అమెరికా సంగీత దిగ్గజం, జానపద గాయకుడు, గీత రచయిత బాబ్ డిలన్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య అవార్డు వరించింది. 75 ఏళ్ల డిలన్ ఈ విఖ్యాత అవార్డును అందుకున్న తొలి గీత రచయితగా చరిత్ర సృష్టించారు. సాహిత్యం విభాగంలో సంగీతకారునికి, గీత రచయితకు అవార్డును ఇవ్వడం నోబెల్ అవార్డులను అనుసరించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరూ ఊహించని రీతిలో డిలన్ పేరును దీనిని ఎంపిక చేయడం నిపుణులను మరింత ఆశ్చర్యపరిచింది. డిలన్ అమెరికా గీత సంప్రదాయానికి కొత్త ఒరవడి నేర్పారని, కొత్త కవితాత్మక భావవ్యక్తీకరణలను ఆవిష్కరించారని, అందుకే ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేశామని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. జానపద గాయకుడైన డిలన్ పేరు చాలా ఏళ్లుగా నోబెల్ సాహిత్య పురస్కారం పోటీలో వినిపిస్తోంది. అయితే ఆయనను ఎవరూ ప్రధాన పోటీదారుగా భావించని తరుణంలో డిలన్ పేరును ప్రకటించగానే.. సభా ప్రాం గణం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆయన రాసిన ‘బ్లోరుుంగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాయి. ఈ అవార్డు కింద డిలన్‌కు సుమారు రూ.6.06 కోట్లు అందనున్నాయి.