సచివాలయం అప్పగింతకు ఏపీ ఓకే | Ap sayes ok to Secretariat assignment | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 20 2016 6:49 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

రాజధానిలోని సచివాలయ ప్రాంగణాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతమున్న సచివాలయం కూల్చివేతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆర్ అండ్ బీ అధికారులకు సంకేతాలు జారీ చేశారు. వచ్చే నెలలో లేదా డిసెంబర్ మొదటి వారంలో కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన అవరోధంగా ఉన్న ఏపీ సచివాలయం, ఏపీ కార్యాలయాలున్న భవానాలను సైతం ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement