ప్యాంగ్‌యాంగ్ : అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, గ్వామ్ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అణు బాంబులు విసిరేందుకు సిద్ధమయ్యారనే రిపోర్టులు వస్తున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లోని 15 ప్రదేశాలపై అణు దాడి జరగొచ్చని యూరోపియన్ కమిషన్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్(ఈయూఎఫ్‌ఆర్) పేర్కొంది. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలను పలుమార్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పింది.
ఉత్తరకొరియా ఎంచుకున్న ప్రదేశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోకొంత గుర్తింపు కలిగినవేనని తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్ సాయంతో ఈ సమాచారం సంపాదించగలిగినట్లు వివరించింది. ఉత్తర కొరియా లక్షిత ప్రాంతాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని ప్రదేశాలు : వైట్‌హౌస్, పెంటగాన్, న్యూయార్క్, మన్‌హట్టన్, అమెరికా ముఖ్య నగరాలు
జపాన్‌లోని ప్రదేశాలు : మిసావా, టొక్యో, ఒసాకా, యోకోహామా, క్యోటో
దక్షిణ కొరియాలోని ప్రదేశాలు : సియోల్, బుసాన్, గ్యాంన్నెయంగ్
ఈ రిపోర్టును బయటకు వెలువరించడంపై కూడా యూరోపియన్ యూనియన్ ఫారిన్ రిలేషన్స్ వివరణ ఇచ్చింది. ఇలాంటి వాటిని బయటపెట్టడం వల్ల ఉత్తరకొరియాలో మళ్లీ కదలికలు మొదలవుతాయని చెప్పింది. అలాంటి పరిస్థితి ఆ దేశం దాడికి ఎప్పుడు దిగుతుందో తెలిసే అవకాశం కలుగుతుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment