాలు పెంచుకోవడం వల్ల ఉత్తరకొరియాను అదుపు చేయడం సులువు అవుతుందని తాను అనుకుంటున్నట్లు వివరించారు. -
మమ్మల్ని రెచ్చగొడితే అమెరికాపై అణుదాడి చేస్తాం
అమెరికా యుద్ధనౌకలు పంపుతూ, వాటిలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన యుద్ధవిమానాలు కూడా పంపుతూ తమను రెచ్చగొడితే.. తాము చేతులు ముడుచుకుని కూర్చునేది లేదని, తాము కూడా అమెరికా మీద అణు దాడి చేస్తామని ఉత్తర కొరియా ఘాటుగా హెచ్చరించింది. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక మీడియాలో వెల్లడించారు. సిరియా మీద క్షిపణి దాడులు చేసిన తర్వాత అక్కడి నుంచి అమెరికా యుద్ధనౌకలు ఉత్తరకొరియా దిశగా వెళ్లిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కొరియా తీరంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా గనక ఏమైనా చర్యలు తీసుకుంటే ఉత్తరకొరియా ఆరోసారి అణ్వస్త్ర పరీక్ష చేయొచ్చని నిపుణులు అంటున్నారు. అమెరికా ఎలాంటి దూకుడు ప్రదర్శించినా దాన్ని ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా అధికారిక వార్తాపత్రిక రాడాంగ్ సిన్మున్ పేర్కొంది. బలమైన తమ సైన్యం శత్రువు యొక్క ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తోందని, కేవలం దక్షిణ కొరియాలో మాత్రమే కాక.. అమెరికా భూభాగంతో పాటు.. ఆ దేశ యుద్ధక్షేత్రాలు ఎక్కడున్నా వాటిమీద తమ అణ్వస్త్రాల దృష్టి ఉంటుందని ఆ కథనంలో తెలిపింది. కాగా, ఉత్తరకొరియా బాగా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు హ్వాంగ్ క్యో ఆన్ అన్నారు. తమ సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉండటంతో పాటు అమెరికాతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలన్నారు. అసెంబ్లీ వార్షికోత్సవం సహా ఏ వార్షికోత్సవాలు జరిగినా ఉత్తర కొరియా మరోసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని హ్వాంగ్ చెప్పారు. ఈ శనివారం కిమ్ జోంగ్ ఉన్ తాత, ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి. దాంతో రాజధాని ప్యాంగ్యాంగ్లో సైనిక కవాతు జరుగుతుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ తన అణ్వస్త్ర లేదా క్షిపణి సామర్థ్యాలను ఇలాంటి వార్షికోత్సవాల సమయంలో ప్రదర్శించడం ఉత్తరకొరియాకు అలవాటు. -
అణు బాంబు వేస్తాం: పాకిస్తాన్
-
అణు బాంబు వేస్తాం: పాకిస్తాన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తప్పులో కాలేశారు. పాకిస్తాన్ పై అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ పేర్కొన్నట్లు వచ్చిన పుకార్లను నమ్మిన ఆయన పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై అణుబాంబుల వర్షం కురిపిస్తుందని అన్నారు. సిరియాలో పాకిస్తాన్ సేనలను మొహరిస్తే అందుకు ప్రతిగా అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నట్లు పుకార్లు వచ్చాయి. వాటిని నమ్మిన ఆసిఫ్.. ఇజ్రాయెల్ ఒక్కటే అణు శక్తి కలిగిన దేశం కాదని పాకిస్తాన్ కూడా అణుశక్తి కలిగిన రాజ్యమేనని తన ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొన్నారు. awdnews.com అనే వెబ్ సైట్లో ఇజ్రాయెల్ పాకిస్తాన్ పై అణుదాడి చేస్తోందని ఆ దేశ మాజీ రక్షణ శాఖ మంత్రి మొషే యాలన్ అన్నట్లు వార్త వచ్చింది. వీటిపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఆ వార్త సత్యదూరమని పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఆసిఫ్ కు రీట్వీట్ కూడా చేసింది. యాలన్ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని పేర్కొంది. Israeli def min threatens nuclear retaliation presuming pak role in Syria against Daesh.Israel forgets Pakistan is a Nuclear state too AH — Khawaja M. Asif (@KhawajaMAsif) December 23, 2016 -
ఆ ‘రెడ్ ఫోన్’ మళ్లీ మోగుతుందా?
♦ అమెరికా – సోవియట్ రష్యాల మధ్య హాట్ లైన్ ♦ అధ్యక్షుల మధ్య నేరుగా సంప్రదింపుల మార్గం ♦ అణు ఉద్రిక్తతలు తగ్గించడమే ప్రధాన లక్ష్యం ♦ సోవియట్ పతనంతో తగ్గిపోయిన ఉద్రిక్తతలు ♦ మళ్లీ అణ్వస్త్ర బాటలో అగ్ర రాజ్యాల పయనం (సాక్షి నాలెడ్జ్ సెంటర్) అమెరికా, సోవియట్ రష్యాల మధ్య నాలుగు దశాబ్దాల పాటు సాగిన ప్రచ్ఛన్న యుద్ధం రెండున్నర దశాబ్దాల కిందట సమసిపోయింది. మూడో ప్రపంచ యుద్ధం ఏ క్షణంలోనైనా ముంచుకురావచ్చు అన్నంత స్థాయిలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని ఉండేవి. పోటాపోటీగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తూ.. ప్రత్యర్థి దేశం లక్ష్యంగా అణ్వస్త్ర క్షిపణులను మోహరించేవి. సోవియట్ రష్యా పతనం తర్వాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా నిలిచింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయి.. ఆయుధ పోటీ తగ్గిపోయింది. అయితే.. తాజా పరిణామాలను, అధినేతల మాటలను చూస్తే.. ఈ రెండు దేశాల మధ్య మళ్లీ అణ్వాయుధాల పోటీ మొదలవుతుందా? అన్న ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అణ్వాయుధాలను బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నట్లు మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆ వెంటనే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం చూస్తే ఇదే అనిపిస్తోంది! గతంలో రెండు దేశాల మధ్య అణు ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏర్పాటు చేసుకున్న ‘రెడ్ ఫోన్’ కథాకమామీషు ఇదీ... అమెరికా – రష్యాల మధ్య అణ్వాయుధ పోటీ మున్ముందు ఎలా ఉంటుందో కానీ.. అర్థ శతాబ్దం కిందట మాత్రం ఈ పోటీ అణుయుద్ధం అంచుల దాకా వెళ్లింది! 1962 అక్టోబర్‌లో రష్యా లక్ష్యంగా ఇటలీ, టర్కీల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరిస్తే.. అమెరికాకు గురిపెడుతూ క్యూబాలో రష్యా అణ్వాయుధాలను సంసిద్ధం చేసింది. అప్పుడు రెండు వారాల పాటు ప్రపంచం గజగజ వణికిపోయింది. అయితే.. ఇరు దేశాలూ రాజీకి వచ్చి అణ్వాయుధాలను ఉపసంహరించడంతో ప్రపంచానికి పెను ప్రమాదం తప్పిపోయినట్లయింది. ఆ క్రమంలో ఇరు దేశాల అధినేతల మధ్య సంప్రదింపులు, సమాచార మార్పడికి విపరీతమైన జాప్యం జరిగింది. మాస్కో – వాషింగ్టన్ల మధ్య సమాచారం ప్రయాణించడానికి 12 గంటలు పట్టేది. సమాచారం ఖచ్చితమైనదేనా అన్న సందేహాలూ ఉండేవి. దీంతో.. అధ్యక్షుల మధ్య మంతనాలను వేగవంతం చేయడానికి హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా.. ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్న సమయంలో తొందరపాటుతో అణ్వాస్త్రాలను ప్రయోగించే పెను ముప్పును నివారించడానికి ఇటువంటి హాట్‌లైన్ అవసరమని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫోన్ కాని ఫోన్..! ఈ హాట్‌లైన్‌ను అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ ‘రెడ్ ఫోన్’గా పరిగణిస్తుంటారు. కానీ వాస్తవానికి అది ఫోన్ కాదు. అప్పటికి ఆధునిక హాట్‌లైన్ టెలిఫోన్ సాంకేతికత లేనేలేదు. అటు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సమీపంలో.. ఇటు అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ సమీపంలో గల పెంటగన్లో.. నేరుగా సమాచార సంబంధాల కోసం టెలీటైప్, టెలీగ్రాఫ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అమెరికాలో తయారు చేసిన నాలుగు టెలీటైప్ మెషీన్లను క్రెమ్లిన్‌కు పంపించారు. తూర్పు జర్మనీలో తయారైన నాలుగు మెషీన్లను పెంటగన్లో ఏర్పాటు చేశారు. ఇరు దేశాలూ ఎన్కోడింగ్ పరికరాలను (రష్యన్ భాషలో సందేశాన్ని ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్ భాషలో సందేశాన్ని రష్యన్లోకి తర్జుమా చేయడం కోసం) కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఈ వ్యవస్థలనే హాట్‌లైన్‌గా పరిగణించేవారు. నిజానికి ఈ సమాచార వ్యవస్థ కూడా ‘నేరుగా’ లేదు. ఈ టెలిగ్రాఫిక్ సర్క్యూట్ అమెరికా రాజధాని వాషింగ్టన్ నుంచి లండన్, కోపెన్‌హాగెన్, స్టాక్‌హోం, హెల్సింకిల మీదుగా 10 వేల మైళ్లు ప్రయాణించి మాస్కోకు చేరుతుంది. మాస్కో నుంచి అదే మార్గంలో వాషింగ్టన్కు చేరుతుంది. అయితే.. అమెరికా – రష్యాల మధ్య ఏర్పాటు చేసిన ఈ హాట్‌లైన్‌ను సాధారణ జనం ‘రెడ్ ఫోన్’గా పరిగణించేవారు. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రష్యా అధ్యక్షుడికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చన్న అపోహ కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. డాక్టర్ స్ట్రేంజ్‌లవ్, ఫెయిల్-సేఫ్ వంటి హాలీవుడ్ సినిమాల్లో దీనిని ఒక ఫోన్ లాగానే చూపించడమూ ఇందుకు కారణం. అణు దాడి నుంచి అమెరికాకు భద్రత కల్పించడం కోసం.. రక్షణ విభాగాల్లో ఒక ప్రత్యేక హాట్‌లైన్ వ్యవస్థను ఉపయోగించేవారు. నలుపు రంగులో ఉండే మిగతా ఫోన్ల నుంచి వేరుగా ఉండటానికి ఈ హాట్‌లైన్ కోసం ఎరుపు రంగు ఫోన్లు ఉపయోగించేవారు. అలా ‘రెడ్ ఫోన్’ అనే పేరు అమెరికా – రష్యా అధ్యక్షుల మధ్య హాట్‌లైన్‌కు కూడా వచ్చి చేరింది. మొదటి సందేశం ఫాక్స్.. డాగ్స్..! ఈ హాట్‌లైన్ 1963 ఆగస్టు 30న పని చేయడం మొదలు పెట్టింది. మొట్టమొదటి సందేశం అమెరికా నుంచి ‘‘ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్డ్ ఓవర్ ది లేజీ డాగ్స్ బ్యాక్ 1234567890’’ అని ఇంగ్లిష్‌లో పంపించారు. ఇంగ్లిష్‌లోని అన్ని అక్షరాలతో కూడిన ఈ సందేశం ద్వారా ఆ పరికరాల పనితీరును పరీక్షించారు. రష్యా నుంచి వచ్చిన సందేశం మాత్రం అమెరికాలో వెంటనే ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే.. అది రష్యన్ భాషలో వచ్చింది. - ఈ హాట్‌లైన్ ఏర్పాటు చేసిన మూడు నెలలకే అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు గురయ్యారు. ఆ మూడు నెలల కాలంలో ఆయన ఒక్కసారి కూడా దీనిని ఉపయోగించలేదు. ఆయన తర్వాత అమెరికా అధ్యక్షుడైన లిండన్ జాన్సన్ 1967లో తొలిసారి దీనిని ఉపయోగించారు. ఇజ్రాయెల్‌కు, పొరుగున ఉన్న అరబ్ దేశాలకు మధ్య యుద్ధం తలెత్తినపుడు జాన్సన్ ఈ హాట్‌లైన్ ద్వారా రష్యా అధ్యక్షుడు అలెక్సీ కోసిగిన్ను సంప్రదించారు. - 1971 సెప్టెంబర్‌లో ఈ వ్యవస్థకు శాటిలైట్ కమ్యూనికేషన్ లైన్‌ను అనుసంధానం చేశారు. ఆ తర్వాత మూడు నెలలకు భారత్ – పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినపుడు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రష్యా అధ్యక్షుడు బ్రెజ్నేవ్తో మాట్లాడారు. మళ్లీ 1973లో ఒకసారి, 74లో మరోసారి అంతర్జాతీయ పరిణామాలపై నిక్సన్ ఈ హాట్‌లైన్‌ను ఉపయోగించి రష్యా అధ్యక్షుడిని సంప్రదించారు. - 1979లో అఫ్గానిస్థాన్‌పై రష్యా యుద్ధానికి దిగినపుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ హాట్‌లైన్‌ను ఉపయోగించారు. 1983లో రొనాల్డ్ రీగన్ చొరవతో హైస్పీడ్ ఫ్యాక్స్ సామర్థ్యంతో ఈ హాట్‌లైన్ వ్యవస్థను ఆధునీకరించారు. లెబనాన్, పోలండ్‌లలో ఘటనలపై సంప్రదించడానికి రీగన్ పలుమార్లు దీనిని ఉపయోగించారు. ఇప్పుడది అత్యాధునిక హాట్ లైన్... సోవియట్ పతనం తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినా ఈ హాట్ లైన్ వ్యవస్థ కొనసాగింది. అయితే దీనిని పెద్దగా ఉపయోగించలేదు. 2008 లో కొత్తగా ఫైబర్-ఆప్టిక్ వ్యవస్థతో ఆధునీకరించారు. కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లతో నూతన సాంకేతికతను జోడించారు. ‘హాట్ లైన్ స్థానంలో ట్వీటర్ వచ్చేసింది... ఎంతో కాలంగా ఉన్న రెడ్ ఫోన్లను ఇక పక్కన పారేయవచ్చునేమో!’ అని 2010లో రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్‌తో కలిసి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మీడియాతో మాట్లాడుతూ ఛలోక్తి విసిరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను గందరగోళ పరచడానికి రష్యా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారంటూ బరాక్ ఒబామా గత అక్టోబర్ నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ హాట్ లైన్ ద్వారానే సందేశం పంపించారు. భద్రమైన శాటిలైట్ కనెక్షన్లో ఒబామా తన సందేశాన్ని ఈమెయిల్ చేశారు. ఇంకో విశేషమేమిటంటే.. ఈ హాట్ లైన్‌ను ఏర్పాటు చేసినప్పటి నుండీ ఇప్పటివరకూ అమెరికా – రష్యాలు దీని ద్వారా గంట గంటకూ పరస్పరం సందేశాలు ఇచ్చిపుచ్చకుంటున్నాయి. అవన్నీ టెస్ట్ సందేశాలే! -
మా అణ్వస్త్రాలు.. ఆటబొమ్మలు కావు
తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ పదే పదే బయటకు చెబుతోంది. భారతదేశంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అంటోంది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు ఆటబొమ్మలేవీ కావని ఆయన అన్నారు. ''మా దగ్గర ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను మా రక్షణ కోసమే తయారు చేశాం. ఈ ఆయుధాలు ఆటబొమ్మలు ఏమీ కావు. మా క్షేమానికి ఏమైనా ముప్పు ఉందనుకుంటే వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తాం'' అని జియో టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసిఫ్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ సెప్టెంబర్ 26వ తేదీన ప్రసారమైంది. ఉడీ ఉగ్రదాడి జరగడానికి ఒక్కరోజు ముందు.. అంటే సెప్టెంబర్ 17వ తేదీన కూడా ఇలాంటిదే మరో ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం ఏమీ లేదని.. కానీ ఖురాన్లో అల్లా చెప్పినట్లు, 'గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ మీద ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉందని, అందువల్ల అవసరమైన వాటి కంటే ఎక్కువగా తమదగ్గర వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తమదే ఆధిక్యం అన్న విషయానికి అంతర్జాతయంగా కూడా గుర్తింపు ఉందని చెబుతూ.. ఎవరైనా తమ గడ్డమీద అడుగుపెట్టినా, తమ అంతర్గత భద్రతకు ముప్పు తేవాలని చూసినా తమ రక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని అన్నారు. భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా అన్న ప్రశ్నకు.. అది పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, తమ ఉనికి ప్రమాదంలో పడితే తాము అన్నింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అందులో భయపడాల్సింది ఏముందని ఎదురు ప్రశ్నించారు. -
ఐఎస్ఐఎస్ అణుదాడి చేయనుందా?
లండన్: కరుడు గట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ శక్తవంతమైన అణుబాంబులతో యూరప్‌పై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోందని ఈ విషయాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే సిరియాలో రసాయన ఆయుధాలతో పెను విధ్వంసం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అణ్వాయుధాలకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. గత సోవియట్ యూనియన్‌లో భాగస్వాములుగా ఉన్న పలుదేశాల్లోని న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లలో ఉన్న తక్కువ భద్రత లాంటి అంశాలు ఐఎస్ఐఎస్కు అనుకూలించేలా ఉన్నాయని ఇంటర్నేషనల్ లగ్జెంబర్గ్ ఫోరం ప్రెసిడెంట్ మోషే కాంటుర్ తెలిపారు. బ్రసెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో దాడి జరిపిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెల్జియం న్యూక్లియర్ ప్లాంట్‌పై నిఘా ఉంచడంతో పాటు.. ప్లాంట్‌లోకి యాక్సెస్ పొందటానికి ప్రయత్నిచారన్నది విచారణలో తేలిందని ఈ సందర్భంగా కాంటుర్ గుర్తు చేశారు. అలాగే ఇరాక్‌లోని మొసూల్ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఆధీనంలోకి తీసుకున్న తరువాత అక్కడ అణుబాంబు తయారీలో వాడే యురేనియంను ఐఎస్ఐఎస్ పొందగలిగింది అని నివేదికలున్నాయని మాజీ బ్రిటీష్ రక్షణ శాఖ సెక్రటరీ డెస్ బ్రౌన్ వెల్లడించారు. యురోపియన్ దేశాలకే ఈ ముప్పు ఎక్కువని అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. -
అణుదాడి నుంచి అమెరికాను కాపాడాడు!
ఆయన ఓ రష్యన్ లెఫ్టినెంట్ కర్నల్. కానీ అమెరికా మీద అణుబాంబు దాడి జరగకుండా అగ్రరాజ్యాన్ని కాపాడాడు! అత్యంత ఉత్కంఠభరితమైన క్షణంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం.. ఒకరకంగా ఈ ప్రపంచాన్నే కాపాడింది. అది 1983 సెప్టెంబర్ 23వ తేదీ. ఆయనపేరు స్టానిస్లవ్ పెట్రోవ్. ఆరోజు రాత్రి ఉన్నట్టుండి ఓ సైరన్ మోగింది. అమెరికా దళాలు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించబోతోందని దానికి అర్థం. అప్పట్లో 44 ఏళ్ల వయసున్న పెట్రోవ్.. అది నిజమో కాదో తేల్చుకోలేకపోయారు. అప్పుడప్పుడు అలా ఫేక్ సైరన్లు మోగించి శత్రుపక్షాలను అయోమయంలోకి నెట్టడం కూడా మామూలే. నిజంగా ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తారా, లేదా అనే విషయం ఆయన నిర్ధారించుకుని దాన్ని ఉన్నతాధికారులకు చెప్పాలి. క్షిపణులు ప్రయోగిస్తారని చెబితే, ఇక రష్యా బలగాలు అమెరికా మీద అణుబాంబులు వేయడానికి దాదాపు సిద్ధంగా ఉన్నాయి!! కానీ పెట్రోవ్‌కు మాత్రం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చివరకు అది ఫేక్ అలారమేనని ఆయన నిర్ణయించుకున్నారు. సోవియట్ నాయకత్వానికి ఏమీ చెప్పలేదు. దాంతో అమెరికా మీద అణుబాంబుల దాడి తప్పిపోయింది. అంతర్యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో ఏ చిన్న పొరపాటు చేసినా అది లక్షలాది మంది ప్రాణాలకు నష్టం కలిగించేదే. నిజానికి అదే నెలలో అమెరికా నుంచి దక్షిణ కొరియాకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానాన్ని.. గూఢచారి విమానం అనుకుని రష్యా కూల్చేసింది. దాంతో అమెరికా కూడా మళ్లీ ఏదైనా జరిగితే అణుదాడి చేయాలని పూర్తి సన్నద్ధంగా ఉంది. అయితే ఈ పరస్పర అణు దాడులను నివారించిన వ్యక్తి.. లెఫ్టినెంట్ కర్నల్ పెట్రోవ్. ఈ మొత్తం ఉదంతంపై ఇటీవల 'ద మ్యాన్ హూ సేవ్డ్ ద వరల్డ్' అనే సినిమా కూడా తీశారు. స్వదేశంలో మాత్రం ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం 76 ఏళ్ల వయసున్న పెట్రోవ్.. ఆ రోజు అర్ధరాత్రి అలారం మోగిన శబ్దం ఇప్పటికీ తన గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటుందని చెబుతున్నారు!