పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీజేయూ మీట్ ద ప్రెస్‌లో బుధవారం కిషన్‌రెడ్డి మాట్లాడారు. 2009 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన ఎగసిపడిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు అనుకూలమైన పార్టీలన్నీ సీమాంధ్ర ప్రజలకు నచ్చచెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్ర జిల్లాలో ఎగసిపడుతున్న తరుణంలో కిషన్‌రెడ్డి అధికార పార్టీ, టీడీపీలపై విరుచుకుపడ్డారు. బాధ్యాయుతంగా ఉండాల్సిన పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. విభజన తర్వాత సీమాంధ్రలో కూడా అభివృద్ధి తప్పకుండా జరుగుతుందన్నారు. రాష్ర్ట విజనకు సంబంధించి బీజేపీకి అనుమానాలున్నాయని తెలిపారు. సీమాంధ్రలో ఎంపీలు, మంత్రులు కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని ఆయన సూచించారు.
Published Wed, Aug 7 2013 2:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
Advertisement