రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో... కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌పై ప్రధానంగా చర్చించనున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేయాలనే దానితోపాటు దసరా రోజున కొత్త జిల్లాల ఏర్పాటు సంబురాల నిర్వహణకు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం రూపొందిస్తున్న విషయం తెలిసిందే.