Formation of new districts
-
ఊరూరా సంబరాలు
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులుగా ప్రజలు సంబరాలతో సందడి చేస్తున్నారు. బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి నూతన జిల్లా ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భీమవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరానికి వచ్చే ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్ఛాపురం, టెక్కలిలో సంబరాలు ఘనంగా జరిగాయి. పలాస డివిజన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో అభినందన సభ జరిపారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టెక్కలిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సోంపేటలో పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన అభినందన సభకు హాజరైన ప్రజలు తిరుపతి జిల్లా ఆవిర్భావ నేపథ్యంలో వెంకటగిరిలో బుధవారం నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో వేలాది మంది భాగస్వాములయ్యారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పాదయాత్ర జరిగింది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు పాదయాత్రలు జరిగాయి. పెదగంట్యాడలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బుచ్చెయ్యపేట మండలంలో ఎమెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి సుమారు పది వేల మంది హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో భారీ ర్యాలీ జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు శుభపరిణామం సీతమ్మధార (విశాఖ ఉత్తర): రాష్ట్రంలో జిల్లాలను పునర్విభజించటం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. బుధవారం సీతమ్మధారలోని బీజేపీ కార్యాలయంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. -
ఏపీలో ఈ నెల 31న కొత్త జిల్లాల ఏర్పాటు
-
కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది
సాక్షి,అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్, తదనుగుణ జీవోలు, ఇతర ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు రాజ్యాంగానికి, రాష్ట్రపతి ఉత్తర్వులకు ముఖ్యంగా అధికరణ 371–డీకి విరుద్ధమని, అందువల్ల వాటిని రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిద్ధార్థ, గుంటూరుకు చెందిన దొంతినేని విజయ్‌కుమార్, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామారావు తదితరులు హైకోర్టులో గతవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటు రాజ్యాంగంలోని అధికరణ 371–డీకి విరుద్ధమన్నారు. రాష్ట్రానికి విద్య, ఉపాధి అవకాశాల్లో న్యాయం చేసేందుకు ఆ అధికరణ తీసుకొచ్చారని, దీని ప్రకారం ఉద్యోగాల భర్తీ విషయంలో జిల్లాను ఓ యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీని ఆధారంగా లోకల్ కేడర్, ఏరియాను నిర్ణయించారన్నారు. పిటిషనర్లకొచ్చిన ఇబ్బంది ఏంటి? కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పిటిషనర్లకొచ్చిన ఇబ్బంది ఏమిటని, కొత్త జిల్లాల ఏర్పాటును అధికరణ 371–డీ నిషేధిస్తోందా? వాదనల సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. పరిపాలన పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని, పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉందంది. ఎప్పటికీ 13 జిల్లాలు మాత్రమే ఉండాలని పిటిషనర్లు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది. కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి లేదని తాము చెప్పడం లేదని న్యాయవాది సుధాకరరావు బదులిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జోనల్ వ్యవస్థ కూడా మారిపోతుందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన 8 వేలకు పైగా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వాటి ఏర్పాటు తగదన్నారు. తెలంగాణలో ఏర్పాటయ్యాయి కదా? ధర్మాసనం తిరిగి జోక్యం చేసుకుంటూ, అధికరణ 371–డీ ఉండగానే తెలంగాణలో కొత్త జిలాలు ఏర్పాటయ్యాయి కదా? అని అని ప్రశ్నించింది. అసలు రాజ్యాంగంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిషేధం ఎక్కడుందో చూపాలంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అప్పుడు కొత్త జిల్లా కూడా ఓ లోకల్ ఏరియా, ఓ యూనిట్‌గా ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్లు ఏం చేస్తుంటారంటూ ధర్మాసనం ఆరా తీయగా.. పిటిషనర్లలో ఇద్దరు నిరుద్యోగులని, వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదని న్యాయవాది సుధాకరరావు తెలిపారు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అందువల్ల జిల్లాల ఏర్పాటును నిలువరిస్తూ మ«ధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీ చేసింది కేవలం ముసాయిదా మాత్రమేనని, పిటిషనర్లు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొంది. తుది నోటిఫికేషన్‌పై అభ్యంతరం ఉంటే అప్పుడు దానిని సవాలు చేసుకోవచ్చునని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది. పాలనా వ్యవహారాలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనివి. పాలనాపరమైన సౌలభ్యం నిమిత్తం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయరాదని రాజ్యాంగంలో నిషేధం ఎక్కడ ఉందో చూపండి. రాష్ట్రంలో ఎప్పటికీ 13 జిల్లాలు మాత్రమే ఉండాలని పిటిషనర్లు కోరుకుంటున్నారా? – ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం -
కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు ఏ ప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. శనివారం ఆయన సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ జైన్‌తో కలిసి అనంతపురం కలెక్టరేట్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, వైఎస్సార్ జిల్లా జాయిం ట్ కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలను పరిశీ లించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరా లు, సలహాలు తీసుకుంటామని తెలిపారు. వీటిపై కలెక్టరు నివేదిక పంపుతారన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్ష ల మేరకే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొత్త జిల్లాలన్నింటిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. రాయలసీమలో కొత్త జిల్లాలపై 1,600కు పైగా అ భ్యంతరాలు వచ్చాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పెనుకొండ గానీ, హిందూపురం గానీ పెట్టాలన్న భావన వ్యక్తమైందన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందన్నారు. రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్లో కలపాలని, కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో ఉంచమని కోరుతున్నారన్నారు. మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ కొన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రధానంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న డిమాండ్ వచ్చిందని చెప్పారు. నగరిని తిరుపతిలో ఉంచాలని అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి అంశం పూర్వాపరాలు, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు పెరిగినా జోన్లు నాలుగే
సాక్షి, అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో ఉద్యోగుల జోనల్ వ్యవస్థ పైన ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ఉన్నత విద్యా సంస్థల పరిధిపైనా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం ఉద్యోగుల జోనల్ వ్యవస్థ ఎలా ఉంది, కొత్త వ్యవస్థ ఎలా ఉండాలో ప్రతిపాదించారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. వీటికి రెండు మల్టీ జోన్లు (1, 2), వాటి పరిధిలో నాలుగు జోన్లు (1, 2, 3, 4) ఉన్నాయి. మల్టీ జోన్–1 పరిధిలోని జోన్–1లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, జోన్–2లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. మల్టీ జోన్–2 పరిధిలోని జోన్–3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–4లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలున్నాయి. కొత్త జోనల్ వ్యవస్థ ఇలా.. పునర్వ్యవస్థీకరణ అనంతరం 26 జిల్లాలనూ అదే క్రమంలో విభజిస్తారు. ప్రస్తుతం ఉన్న విధంగానే రెండు మల్టీ జోన్లు, నాలుగు జోన్లనే ప్రతిపాదించారు. కానీ వాటి పరిధిలో కొత్త జిల్లాలు అదనంగా వస్తాయి. ఒక్కో జోన్లో 5 నుంచి 7 జిల్లాలు వస్తాయి. మల్టీ జోన్–1 పరిధిలోని జోన్–1లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, జోన్–2లో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు రానున్నాయి. మల్టీ జోన్–2 పరిధిలోని జోన్–3లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–4లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను ప్రతిపాదించారు. కొత్తగా ఏర్పడుతున్న శ్రీ బాలాజీ జిల్లాలో 17 మండలాలు నెల్లూరులో (జోన్–3), 18 మండలాలు చిత్తూరులో (జోన్–4) ఉండటంతో దాన్ని ఏ జోన్లో ఉంచాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. జూనియర్ అసిస్టెంట్ దానికి సమాన స్థాయి ఉద్యోగుల బదిలీలు జిల్లా పరిధిలోనే ఉండడంతో వారు పూర్తిగా జోనల్ వ్యవస్థలోకి వస్తారు. జూనియర్ అసిస్టెంట్ కంటే పై స్థాయి ఉద్యోగుల నుంచి సూపరింటెండెంట్ల వరకు జోనల్ స్థాయి పరిధిలో ఉంటారు. సూపరింటెండెంట్ ఆ పై క్యాడర్ ఉద్యోగులంతా మల్టీ జోన్లోకి వస్తారు. అందువల్ల విభజనలో వారిపై ప్రభావం ఉండదు. ఉన్నత విద్యా సంస్థల పరిధి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలున్నాయి. జిల్లాల విభజన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలను ప్రతిపాదించారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు ఉండాలని ప్రతిపాదించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రకాశం జిల్లా (ఆంధ్రా వర్సిటీ రీజియన్) పరిధిలోని 5 మండలాలు, నెల్లూరు జిల్లా (వెంకటేశ్వర వర్సిటీ రీజియన్) పరిధిలోని 30 మండలాలు ఉండడంతో దాన్ని ఏ రీజియన్ పరిధిలో చేర్చాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. -
సానుకూల అంశాలు ఉంటేనే పరిగణనలోకి..
నర్సీపట్నం(విశాఖపట్నం): కొత్త జిల్లాల ఏర్పాటులో సానుకూలమైన అంశాలు ఉంటేనే సవరణలకు పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సోమవారం నర్సీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుభవజ్ఞునిలా పాలన చేస్తున్నారని, పరిపాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలను చేశారన్నారు. చరిత్ర కలిగిన ప్రాంతాలకు అల్లూరి సీతారామరాజు, ఎన్టీ రామారావు, శ్రీ సత్యసాయి పేర్లుగా నామకరణం చేశారని తెలిపారు. సీఎంకు రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై సమగ్రమైన అవగాహన ఉందన్నారు. జలయజ్ఞం ద్వారా తీసుకొచ్చిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం ప్రాధాన్యమిస్తూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నారని వివరించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సీఎం సానూకూలంగా పరిష్కరించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదికాదన్నారు. ప్రత్యేకహోదా సాధనకు సీఎం కృషి చేస్తున్నా.. కేంద్రం నుంచి సానుకూలత రావడం లేదన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్నందునే నవరత్నాలకు రూపకల్పన చేశారని చెప్పారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న 2 లక్షల ఎకరాలకు సాగు పట్టాలతో పాటు.. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి..వారిపై తనకున్న ప్రేమను సీఎం జగన్ చాటుకున్నారని చెప్పారు. -
AP: పనులన్నీ చకచకా.. ఉగాది నుంచే ప్రారంభం
సాక్షి, అమరావతి: నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాలు కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. తొలుత తాత్కాలిక కార్యాలయాల నుంచి పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన భవనాలు, ఖాళీ స్థలాలు, ప్రైవేట్ భవనాల కోసం ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరించింది. కొత్త జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని స్థిరాస్తుల సమాచారంతో ఒక నివేదిక రూపొందించింది. ఈ వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపి పరిశీలించాలని సూచించింది. దీన్ని బట్టి కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. చివరి ఆప్షన్‌గా ప్రైవేట్ భవనాలు.. నూతన జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భవనాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. అవి లేని పక్షంలో చివరి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ భవనాలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. ఈ భవనాల్లో సివిల్, విద్యుత్ మరమ్మతులు, ఫర్నీచర్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు తయారు చేయాలని పేర్కొంది. ఈ అంశాలన్నింటితో ఈ నెల 18వతేదీలోపు ప్రాథమిక ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను గుర్తించగా వాటిని పరిశీలించి ఏవి బాగుంటాయో నివేదికలో సూచించాలని స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీకల్లా భవనాలకు సంబంధించిన నిర్మిత ప్రదేశం (ఎస్ఎఫ్టీ), ఇతర వివరాలను సమర్పించాలని నిర్దేశించింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా కోర్టుల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించింది. కడప, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లున్నాయి. వాటితోపాటు తెలంగాణలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్లను పరిశీలించారు. తెలంగాణలో 16 ఎకరాల్లో 1.56 లక్షల ఎస్ఎఫ్టీలో 18 కార్యాలయాలు పని చేసేలా కలెక్టరేట్లు నిర్మించారు. కడపలో 30 ఎకరాల్లో 4.71 ఎస్ఎఫ్టీలో 39 కార్యాలయాలు పనిచేసేలా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. శ్రీకాకుళంలో 24 ఎకరాల్లో 3.34 ఎస్ఎఫ్టీలో 75 కార్యాలయాలు పనిచేసేలా కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటైంది. ఈ మూడింటిని పరిశీలించి ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో 5 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో 30 కార్యాలయాలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఒక్కో కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.60 నుంచి రూ.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటికి సంబంధించి మూడు రకాల ప్రాథమిక డిజైన్లను సబ్ కమిటీ రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు సిద్ధమయ్యేవరకు తాత్కాలిక కార్యాలయాల్లో కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. -
కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ప్రకాశం, పల్నాడు, సత్యసాయి జిల్లాలకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను సవరిస్తూ తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ బుధవారం సవరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ప్రకాశం జిల్లా ఒంగోలు రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న కనిగిరి డివిజన్లో కలిపారు. కనిగిరి డివిజన్లో ఉన్న ముండ్లమూరు, తల్లూరు మండలాలను ఒంగోలు డివిజన్లో చేర్చారు. ► నర్సరావుపేట కేంద్రంగా ప్రతిపాదించిన పల్నాడు జిల్లాలోని గురజాల డివిజన్లో 14 మండలాలను 10 మండలాలకు తగ్గించారు. గురజాల డివిజన్లో ప్రతిపాదించిన పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాలను నర్సరావుపేట డివిజన్‌కు మార్చారు. ప్రస్తుతం ఇవి గుంటూరు డివిజన్లో (పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ముందు) ఉన్నాయి. దీంతో నర్సరావుపేట డివిజన్లో మండలాల సంఖ్య 18కి చేరింది. ► కొత్తగా ఏర్పాటు చేస్తున్న సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి డివిజన్లో ప్రతిపాదించిన 12 మండలాలను 8 మండలాలకు తగ్గించారు. కదిరి, తలుపుల, నంబులపూలకుంట్ల, గాండ్లపెంట మండలాలను కదిరి డివిజన్‌లోకి మార్చారు. ఈ నాలుగు మండలాలు పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ముందు కదిరి డివిజన్లో ఉన్నాయి. ► చిత్తూరు జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన పలమనేరు డివిజన్లోని రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్లో కలిపారు. -
ఎటుచూసినా సంబరమే
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ర్యాలీలు, క్షీరాభిషేకాలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్‌లో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ప్రజలు పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం ఇక సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచినందుకు కృతజ్ఞతగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ‘జగనన్న వరం.. సర్వేపల్లి జననీరాజనం’ పేరిట వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం మనుబోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్నమయ్య జిల్లాకు మద్దతుగా ర్యాలీ ప్రస్తుతమున్న చిత్తూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మద్దతుగా ‘థాంక్యూ సీఎం సార్’.. అంటూ కలికిరి పట్టణంలో బుధవారం ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం శుభపరిణామమన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
కల సాకారం..
ఎట్టకేలకు ములుగు ప్రాంత ప్రజల కల సాకారమైంది. నాలుగున్నరేళ్ల ప్రజా ఉద్యమానికి ఫలితం లభించింది. ములుగు జిల్లా ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి విడిపోయి తొమ్మిది మండలాలతో కొత్తగా ములుగు జిల్లా ఉనికిలోకి రానుంది. ఆదివారం నుంచి అధికారికంగా పాలన ప్రారంభం కానుండగా.. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మక్క–సారలమ్మ పేరు ప్రస్తావన రాలేదు. మల్లంపల్లి మండల హామీపై కూడా స్పష్టత లేదు. సాక్షి, భూపాలపల్లి/ములుగు: ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగిన ములుగును జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది. కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33 కు చేరింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ను ఐదు ముక్కలుగా చేశారు. ప్రస్తుతం ములుగు ఏర్పాటుతో జిల్లాల సంఖ్య ఆరుకు చేరింది. జిల్లా కోసం ఉద్యమించిన ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవెర్చింది. 9 మండలాలతో కూడిన జిల్లా నేటి నుంచి ఉనికిలోకి రానుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భౌగోళిక స్వరూపం.. ములుగు, వెంకటాపురం(ఎం)ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలతో ములుగు జిల్లా మనుగడలోకి రానుంది. 9 మండలాల పరిధిలో 3,881 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో జిల్లా ఏర్పడనుంది. 177 గ్రామపంచాయతీలు, 336 గ్రామాలు ఉన్నాయి. 6,175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలోనే నాలుగో పెద్ద జిల్లాగా ఉన్న భూపాలపల్లి తన స్థానాన్ని కోల్పోనుంది. పాత 31 జిల్లాలతో పోల్చితే ములుగు 18వ పెద్ద జిల్లాగా కొనసాగనుంది. 2011 జనాభా లెక్కల ములుగు జిల్లాలో 2,94,671 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం జానాభా 3.10 లక్షలకు మించి ఉంటుందని అధికారులు అంటున్నారు. జిల్లాలో ములుగు మాత్రమే రెవెన్యూ మాత్రమే రెవెన్యూ డివిజన్ హోదా కలిగి ఉంది. ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. నియోజకర్గంలోని మిగతా ఏడు మండలాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం ములుగు జిల్లాలో ఉండనున్నాయి. ఆదివాసీలు.. పర్యాటకం.. రాష్ట్రంలో ముఖ్య పర్యాటక కేంద్రంగా ములుగు జిల్లా విరాజిల్లనుంది. మేడారం సమ్మక్క–సారలమ్మ గిరిజన జాతర కొంగుబంగారం కానుంది. ఓ వైపు ప్రకృతి అందాలు, మరోవైపు ఆదివాసీ గరిజనుల సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరియనున్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏ జిల్లా పరిధిలోనే ఉండడం, వైల్డ్‌లైఫ్, తాడ్వాయిలోని ఎకోటూరిజం, బొగత జలపాతం, రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. ఇదే విధంగా జిల్లా పూర్తిగా ఆదివాసీ, గిరిజన జనాభాతో నిండి ఉంది. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సంబురాలు.. జిల్లా ఏర్పాటు చేయడంతో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, ఎండీ.మున్సిమ్‌ఖాన్, కుర్రి దివాకర్, రవళిక, కృష్ణవేఢి, బీజేపీ నాయకులు సిరికొండ బలరాం, బల్గూరి చంద్రయ్య కల్వల సంజీవ ఆధ్వర్యంలో శనివారం సంబురాలు జరుపుకున్నారు. జాతీయ రహదారిపై టపాసులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఊసేలేని సమ్మక్క–సారలమ్మ పేరు ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని నాలుగున్నర సంవత్సరాలుగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ములుగు జిల్లా పేరును మాత్రమే పొందిపరిచింది. దీంతో నియోజకవర్గ ప్రజలు, తల్లుల భక్తులు నిరుత్సాహంలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి సమ్మక్క–సారలమ్మ పేరిట జిల్లా పేరును మార్చాలని కోరుతున్నారు. తగ్గిన భారం.. ములుగు డివిజన్లోని వెంకటాపురం(కె), వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం మండలాల ప్రజలకు ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సుమారు 120 నుంచి 140 కిలో మీటర్ల దూరంలో ఉంది. ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు దూరభారం తగ్గింది. అత్యవసర పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మూడున్నర గంటల పాటు ప్రయాణించే ఏజెన్సీ వాసులు ప్రస్తుతం కేవలం రెండున్నర గంటల్లో ములుగు జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం కలిగింది. -
ఏ జిల్లాకు ఎవరెవరు?
డీసీసీ అధ్యక్షుల నియామకంపై టీపీసీసీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పార్టీ జిల్లా కమిటీలకు సారథుల నియామకాలపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. నవంబర్లోనే డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న పీసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామక ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. టీపీసీసీ కార్యవర్గం గతంలోనే పూర్తయినా జిల్లాల విభజన జరగడంతో మార్పులు చేర్పులు అనివార్యమైనాయి. డీసీసీ అధ్యక్షులుగా ఎక్కువ మంది అవసరం కావడంతో సమర్థులూ, పార్టీకోసం పూర్తిసమయం పనిచేయగలిగే నాయకులకోసం టీపీసీసీ అన్వేషిస్తోంది. అయితే జిల్లాల విస్తీర్ణం తగ్గిపోవడంతో డీసీసీ అధ్యక్షులుగా పనిచేయడానికి సీనియర్లు అనాసక్తిగా ఉన్నారు. మరో పక్క అన్ని జిల్లాలకు కొత్తవారిని నియమించడంవల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో పాత జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్నవారినే కొనసాగాలని టీపీసీసీ కోరింది. ఈ నేపథ్యంలో నాయిని రాజేందర్‌రెడ్డి(వరంగల్ అర్బన్), ఒబేదుల్లా కొత్వాల్(మహబూబ్‌నగర్), ఐత సత్యం(ఖమ్మం), తాహెర్‌బిన్ హందాన్ (నిజామాబాద్) తదితరులు పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది.ఆదిలాబాద్ జిల్లాకు అధ్యక్షునిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ డీసీసీ అధ్యక్షునిగా కొనసాగడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. పెద్ద జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన తాను చిన్న జిల్లాకు పనిచేయలేనని టీపీసీసీకి చెప్పినట్టుగా తెలిసింది. ఇక సంగారెడ్డి జిల్లా పగ్గాలను మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి)కి అప్పగించడం దాదాపు ఖరారైనట్టుగా టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండలో ఉత్కంఠ నల్లగొండ డీసీసీ అధ్యక్షుని విషయంలో పార్టీ అగ్రనేతల అనుచరుల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుచరుల్లో ఎవరికి అవకాశం దక్కుతుంనేది ఉత్కంఠగా మరింది. కోమటిరెడ్డి సోదరులకు అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను వారు ప్రతిపాదిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాకు రేగ కాంతారావు పేరు టీపీసీసీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. జనగామ జిల్లాకు పొన్నాల లక్ష్మయ్య ప్రతిపాదించిన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి పేరు వినిపిస్తోంది. మహబూబాబాద్ డీసీసీకి భరత్చంద్రారెడ్డిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మేడ్చల్ జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ డీసీసీ అధ్యక్షునిగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాల్సి వస్తే ఉద్దెమర్రి నర్సింహారెడ్డి ఖరారయ్యే అవకాశముంది. కాగా, జిల్లాలు చిన్నవి కావడం వల్ల పెద్ద నేతల మధ్య వివాదాలు తగ్గే అవకాశముందని టీపీసీసీ ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు. తీవ్రమైన విభేదాలున్న జిల్లాలు మినహా డీసీసీల పదవులను నవంబర్ నెలాఖరులోగా భర్తీ చేయాలని టీపీసీసీ కృతనిశ్చయంతో ఉందని తెలుస్తోంది. -
కొత్త జిల్లాలు.. పార్టీలకు కొత్త తలనొప్పులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలకు రాజకీయ పార్టీలు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంధిగ్ధం నుంచి బయట పడటానికి ఆయా పార్టీలు చర్చలు చేపట్టాయి. కొత్త జిల్లాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా కమిటీలన్నింటినీ పునర్వ్యవస్థీకరించక తప్పడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు జిల్లా కమిటీలపై కసరత్తు చేపట్టాయి. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు, కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయంగా ఆయా పార్టీల నేతలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. జిల్లా పార్టీ కమిటీల్లో ప్రతి నాయకుడికి ఏదో ఒక పదవి దక్కే అవకాశాలున్నాయి. జిల్లాల పరిధి చిన్నగా ఉండటంతో జిల్లా కమిటీల్లో ఏదో ఒక పదవి దక్కుతుందని నేతలు ఎవరికి వారు అంచనాల్లో ఉన్నారు. కొందరు చిన్నస్థాయి నాయకులు కూడా రాష్ట్ర పార్టీ నేతలను కలిసి ఈ విషయాలపై ఆరా తీస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరించడానికి కొన్ని పార్టీలు ఇప్పటికే చర్యలు ప్రారంభించగా, మరికొన్ని పార్టీలు ఆ దిశగా ఇంకా ఆలోచనలు కూడా చేయడం లేదు. ఇప్పటివరకు ఒక పెద్ద జిల్లాకు పార్టీ నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన నేతలకు మాత్రం తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఇప్పుడు తన పరిధి తగ్గడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న జిల్లాకు ప్రాతినిథ్యం వహించడం ఇష్టంలేని నాయకులు రాష్ట్ర కమిటీల్లో చోటు కావాలని కోరుతున్నారు. ఇకపోతే, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేతను ఎప్పటిలాగే అలాగే కొనసాగించి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కొత్త వారిని నియమించాలన్న ఆలోచనకు కొన్ని పార్టీలు వచ్చాయి. అయితే, అందులోనూ పార్టీలకు చిక్కులు తప్పడం లేదు. జిల్లా కమిటీ నాయకులు విభజనలో వారు ప్రాతినిథ్యం వహించే ప్రాంతం వేరే జిల్లాకు వెళ్లిపోవడం, ఆ ప్రాంతంలో ఆ నేతలు అంతగా పట్టులేకపోవడం రాష్ట్ర నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మొత్తం జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని జిల్లా కమిటీలకు కొత్త వారిని అధ్యక్షులుగా నియమిస్తారని అంటున్నారు. ఇకపోతే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా అన్ని జిల్లాల డీసీసీలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నప్పటికీ ప్రస్తుత డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలన్న భావనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే వారు ప్రాతినిథ్యం వహించే ప్రాంతం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా బాధ్యతలను అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పీసీసీ సమావేశం నిర్వహించి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా పార్టీ కొత్త కమిటీలను నియమించే విషయంలో సీపీఎం మిగతా పార్టీలకన్నా ముందుంది. ఆ పార్టీ నల్గొండ జిల్లా కమిటీలను ఇప్పటికే విభజించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు కొత్త కార్యదర్శులను జాబితాను సీపీఎం ప్రకటించింది. -
నేడే కేబినెట్ భేటీ...
-
నేడే కేబినెట్ భేటీ
కొత్త జిల్లాలు, వేడుకల నిర్వహణపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో... కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌పై ప్రధానంగా చర్చించనున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేయాలనే దానితోపాటు దసరా రోజున కొత్త జిల్లాల ఏర్పాటు సంబురాల నిర్వహణకు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దానిపై కసరత్తు చేసేందుకు సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఉన్నతాధికారుల కమిటీని కూడా నియమించారు. మరోవైపు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా చేయాలని నిర్ణయించారు. కొత్తగా సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటికీ సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలిపే అవకాశముంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనందున వాటిలో కొన్నింటికి గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగుల డీఏ పెంపునకు సంబంధించిన ఫైలుపై కేబినెట్ లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది. -
జిల్లాల ప్రక్రియ నిలుపుదలకు నో: హైకోర్టు
తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను దసరా సెలవుల తరువాతకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని మండలాలతో కొత్త జిల్లాల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల సంబంధిత నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో ఖమ్మం జిల్లాకు చెందిన రమణల లక్ష్మయ్య మరో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గురువారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్రీనివాస్ తరఫు న్యాయవాది జె.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాల విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉండవని, గవర్నర్‌కు మాత్రమే అధికారాలు ఉంటాయన్నారు. గవర్నర్ సైతం గిరిజన సలహా మండలి సిఫారసుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదని, ఈ మండలి లేకుండా గిరిజన ప్రాంతాల విభజనపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నింటినీ గవర్నర్ ద్వారానే వినియోగించాల్సి ఉందని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాల సరిహద్దులను మార్చే విషయంలో అధికారాలన్నీ రాష్ట్రపతివేనని, గవర్నర్‌ను సంప్రదించిన తరువాతే రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. లక్ష్మయ్య తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. గిరిజన ప్రాంతాల సాధికారత, తెగల రక్షణ, సంక్షేమం కోసం రాజ్యాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు సుప్రీంకోర్టు తీర్పుల గురించి ప్రస్తావించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, అసలు ప్రభుత్వ చర్యలు అధికరణ 14కు ఎలా విరుద్ధమవుతాయో చెప్పాలని ప్రభాకర్‌ను కోరింది. అయితే ఆయన సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఆ తర్వాత కూడా పలు ప్రశ్నలు సంధించగా, వాటికి కూడా ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. దీంతో ధర్మాసనం గిరిజన ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిలుపుదలకు నిరాకరించింది. -
దృష్టి మళ్లించడానికే జిల్లాలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: సమస్యలు, ప్రభుత్వ చేతగానితనం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న జిల్లాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రజా సౌకర్యం, సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా అని ప్రశ్నించిన పొన్నం.. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించి, రాజకీయ ప్రయోజనం పొందడానికే జిల్లాల ఏర్పాటుపై వేగం పెంచారన్నారు. జిల్లాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. జిల్లాల ఏర్పాటులో విపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సూచనలు స్వీకరించకపోతే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలపై పునస్సమీక్షిస్తామని పొన్నం చెప్పారు. -
తీర్పునకు లోబడే అక్కడ కొత్త జిల్లాలు
కరీంనగర్లో ఏర్పడే జిల్లాలపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న జారీ చేసిన జీవో 362, ఫాం 1 నోటిఫికేషన్ల ఆధారంగా కరీంనగర్లో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో జారీ అయ్యే తుది నోటిఫికేషన్ కూడా కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌం టర్ దాఖలు చేయాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖరరెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని, అందుకు అనుగుణంగానే జీవో 362, ఫాం 1 నోటిఫికేషన్లను జారీ చేసిందని, వీటి అమలులో ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన న్యాయవాది ఎ.రమాకాంతరావు, ఇల్లంతకుంట మండలానికి చెందిన సీహెచ్ గంగాధర్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, తెలంగాణ జిల్లాల (ఏర్పా టు) నిబంధనలు-1984 ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ముందు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజల నుంచి సలహాలు, అభ్యం తరాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే కొత్త జిల్లాల ఏర్పాటులో ముందుకు వెళ్తోందని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) మహేందర్‌రెడ్డి స్పందిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, జీవో 362, ఫాం 1 నోటిఫికేషన్ల ఆధారంగా కరీంనగర్లో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటు.. తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుం దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లాలపై ఏకపక్ష నిర్ణయమేల?
* జిల్లాల ఏర్పాటుకు రాజ్యాంగ ప్రాతిపదికేది: టీజేఏసీ ఆక్షేపణ * ప్రభుత్వానిది తొందరపాటు నిర్ణయం * ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం సమగ్రమైంది కాదు * సీసీఎల్ఏకు లేఖ రాయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సమగ్ర నివేదిక, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన చేపట్టిందని తెలంగాణ జేఏసీ ఆక్షేపిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244, షెడ్యూల్ 5లోని అంశాలను పట్టించుకోకుండా కొత్త జిల్లాల పని ప్రారంభిస్తామనడం తొందరపాటు చర్యగా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీసీఎల్ఏకు ఒకట్రెండు రోజుల్లో జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం లేఖ రాయనున్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల విభజన అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటుచేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల భాష, సంస్కృతులు, చరిత్ర, జీవనవిధానం, అభివృద్ధి, వెనుకబాటుతనం, వనరులు వంటి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ కమిషన్ సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. దీని ప్రకారమే 1956లో దేశంలోని రాష్ట్రాలను పునర్విభజన చేశారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనూ అదే స్ఫూర్తితో జిల్లాల విభజన జరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరిస్తోంది’’ అని జేఏసీ లేఖ రాయనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు అవసరమేనని, అయితే అందుకు హేతుబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఎక్కడుందని జేఏసీ ప్రశ్నిస్తోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర నివేదిక తయారుచేస్తే జిల్లాల పునర్విభజనలో గందరగోళం, ప్రజల మధ్య వైషమ్యాలు తలెత్తేవి కావని భావిస్తోంది. ‘‘అధికారంలోకి వచ్చిన పార్టీలు తమ ఇష్టానుసారం కాకుండా శాసనబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పునర్విభజన చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల(ఏర్పాటు)చట్టం సమగ్రమైంది కాదు. జిల్లాల సరిహద్దుల మార్పునకు తప్ప ఇప్పుడున్న జిల్లాల్లాగా సమగ్ర స్వరూపాన్ని మార్చాలంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా, అనువైన కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసర ం ఉంది. కానీ చట్టం లేకుండా, శాసనసభలో చర్చించకుండా ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ జిల్లాల చట్టం-1974ను దత్తత తీసుకుంటూ ఉత్తర్వుల ద్వారా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది’’ అని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణకు ప్రత్యేక చట్టం రూపొందించే దాకా జిల్లాల పునర్విభజన ప్రక్రియను నిలిపివేయడం మంచిదంటూ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు జేఏసీ సిద్ధమైంది. కొత్త జిల్లాల ఏర్పాటును నిలిపివేయకుండా ముందుకే వెళ్లాలనుకుంటే కొన్ని సూచనలు పాటించాలని ప్రభుత్వానికి జేఏసీ సూచించింది. ఆ సూచనలివీ.. ⇒ విస్తీర్ణం, జనాభా, ఆదాయం, ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోవాలి ⇒ చారిత్రక, భౌగోళిక నేపథ్యాలు, భౌతిక లక్షణాలు, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు, సమస్యలు, విద్యా, సాంస్కృతిక అంశాలు, అభివృద్ధి వనరులు, సౌకర్యాలను అధ్యయనం చేయాలి ⇒ ఆ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూడాలి ⇒ పరిపాలనా సౌలభ్యం, మంచి పరిపాలన ఇవ్వడం లక్ష్యంగా ఉండాలి ⇒ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు నిర్దిష్ట ప్రాతిపదికను ప్రకటించాలి ⇒ జిల్లాల ఏర్పాటు తుది నిర్ణయం ప్రజాభీష్టం ప్రాతిపదికగా జరగాలి ⇒ షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనా సమగ్రతను పెంపొందించే లక్ష్యంగా ఆ ప్రాంతాలను ఎక్కడికక్కడ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి -
జిల్లాల విభజనపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించాలన్నారు. జిల్లాల పెంపు అశాస్త్రీయంగా ఉందని అన్నారు. 10 జిల్లాల తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఒకటి రెండు జిల్లాల కోసం దీక్ష చేయడం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ఠ అని అన్నారు. రాష్ట్రాల మధ్య చిచ్చు ఆరకముందే సీఎం కేసీఆర్ జిల్లాల మధ్య చిచ్చు రగిల్చారని అన్నారు. 27 నెలలుగా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని వాపోయారు. -
'జిల్లాల' సెగలు: నేటి నుంచి డీకే నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: జిల్లాల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తూ, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి డీకే అరుణ రెండు రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. శనివారం ఉదయం ఇక్కడ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమయ్యే ఈ దీక్ష 48 గంటల పాటు కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలతో పాటు వరంగల్ జిల్లా జనగామను జిల్లాగా ఏర్పా టు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. టీపీసీసీ నేతలతోపాటు వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, మేధావులు పాల్గొంటారని అరుణ, పొన్నాల వెల్లడించారు. అడ్డగోలుగా విభజన... జిల్లాల విభజన అత్యంత అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలసి శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం జిల్లాలను విభజించారన్నారు.గద్వాల, జనగామ జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నా, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. జిల్లాల ఏర్పాటు చేయాలని కోరితే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయని అరుణ విమర్శించారు. వనపర్తి జిల్లా కోసం 18 మండలాల ప్రజలు అంగీకరించారని చెప్పడం సరికాదన్నారు. వనపర్తిని జిల్లా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అక్కడ నిరంజన్‌రెడ్డిని ప్రజలు ఓడించారన్నారు. అన్ని సౌకర్యాలు, భౌగోళిక సౌలభ్యం, చారిత్రక నేపథ్యం ఉన్న గద్వాలను జిల్లాను చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారన్నారు. జనగామను జిల్లా చేస్తామన్న కేసీఆర్ ఎందుకు మోసం చేశారని పొన్నాల ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటులో విధివిధానాలు, పారదర్శకత, శాస్త్రీయత ఏమీ లేవన్నారు. -
జిల్లాల విభజనతో కేసీఆర్ పతనం ప్రారంభం
-ప్రజల క్షణికావేశంతోనే టీఆర్ఎస్కు అధికారం -హన్మకొండ విడదీస్తే ఆమరణ దీక్ష -కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ జనగామ(వరంగల్ జిల్లా) జిల్లాల విభజనతోనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు పతనం మొదలైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయద్దని, జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన జిల్లా బంద్‌లో ఆయన పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వరంగల్‌లో, జనగామలో సర్వే సత్యనారాయణ మాట్లాడారు. భువనగిరి ప్రాంతంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినందునే యాదాద్రి జిల్లా తెరపైకి వచ్చిందన్నారు. మైహోమ్స్ రామేశ్వర్రావు ఒక జిల్లా, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఈటెల కోసం మరో జిల్లా ఇస్తున్నాడని అన్నారు. జనగామను జిల్లాగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, జిల్లా ప్రజలంతా ఇవ్వాలని కోరుతున్నా సీఎం మొండివైఖరి అవలంభించడం సబబు కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11వ జిల్లా జనగామ చేస్తానని మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఘోరంగా మోసం చేశాడన్నారు. వరంగల్‌ను విడదీస్తే చరిత్రకు చేటు తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ మిగిలి పోతారని అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయం మార్చుకోకుంటే తాను జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా అయినప్పటికీ ప్రజల క్షణికావేశంతో తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాడని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి, నేరవేరలేని వాగ్దానాలు ఇవ్వడంతో ప్రజలు నమ్మి ఆయన పార్టీని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తుందన్నారు. కాలేజీల తనిఖీల పేరుతో ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు ఉన్నత విద్య అందడం లేదన్నారు. మరో రెండు నెలల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ స్థానంలో నేనే వస్తున్నా.. ఏంటో చెప్పను.. చమత్కారం చూస్తారు అని సర్వే అన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయినీ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ హన్మకొండ జిల్లా వద్దని, జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలు ఇచ్చిన బంద్‌ను జిల్లా ప్రజలు విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ప్రజల అకాంక్ష మేరకు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు నమిండ్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీను, కొత్తపల్లి శ్రీనివాస్, రజనీకాంత్, మైనంపాటి శ్రీను, ధన్‌రాజ్ పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలపై అభ్యంతరాల వెల్లువ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదాపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరో 17 జిల్లాలను ఏర్పాటు చేయడానికి ముసాయిదా రూపొందించిన ప్రభుత్వం దానిపై ప్రజల నుంచి అభిప్రాయాలను కోరిన విషయం తెలిసిందే. ఆమేరకు ఆగస్టు 22 న జిల్లాల వారిగా కొత్త సరిహద్దులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలపై వేలాదిగా స్పందిస్తున్నారు. ప్రధానంగా ఇదివరకు ఉన్న జిల్లాలో కాకుండా తమ మండలాన్ని మరో జిల్లాలో కలపడం, జిల్లాను విభజించి రెండుగానో అంతకన్నా ఎక్కువగానో ప్రతిపాదించిన వాటిల్లో ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గడిచిన వారం రోజుల్లో ఆన్ లైన్ లో పది వేల వరకు (సోమవారం రాత్రి వరకు 9,500) అభ్యంతరాలు నమోదయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించడానికి ప్రభుత్వం న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ పేరుతో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ పోర్టల్ ద్వారా ఇప్పటికే 9500 అభిప్రాయాలు నమోదు కాగా, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం 30 రోజుల గడువు విధించింది. తొలి వారంలో పది వేల మేరకు అభ్యంతరాలు నమోదు కాగా ప్రజల్లో కొత్త జిల్లాలపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. సిరిసిల్ల, జనగామ, గద్వాల వంటి చోట్ల నుంచి తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సిరిసిల్లను జిల్లాగా చేయాలని స్థానిక మంత్రి కేటీఆర్ స్వయంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కోరడంతో ఆ ప్రాంత వాసుల్లో జిల్లా ఏర్పాటుపై ఆశలు పెరిగాయి. తీరా ముసాయిదాలో సిరిసిల్ల లేకపోవడంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అలాగే జనగామను జిల్లా చేయాలని అక్కడివారు మొదటి నుంచి ఆందోళన బాట పట్టారు. ఈ రకంగా జిల్లాల డిమాండ్లతో పాటు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, తమ మండలాన్ని ఫలానా జిల్లాలో కలపొద్దని, తమ మండలాన్ని కొత్త జిల్లాలో కలపడం ఇబ్బంది కరంగా ఉందని... ఇలా రకరకాల అభ్యంతరాలతో పాటు కొత్త జిల్లాల రూపురేఖలపై అనేక సూచనలు ప్రజల నుంచి అందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆన్ లైన్ లో తెలియజేసిన సూచనలు, అభ్యంతరాల వివరాలు ప్రజలకు తెలియవు. గడువు పూర్తయిన తర్వాత ప్రభుత్వం వాటన్నింటిని వెల్లడిస్తుందా? లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. -
ప్రభుత్వ నోటిఫికేషన్ బట్టి జిల్లా కమిటీలు : సీపీఎం
సీపీఎం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేశాక పార్టీపరంగా నూతన జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీపీఎం నిర్ణయించింది. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు కార్యదర్శులుగా ఎవరిని నియమిస్తే బావుంటుందన్న దానిపై కూడా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. శుక్రవారం ఎంబీభవన్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకర ణపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉంది, దానిని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటన్న దానిపైనా చర్చించారు. -
జిల్లాల పునర్విభజనపై నేడే అఖిలపక్షం
సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో సమావేశం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో అంకానికి తెరలేస్తోంది. ఈ అంశంపై ఆయా రాజకీయ పార్టీల సూచనలు తీసుకునేందుకు శనివారం సచివాలయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీతోపాటు ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ నుంచి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంక ట్‌రెడ్డి హాజరవుతున్నారు. ఆయా రాజకీయ పక్షాలు తమ ఎజెండాల తో ఈ భేటీకి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాయి. కాగా అఖిలపక్ష భేటీకి ఆహ్వానం అందకపోవడంతో నిరసన తెలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. మార్గదర్శకాల కోసం పట్టుపట్టనున్న కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలు, ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. జిల్లాల ఏర్పాటు ప్రజల అవసరాల కోసం జరగాలని స్పష్టం చేయనుంది. మార్గదర్శకాలను ప్రకటించి, వాటి అమల్లో రాజకీయాలకు తావులేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంత్రాంగం ఏమిటో చెప్పాలని కోరనుంది. ముఖ్యంగా మార్గదర్శకాలను నిష్పక్షపాతంగా అమలుచేయడానికి జ్యుడీషియల్ కమిషన్‌కు అప్పగించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజల సౌలభ్యమే.. అంటున్న బీజేపీ కొత్తగా జిల్లాల ప్రతిపాదనల్లో ఆయా జిల్లాల జనాభా, భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, జిల్లా కేంద్రానికి దూరం, చారిత్రక నేపథ్యం, వనరులు, నీటివసతి వంటివాటిపై ప్రజల అభిప్రాయాలను, సౌలభ్యాన్ని ప్రశ్నిం చడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. జిల్లాల ఏర్పాటు కృత్రిమంగా, రాజకీయ, తాత్కాలిక అవసరాల కోసం కాకుండా చూడాలని.. ప్రజా ప్రయోజనాలు అంతిమంగా ఉండాలని పట్టుబట్టనుంది. వరంగల్ పట్టణాన్ని రెండుగా విభజిస్తూ... హన్మకొండను మరో జిల్లాగా చేయడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆ పార్టీ పేర్కొంటోంది. చారిత్రక నేపథ్యమున్న వరంగల్‌ను విడదీయడాన్ని వ్యతిరేకించే యోచనలో ఉంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో ఇతర జిల్లాలకు చెందిన మండలాలను కలిపే విషయంలో, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లను వికారాబాద్‌లో కాకుండా శంషాబాద్‌లో కలపాలనే డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకురానుంది. అసంపూర్తిగా సమాచారం ‘‘కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం పంపించిన సమాచారం అసంపూర్తిగా ఉంది. హైద రాబాద్ జిల్లా సమాచారమే లేదు. ఏ జిల్లాలో ఎంత జనాభా ఉంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. అసెంబ్లీ నియోజకవర్గాలను ముక్కలుగా చేయొద్దు. జిల్లా కేంద్రం మధ్యలో ఉండాలి. శాస్త్రీయంగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్‌ను బట్టి మా పార్టీ స్పందన ఉంటుంది..’’ - చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి ‘‘కొన్ని మండలాల ఏర్పాటు ప్రతిపాదనలు సమగ్రం గా లేవు. గిరిజన ప్రాంతాలను కలిపి ప్రత్యేకంగా కౌన్సిల్ ఉండాలి. జిల్లా కేంద్రం విషయంలో ప్రభుత్వం చెబుతున్న వాదన, వాస్తవ ప్రతిపాదనల్లో తేడాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ కలసి ఉండాలని చెబుతున్న ప్రభుత్వం.. వరంగల్, హన్మకొండలను ఎలా విడదీస్తోంది? అఖిలపక్షంలో వచ్చే ప్రతిపాదనలు, అభిప్రాయాలకు అనుగుణంగా మా వాదన వినిపిస్తాం..’’ - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాజకీయ లబ్ధికోసమే.. ‘‘కేవలం రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నట్లు అనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జిల్లాల విభజన ఉంటుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాల విభజన ఉండాలి..’’ - ఎల్.రమణ, టీ టీడీపీ అధ్యక్షుడు -
జిల్లాల జగడం
* ములుగులో కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం * సిరిసిల్లలో కేటీఆర్ ఇంటి ముట్టడి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైన తరుణంలో మా ప్రాంతాన్నీ జిల్లా చేయాలంటూ శుక్రవారం ఆందోళనలు ఉధృతమయ్యాయి. వరంగల్ జిల్లాలోని జనగామ, ములుగులను జిల్లాలుగా చేయాలని ఆయా జిల్లా సాధన సమితిల ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్‌ను తమ నుంచి వేరు చేయవద్దని, నిర్మల్ జిల్లా వద్దనే డిమాండ్ వినిపించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనూ ఆందోళన జోరు పెంచారు. జనగామలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బధం ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆందోళనలో పాల్గొన్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. పోలీసులు, పారామిలటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. గురువారం అర్ధరాత్రి నుంచే జనగామను తమ అధీనంలోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3.30కే జేఏసీ నాయకుల ఇళ్లకు వెళ్లి నిద్ర లేపి మరీ అరెస్టు చేశారు. ఆగ్రహం చెందిన ఉద్యమకారులు, మహిళా సంఘాల వారు 144 సెక్షన్‌ను ధిక్కరిస్తూ రహదారుల పైకి వచ్చారు. ప్రధాన చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో చేశారు. 200 మంది మహిళలు బోనాలతో తరలివచ్చి ఆందోళన చేయగా, పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పలువురు వృద్ధులు ఎస్సై రవీందర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంబర్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం నాయకులు బాల్దె మహేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట రహదారిలో జనగామ డిపో ఆర్టీసీ బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అక్రమ అరెస్ట్‌లు, ఎస్సై రవీందర్ తీరును నిరసిస్తూ శనివారం జనగామ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఇదే జిల్లాలోని ములుగును జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అహ్మద్‌పాషా ధర్నా వద్ద ఒంటికి నిప్పంటిం చుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్‌ను కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా సంరక్షణ సమితి సభ్యులు శుక్రవారం ఆదిలాబాద్‌లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను ఘెరావ్ చేశారు. ఆయన కాన్వాయ్ ఎదుట బైఠాయించారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మండలి చైర్మన్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల జిల్లాను ప్రతిపాదించి.. ఆ తర్వాత రద్దు చేయడంపై ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమన్నారు. ప్రజాసంఘాలు, న్యాయవాదులు, రాజకీయ పార్టీలు, ముస్లింలు మహాధర్నా, రాస్తారోకో చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఇంటిని బీజేపీ, బీజేవైఎం, ప్రజాసంఘాలు ముట్టడించాయి. సిరిసి ల్ల జిల్లా కోసం ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల బాల య్య ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు తెల్లవారుజామున దీక్షను భగ్నం చేశారు. ఇదే జిల్లాలోని హుస్నాబాద్ మండలాన్ని సిద్దిపేటలో కలపాలనే నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. కోహెడ మండలాన్ని సిద్దిపేటలో కలపాలన్న నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలని ఆందోళన నిర్వహించారు. -
జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటి? : డి.కె.అరుణ
మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం ప్రకటించాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆమె మాట్లాడుతూ, గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లా చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. అన్ని వనరులు, భౌగోళిక అనుకూలత ఉన్నా గద్వాలను జిల్లాగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశంలోనైనా గద్వాల జిల్లా గురించి ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
ముందుగానే ప్రతిపాదనలు పంపించండి: చాడ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష భేటీకి ముందుగానే ప్రభు త్వ ప్రతిపాదనలను తమకు పంపించాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శికి సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం విజ్ఞప్తిచేశారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా తాము సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అఖిలపక్ష భేటీకి తాను, పార్టీ సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ భేటీకి ముందుగానే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ భేటీకి సీఎం హాజరవుతున్నారా లేదా అన్నది తెలపాలని కోరారు. -
20న జరిగేది అఖిలపక్షమా.. ఏకపక్షమా?
అఖిలపక్ష భేటీకి వైఎస్సార్సీపీని పిలవకపోవటం పెద్ద తప్పు జిల్లాల విభజనలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం ప్రకటనలకే పరిమితమైన బంగారు తెలంగాణ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ధ్వజం హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం.. కేవలం ఏకపక్ష సమావేశం లాగా కనపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్సీపీని పిలవకపోవటం పెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై 10 జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, అది గుర్తించిన సీఎం కేసీఆర్ కంటితుడుపు చర్యగా, ఒక పద్ధతి అంటూ లేకుండా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీకి చెందిన 58, 59 జీవోలకు సంబంధించి గత ఏడాది అఖిలపక్షానికి వైఎస్సార్సీపీని పిలిచిన ప్రభుత్వం.. ఇప్పుడు పిలవకపోవటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. సీపీఐ, సీపీఎంను పిలిచి వైఎస్సార్సీపీని మాత్రం విస్మరించారన్నారు. అఖిలపక్షానికి పిలిచినా, పిలవకపోయినా జిల్లాల విభజనలో ప్రజల కోరికకు మద్దతుగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ జిల్లాలను విభజిస్తే వైఎస్సార్సీపీకి అభ్యంతరలేదని, సీఎం సొంత రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చేస్తే మాత్రం ప్రజల పక్షాన నిలిచి ఆందోళనలు సాగిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ గెజిట్ పత్రికలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలను అఖిలపక్షానికి ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని, వైఎస్సార్సీపీ తప్ప మిగతా పార్టీలన్నింటినీ ఆహ్వానించారని చెప్పారు. ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్సీపీ మూడో స్థానంలో ఉందంటూ.. అందుకు సంబంధించిన ఆధారాలను శివకుమార్ మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఆగస్టు 15 వేడుకలకు కూడా వైఎస్సార్సీపీని పిలవలేదని ఆరోపించారు. 26 నెలల్లో పూటకో మాట, వారానికో ఒక నిర్ణయం లాగా సీఎం కేసీఆర్ పాలన సాగిందని, ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ పత్రికా ప్రకటనలకే పరిమితమైందని చెప్పారు. బంగారు తెలంగాణలో ముఖ్యమంత్రికి సమర్పించాల్సిన వినతిపత్రాల్ని, ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవటంతో గవర్నర్‌కు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పటికే 16సార్లు మొట్టికాయలు వేసిందని శివకుమార్ గుర్తుచేశారు. పార్టీ ఫిరాయిం చిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, 3 వారా ల్లో సమాధానం చెప్పాలని నోటీసులు ఇవ్వటం సరైం దేనన్నారు. సుప్రీం నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు పార్టీ కండువలు కప్పినంత మాత్రా న సరిపోదని, ఎన్నికలకు వెళ్లే దమ్ము ధైర్యం ఉండాలని చెప్పారు. ఆహ్వానం అందకుంటే 20న ఆందోళనలు నాగర్‌కర్నూల్: పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తజిల్లాల ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ స్వాగతిస్తుందని, కానీ ఈనెల 20న నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీకి ఆహ్వానం అందించకపోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంతర్యమేమిటని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ ఎంగిలిమెతుకులకు ఆశపడి వెళ్లారని, అంతమాత్రాన పార్టీ విలీనమైనట్లు కేసీఆర్ భ్రమపడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రజలు గుర్తించిన పార్టీ అని పేర్కొన్నారు. గురువారం సాయంత్రంలోగా ఆహ్వానం అందకుంటే హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి తరువాత రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు, పార్టీ ఫిరాయించిన వారికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చి మూడువారాలలో స్పందించాలని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తన మేనిఫెస్టో భగవద్గీత అని, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఒకప్పుడు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రైతులను ఏడిపిస్తున్నారని అన్నారు. మూడో దఫాలో రూ. 25 వేలు రుణమాఫీ చేయాల్సి ఉండగా, రూ. 12,500 మాత్రమే చేశారని, 60 శాతం రైతుల పాస్‌బుక్కులు బ్యాంకుల్లో ఉన్నాయని, రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. పాలమూరు జిల్లాలో రైతులకోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులు చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేశారని, మిగతా పనులు పూర్తి చేస్తే వైఎస్‌కు పేరొస్తుందనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుందని ఎద్దేవా చేశారు. పాల మూరు ప్రాజెక్టుల సందర్శనపై ఈనెల 24న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల్లో రెండు రకాల కేడర్లుండాలి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కాకుండా రెండు రకాల కేడర్లుగానే ఉద్యోగులను భర్తీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం టీజీవో భవన్లో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత అధ్యక్షతన ‘కొత్త జిల్లాల ప్రతిపాదనలు- ఉద్యోగుల విభజన, రాష్ట్రపతి ఉత్తర్వులు’ అనే అంశంపై చర్చ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు. ప్రస్తుతం జోనల్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలను నియామకాల సమయంలో జిల్లాస్థాయిలో చేపట్టి, తుది కేటాయింపులు మాత్రం రాష్ట్రస్థాయిలో చేపట్టాలని కోరారు. ఇందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి, అందులో టీజీవోలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కొత్త జిల్లాల్లో ఆయా జిల్లాల అధికారులను, వారి అధికారాలను తగ్గించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకువచ్చి కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను వెనక్కి పంపాలన్నారు. కమల్‌నాథన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పునస్సమీక్షించి, జరిగిన అవకతవకలను సరిదిద్దాలన్నారు. కాంపెన్సేటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు చెల్లించే మొత్తం గిట్టుబాటు కాకుంటే ప్రీమియం చెల్లించేం దుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఎస్‌ను కలసి ఇదే విషయాన్ని తెలియజేశామన్నారు. సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నేతలు జి.విష్ణువర్ధన్ రావు, పురుషోత్తం రెడ్డి, జి.రామేశ్వర రావు, ఎస్.సహదేవ్, ఎం.మోహన్ నారాయణ, టి.రవీం దర్ రావు, మధుసూదన్ గౌడ్, పి.రవీందర్ రావు, జి.వెంకటేశ్వర్లు, ఎం.బి.కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మా ప్రాంతాలను హైదరాబాద్‌లో కలపొద్దు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య పేచీ మొదలైంది. రెండు ప్రాంతాల ప్రజాప్రతినిధులు తమ జిల్లాల పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. కొత్త జిల్లాలపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఎదుట పంతాలకు పోయారు. దాంతో శనివారం హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన జిల్లాలవారీ ప్రజాప్రతినిధుల భేటీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షెడ్యూలు ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులతో ఉపసంఘం సంయుక్త సమావేశం ఏర్పాటు చేసింది. తీరా సమావేశం మొదలవగానే రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు దీనిపై అభ్యంతరం తెలిపారు. తమ జిల్లాలోని ప్రాంతాలను హైదరాబాద్ జిల్లాతో కలపడం సరికాదన్నారు. అందుకే ఆ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి కూచోవటం తమకిష్టం లేదంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో రెండు జిల్లాల ప్రతినిధులతో ఉపసంఘం విడిగానే సమావేశమైంది. మంత్రులు పి.మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డితో పాటు రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాను అవసరమైతే రెండు, మూడు జిల్లాలుగా విభజించాలే తప్ప హైదరాబాద్‌లో కలపటం సరి కాదని మహేందర్‌రెడ్డి చెప్పగా పార్టీలకతీతంగా ఆ జిల్లా నేతలంతా సమర్థించారు. మరోవైపు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా ఉండటం అశాస్త్రీయమని ఎంఐఎం ఎమ్మెల్యేలన్నారు. రంగారెడ్డి నేతలకు, ప్రజలకు ఇష్టం లేనప్పుడు హైదరాబాద్‌లో కలిపే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లతో ఒకే జిల్లా చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. జిల్లాల విషయంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. పీవీ పేరుతో మంథని జిల్లా దివంగత ప్రధాని పీవీ నరసింహరావు పేరుతో మంథని కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కరీంనగర్ సమీక్షలో ఎమ్మెల్యే పుట్ట మధు ప్రతిపాదించారు. తమ ప్రాంతాన్ని భూపాలపల్లి జిల్లాలో కలపకుండా భూపాలపల్లినే పీవీ జిల్లాలో కలపాలన్నారు. కోహెడ, హుస్నాబాద్, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలను ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో కలపటం సరికాదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కోదాడ, హుస్నాబాద్‌లను సిద్దిపేటలో; ఎల్కతుర్తిని వరంగల్‌లో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్యే సతీశ్‌బాబు అన్నారు. కోరుట్ల, ధర్మపురిలను రెవిన్యూ డివిజన్లు చేయాలని ఎంపీ సుమన్ సూచించారు. సిరిసిల్ల జిల్లా అంశం ప్రస్తావనకు రాలేదు. ఖమ్మం జిల్లాలో గార్ల, బయ్యారం, వెంకటాపురం, వాజేడు మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపొద్దని, కల్లూరును కొత్త డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. ఆదివారం మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలతో ఉపసంఘంభేటీ కానుంది. -
‘జోనల్’పై భిన్నాభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జోనల్ వ్యవస్థపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేసి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో రెండంచెల ఉద్యోగ వ్యవస్థను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. జోనల్ స్ఫూర్తికి విఘాతం కలుగకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ఎంసీహెచ్ఆర్డీలో ప్రత్యేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉన్నతాధికారుల సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 30 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా రోజున జిల్లాల ఏర్పాటుకు గడువు విధించిన తరహాలోనే.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దసరాలోగా పరిష్కరించాలని సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, డీఏను చెల్లించాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలని కోరారు. ఎవరేమన్నారంటే.. జోన్ల వ్యవస్థను రద్దు చేసి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో రెండంచెల ఉద్యోగ వ్యవస్థ ఉండాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.మమత, ఏ.సత్యనారాయణ పేర్కొన్నారు. అవసరం లేని విభాగాలు, కార్పొరేషన్లను విలీనం చేసి, జోన్ల వ్యవస్థను రద్దు చేయాలని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ ప్రతినిధులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హనుమంత్ నాయక్, శశికిరణాచారి విజ్ఞప్తి చేశారు. అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా తీసుకోవాలని పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు సరోత్తమ్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ప్రతిపాదించారు. జోనల్ వ్యవస్థను కొనసాగించాలని, ఆరు జోన్లుగా విభజించాలని యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి కోరారు. కొత్త జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల వరకు 20 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని పీఆర్టీయూ-తెలంగాణ ప్రతినిధులు కోరారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని తెలంగాణ టీచర్స్ యూనియన్(టీటీయూ) అధ్యక్ష కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలను ఆరు జోన్లుగా విభజించాలని, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జిల్లా పోస్టులుగా, ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2 గెజిటెడ్ హెచ్ఎంలను జోనల్ పోస్టులుగా గుర్తించాలని ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానందగౌడ్ విజ్ఞప్తి చేశారు. జోన్ల వ్యవస్థ అశాస్త్రీయం: టీఎన్జీవో ప్రస్తుతం ఉన్న జోన్ల వ్యవస్థ శాస్త్రీయంగా లేదని, అందువల్ల ఇక ఈ వ్యవస్థ అక్కర్లేదని టీఎన్జీవో సంఘం ప్రతినిధులు దేవీ ప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, హమీద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘సూపరింటెండెంట్ కేడర్ వరకు పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా భర్తీ చేయాలి. 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్ కేటగిరీకి కేటాయించాలి. ఆపై స్థాయి పోస్టుల్లో 30 శాతం ఓపెన్ కేటగిరీని మాత్రమే నేరుగా నియామకం చేపట్టాలి. మిగతా 70 శాతం ప్రమోషన్ల ద్వారా అన్ని జిల్లాలకు సమాన అవకాశమివ్వాలి. హెచ్‌వోడీ కార్యాలయాల్లో 30 శాతం డెరైక్ట్ రిక్రూట్మెంట్, 70 శాతం ప్రమోషన్లు పాటించాలి. జిల్లా నుంచి హెచ్‌వోడీకి, సెక్రెటేరియట్‌కు, అక్కణ్నుంచి జిల్లాలకు బదిలీల విధానం ఉండాలి. జనాభాకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెంచాలి. కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో ఇప్పుడున్న పోస్టుల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. ఉన్న పోస్టులనే పంపిణీ చేయడం సరి కాదు’’ అని వారు పేర్కొన్నారు. -
‘కొత్త ఫైల్’ రెడీ!
♦ దుమ్ము దులిపి.. స్కాన్ చేసి.. ♦ జేసీ పర్యవేక్షణలో రెవెన్యూ ఫైలింగ్ పనులు సాక్షిప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాలో పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైళ్ల స్కానింగ్ పనులకు రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జేసీ దివ్య పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది సోమవారం నుంచి పాత ఫైళ్లన్నింటినీ మండలాలు, గ్రామాలవారీగా నంబర్లను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతోపాటు ఒక్కొక్కటిగా స్కానింగ్ చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడితే ఫైళ్లన్నీ భద్రంగా పెట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించడంతో జిల్లా రెవెన్యూ సిబ్బంది ఆ దిశగా పాత ఫైళ్లను దుమ్ముదులిపి క్రమసంఖ్యలో స్కాన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దశాబ్దాల క్రితం ఫైళ్లు కూడా ఉండటంతో అవన్నీ శిథిలావస్థకు చేరి.. చిరిగిపోయి ఉన్నాయి. జేసీ సూచనల మేరకు వీటిని రికార్డు గది నుంచి తీసి.. మండలం పేరు, గ్రామం, ఫైల్ సంఖ్యను ముందుగా కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత వీటిని స్కాన్ చేసి మండలాలవారీగా కోడ్ నమోదు చేసి.. కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ఎప్పటికైనా సమాచారం భద్రంగా ఉంటుందని జేసీ సూచించడంతో ఉద్యోగులు ఆ పనిలో మునిగిపోయారు. 20 మండలాల సమాచారం కొత్తగూడెం జిల్లాలోకి వస్తాయని భావిస్తున్న 20 మండలాల సమాచారాన్ని స్కానింగ్ చేసే పనిలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. గ్రామాల సరిహద్దులు, నక్షాలు, చెరువు శిఖం, ప్రభుత్వ భూములు, పహాణీలు తదితర వివరాలతో కూడిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లాకు కొత్త అధికారులు వస్తారనే ఆలోచనతో వారికి గ్రామాలు, మండలాలకు సంబంధించిన వివరాలు సులువుగా దొరకాలనే ఉద్దేశంతో ఈ ఫైళ్లను రెడీ చేస్తున్నారు. మండలాలకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లో నమోదు చేయడంతోపాటు ఫైళ్లను స్కాన్ చేసే పని అయిన తర్వాత ఖమ్మం జిల్లాలోకి వచ్చే మండలాల ఫైళ్లను కూడా ఇలాగే చేయనున్నారు. ఫైళ్లన్నీ మాన్యువల్‌గా అందుబాటులో ఉండటంతోపాటు మండలం కోడ్‌తో కంప్యూటర్లో కూడా వివరాలను తెలుసుకునేలా చూస్తున్నారు. కొత్త జిల్లాలో ఫలానా గ్రామంలోని సర్వే నంబర్ చూడాలంటే వెంటనే కంప్యూటర్లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది. -
‘ఖేడ్’పై కుస్తీ!
♦ పునర్విభజనపై ముమ్మర కసరత్తు ♦ స్థానికంగా వెల్లువెత్తుతున్న నిరసనలు ♦ సంగారెడ్డిలోనే ఉంచుతూ అధికారుల ప్రతిపాదనలు ♦ ఆమోదం కాకపోవచ్చంటున్న ఉన్నత స్థాయి వర్గాలు ♦ భౌగోళిక స్వరూపం.. మెదక్వైపే మొగ్గు సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మమ్మురంగా సాగుతోంది. దసరా నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పునర్విభజనకు తుది మెరుగులు దిద్దుతోంది. మంగళవారం కలెక్టర్ రోనాల్డ్‌రోస్ జిల్లా స్థాయి అధికారులతో, డీఆర్వో దయానంద్ వివిధ శాఖల సూపరింటెండెంట్లతోనూ వేర్వేరుగా సమావేశమాయ్యారు. ఉద్యోగుల లభ్యత, ప్రాంతాల పంపకాలపై చర్చించారు. సిద్దిపేట జిల్లాపై పూర్తి స్పష్టత సాధించిన అధికారులు.. సంగారెడ్డి, మెదక్ జిల్లాల పునర్విభజనపైనే మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధానంగా నారాయణఖేడ్ నియోజకవర్గంపై అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. భౌగోళిక స్వరూపం, పునర్విభజనలోని 60 కిలోమీటర్ల లోబడిన పరిధి నింబధనల ఆధారంగా నారాయణఖేడ్ మెదక్ జిల్లాలోకి వస్తుంది. తొలుత అధికారులు మెదక్ జిల్లాలోనే కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్థానికంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బహిరంగంగానే తన వాదన అధికారులకు, మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. రవాణా పరంగా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సంగారెడ్డి, హైదరాబాద్‌కే సౌకర్యా లు మెరుగ్గా ఉన్నాయి. నియోజకవర్గ వాసులు ఏ పనులకైనా సంగారెడ్డి, హైదరాబాద్ లేదా బీదర్‌కు వెళ్తారు. కానీ మెదక్‌కు అసలే వెళ్లరు. వలసవెళ్లినవారిలో మెజార్టీ వాసులు హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచుతూ మరో ప్రతిపాదనను సీసీఎల్ఏకు పంపారు. అధికారులైతే ప్రతిపాదనలు పంపారు కానీ దీనికి తుది ఆమోదం లభిస్తుందా? అనే దానిపై సందిగ్ధత నెలకొన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం నుంచి సంగారెడ్డి 85 కిలోమీటర్లు, అదే మెదక్ జిల్లా కేంద్రం 56 కిలో మీటర్ల దూరమే వస్తుంది. ఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలోని చివరి గ్రామం దెగుల్వాడీ నుంచి సంగారెడ్డి 129 కిలోమీటర్లు కాగా దెగుల్వాడీ నుంచి మెదక్ 88 కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుంది. మరో ప్రధానమై అంశం ఏమిటంటే నారాయణఖేడ్ ప్రజలు సంగారెడ్డికి రావాలంటే ఆందోల్ నియోజకవర్గ కేంద్రం మీదుగా రావాలి. ప్రస్తుత ప్రతిపాదనలతో అందోల్ నియోజకవ ర్గం మునిపల్లి, రేగోడు మండలాలు మినహా మెదక్ జిల్లాలోకి వెళ్తుంది. అంటే నారాయణఖేడ్ వాసులు మెదక్ జిల్లా దాటి సంగారెడ్డిలోకి ప్రవేశించాలి. మరో వైపు అందోల్ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా తమను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బాబూమోహన్ కూడా అధికారులను, మంత్రిని కలిసి తమ ప్రజల అభిప్రాయాన్ని వారికి వివరించారు. పైగా అందోల్ నియోజకవర్గ కేంద్రం సంగారెడ్డికి 30 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. దగ్గరగా ఉన్న అందోల్ నియోజకవర్గాన్ని పక్కనపెట్టి దూరంగా ఉన్న నారాయణఖేడ్‌ను కలపటం వల్ల ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు నోటిఫికేషన్ వెలువడిన తరువాత అందోల్ ప్రజలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అదే జరిగితే పునర్విభజనలో శాస్త్రీయత లోటు స్పష్టంగా బయటపడుతుందని, దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కుస్తీ పడుతోంది. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్‌తో కలెక్టర్ల భేటీ
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ భేటీయ్యారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై కలెక్టర్లతో ఆయన చర్చ జరపనున్నారు. ప్రస్తుతమున్న జిల్లాలన్నీ రెండు లేదా మూడు జిల్లాలుగా పునర్విభజించే ఆలోచనలో ప్రభుత్వముంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలు, డివిజన్లు, కొత్త మండలాలపై నివేదికలు, వాటి భౌగోళిక స్వరూపం, నమూనా మ్యాపులను కలెక్టర్లు రూపొందించారు. ఈ ప్రక్రియకు నిర్దేశించిన రోడ్ మ్యాప్‌పై జిల్లా కలెక్టర్లతో రాజీవ్ శర్మ ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపై కలెక్టర్లకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. -
ములుగును జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయూలి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి వినతి ములుగు : ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ తుడుందెబ్బ, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఏజెన్సీ గిరిజన నియోజకవర్గ ప్రాంతాలకు జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయడానికి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారన్నారు. నూతన జిల్లా పేరుతో ఏజెన్సీని మూడు ముక్కలుగా విభజించాలని చూస్తే అన్యాయం జరుగుతుందన్నారు. మంథని, మహదేవపూర్, కాటారం, ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను కలుపుకొని ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం విషయాన్ని పరిశీలిస్తామని అన్నట్లు కొమురం ప్రభాకర్ తెలిపారు. జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, తుడుందెబ్బ జిల్లా అడ్వయిజర్ పోదెం రత్నం, ప్రధాన కార్యదర్శి నారాయణ, డివిజన్ అధ్యక్షుడు కబ్బాక శ్రావణ్, భూపోరాట నాయకులు ముద్దెబోయిన రవి, రామారావు పాల్గొన్నారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ ఏటూరునాగారం : ఐకేపీ ఆధ్వర్యంలో 10 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమమంత్రి చందూలాల్, ఎంపీలు సీతారాంనాయక్, పసునూరి దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ పద్మ పంపిణీ చేశారు. బుధవారం ఐటీడీఏ ఆవరణలో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి వారితో ముచ్చటించారు. ఒక్కో సైకిల్ రూ. 7500ల విలువ చేస్తోందని ఐకేపీ ఐబీ డీపీఎం శ్రీనివాస్ డిప్యూటీ సీఎంకు వివరించారు. సైకిళ్లను కాపాడుకోవాలని కడియం సూచించారు. ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఏపీఓ వసంతరావు, ఏఓ రఘు పాల్గొన్నారు. -
శాస్త్రీయ పద్ధతిలోనే జిల్లాల ఏర్పాటు
► ప్రజలు, పరిపాలన సౌలభ్యం ప్రకారం నిర్ణయం ► డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ములుగు: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాల పునర్విభజన శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతుందని, ప్రజలు గమనించాలని డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రూ. కోటితో మం జూరైన ఎంపీడీఓ కార్యాలయ నూతన భవనానికి నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, గిరిజన శాఖ మం త్రి అజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడి యం మాట్లాడుతూ ప్రజలు, పరిపాలన సౌల భ్యం ప్రకారం అన్ని రకాలుగా విశ్లేషణలు జరిపి న తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. జిల్లాల ఏర్పాటకు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు జిల్లా అంశాన్ని వక్రీరించి ప్రజలను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. స్థానికంగా జరుగుతున్న ఉద్యమాలు, ప్రజల మనోభావాలను సీఎం దృ ష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలను సమన్వయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని తెలిపారు. 250 గురుకుల పాఠశాలలు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహించడానికి 250 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం అన్నారు. షెడ్యూల్ కులాల కోసం 100, ఎస్టీకు 50, మైనార్టీల కోసం 70, మరో 30 డిగ్రీ ఎస్సీ బాలికల కోసం మంజూరు చేసినట్లు చెప్పారు. మంత్రి చందూలాల్ సూచన మేరకు ములుగు డిగ్రీ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ, తహసీల్దార్ కార్యాలయ నూతన భవన మంజూరుకు జిల్లా నిధుల నుంచి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ పద్మ, ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ములుగు, ఏటూరునాగారం ఎంపీపీలు భూక్య మంజుల, మెహిరున్నీసా, జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ, ఆర్డీఓ మహేందర్‌జీ, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి, సర్పంచ్ సాగర్, ఎంపీటీసీ సభ్యులు పోరిక విజయ, గోవింద్‌నాయక్, సంపత్‌రావు, శిరీష, జానమ్మ, టీఆర్ఎస్ ములుగు, వెంకటాపురం మండల అధ్యక్షులు గట్టు మహేందర్, పోరిక హర్జినాయక్ పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీకి పునర్విభజన చిక్కు
కొత్త జిల్లాల ప్రకారం పోస్టుల విభజనకు మరింత సమయం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు నిరుద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన గ్రూపు-2 పోస్టుల భర్తీ, కొత్త నోటిఫికేషన్లు... అంతా అస్తవ్యస్తమవుతుందనే ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాల పునర్విభజనలో హద్దులు చెదిరిపోతే.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సైతం నిలిచిపోయే ప్రమాదం ఉందని, న్యాయపరమైన చిక్కులు తప్పవనే సంకేతాలు లక్షలాది మంది అభ్యర్థులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన 439 పోస్టులు, త్వరలో రాబోయే మరో 460 గ్రూపు-2 పోస్టుల భర్తీ పరిస్థితి ఏంటన్న అంశంపై గందరగోళం నెలకొంది. వీటి కి జోనల్ సమస్యలుండగా, 15,628 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జిల్లా సమస్యలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. జిల్లాల ఏర్పాటుకు ముందే చేపట్టాలి... గ్రూపు-2కు దరఖాస్తు చేసిన 5,64,434 మంది నిరుద్యోగులు, ఇప్పటికే టెట్ అర్హత పొందిన లక్షన్నర మంది, కొత్తగా టెట్ రాసిన 3.72 లక్షల మంది ఉద్యోగాల భర్తీకి ఎదురు చూస్తున్నారు. పాఠశాలల హేతుబద్దీకరణ పూర్తి కాగానే ఉపాధ్యాయ ఖాళీలు, సీఎం ఆమోదం రాగానే అదనపు గ్రూపు పోస్టులతో ఉద్యోగాల భర్తీని టీఎస్పీఎస్సీ చేపడుతుందని భావించినా కొత్త జిల్లాల కసరత్తుతో ఆ ప్రక్రియకు బ్రేక్ వేసినట్లయింది. ఈ కసరత్తుతో ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో సాధ్యం కాదని, జిల్లాల ఏర్పాటు కంటే ముందే ఉద్యోగాల భర్తీ చేపడితేనే న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి నెలా వేల రూపాయలు వెచ్చించి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు.. ఉద్యోగాల భర్తీ మరింత ఆలస్యం అయితే తీవ్ర అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. రెండు కొత్త జిల్లాలతో జోనల్ సమస్య! ఇప్పటివరకు ఐదో జోన్లో ఉన్న వరంగల్‌లోని మూడు మండలాలు, ఆరో జోన్ పరిధిలోని నల్గొండలో 11 మండలాలను కలిపి కొత్తగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో గ్రూపు-2 పోస్టుల భర్తీలో జోనల్ సమస్య తలెత్తనుంది. ఆరో జోన్లో ఉన్న మెదక్ జిల్లాలోని 12 మండలాలు, ఐదో జోన్‌లోని కరీంనగర్ జిల్లాలో ఉన్న 5 మండలాలు, అలాగే ఐదో జోన్లోనే ఉన్న వరంగల్ జిల్లాలోని 4 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించింది. గ్రూపు-2కు తమ జోన్ పరిధిలో ఉన్న పోస్టులకు అనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ జోన్లు మారితే ఈ పోస్టుల భర్తీ గందరగోళమవనుంది. టీచర్ పోస్టుల భర్తీలో ఎన్నో సమస్యలు... టీచర్ తదితర జిల్లా స్థాయి పోస్టుల భర్తీ విషయంలో అనేక సమస్యలు తలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖాళీలు భర్తీ చేయకపోతే అందుకు మరింత సమయం పడుతుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలను చూస్తే ఒక జిల్లాలోని మండలాలన్నీ అదే జిల్లా పరిధిలో లేవు. ఉదాహరణకు వరంగల్ , కరీంనగర్ జిల్లాల్లోని వివిధ మండలాలతో ఆచార్య జయశంకర్ జిల్లా ప్రతిపాదన ఉంది. ఇప్పటివరకు ఏ జిల్లా పోస్టులు ఆ జిల్లా యూనిట్‌గానే భర్తీ చేశారు. కానీ కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాల్లోని ఖాళీలను మాత్రమే తీసుకొని నోటిఫై చేయాల్సి వస్తుంది. ఇందుకు చాలా సమయం పట్టనుంది. పైగా జిల్లాలు ఏర్పడితేనే పోస్టుల విభజన చేయాల్సి ఉంటుంది. అంతవరకు పోస్టులను విభజించి భర్తీ చేయడానికి వీల్లేదు. ఈ లెక్కన పోస్టుల భర్తీలో కూడా ఆలస్యం తప్పేలా లేదు. ఏజెన్సీ ప్రాంతాలున్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో మరో సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు 66 ఖాళీగా ఉన్నాయి. అందులో మైదాన ప్రాంతంలో 60 పోస్టులు ఖాళీగా ఉంటే ఏజెన్సీ మండలాల్లోని పాఠశాలల్లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం అనుకున్నట్లుగా భద్రాద్రిని జిల్లా చేస్తే అక్కడున్న ఆరు పోస్టులకే ఆయా మండలాలకు చెందిన అభ్యర్థులంతా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
వరంగల్ జిల్లా మూడు ముక్కలు..
ప్రస్తుత వరంగల్ జిల్లా మూడు ముక్కలు కానుంది. జిల్లాలో ఇప్పుడు 51 మండలాలు ఉండగా, అధికారులు రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం ఇందులో ఏడు మండలాలు సిద్ధిపేట, యూదాద్రి జిల్లాల్లోకి వెళ్తున్నారుు. వరంగల్ జిల్లాలో కరీంనగర్ నుంచి ఆరు మండలాలు కలువనున్నారుు. ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా(భూపాలపల్లి)లో కరీంనగర్ నుంచి ఏడు, ఖమ్మం జిల్లా నుంచి రెండు మండలాలు, మానుకోట జిల్లాలో ఖమ్మం నుంచి మూడు మండలాలు కలువనున్నారుు. వరంగల్: జిల్లాల పునర్విభజన కొలిక్కి వస్తోంది. ప్రస్తుత వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా మార్చేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూపాలపల్లి, మహబూబాబాద్‌లో పరిపాలన సౌకర్యాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. మూడు జిల్లాల అవసరాలకు తగినట్లుగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. మండలాల వారీగా మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, ప్రణాళిక శాఖలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయం సమన్వయంతో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రస్తుత వరంగల్ జిల్లాను.. వరంగల్, మానుకోట, ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. మండలాల ప్రాతిపదికగా పునర్విభజనకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న కలెక్టర్ వాకాటి కరుణ మంగళవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. అప్పుడు జిల్లాల పునర్విభజన ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు రూపొందించే ప్రతిపాదన కోసం ప్రజాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని సమాచారం ఇవ్వాలని మండలాల అధికారులకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మండలాల ప్రాతిపదికగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీలతో సమావేశం వంటి ప్రక్రియల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం మూడు జిల్లాల స్వరూపం ఇలా ఉండనుంది. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 51 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట మండలాలను కొత్తగా ఏర్పడే సిద్ధిపేట జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ అంశంపై నాలుగు మండలాల వారికి సానుకూలత ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న జనగామ, లింగాల ఘణపురం, దేవరుప్పుల మండలాలను కొత్తగా ఏర్పడనున్న యాదాద్రి(భువనగిరి) జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లింగాలఘనపురం, దేవరుప్పులలో ఈ ప్రతిపాదనపై సానుకూలత ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు జనగామలో విభిన్న పరిస్థితి నెలకొంది. జనగామ మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జనగామ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమం కొనసాగుతోంది. ప్రతి రోజు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ అంశంలో అధికారులు ఇంకా స్పష్టతకు రాలేదని తెలిసింది. ప్రతిపాదిత జిల్లాల్లో కలిపే ఖమ్మం జిల్లాలోని పలు మండలాలపైనా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఇల్లందు మండలాలను భద్రాద్రి(కొత్తగూడెం) జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు రూపొందించారు. అరుుతే వాజేడు, వెంకటాపురం మండలాలు కొత్తగూడెం కంటే దగ్గరగా ఉండే ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా(భూపాలపల్లి)లో కలిపేలా మరో ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. ఇల్లందు మండలాన్ని భద్రాద్రి(కొత్తగూడెం) జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. అరుుతే కొత్తగూడెం కంటే దగ్గరగా ఉండే మానకోట(మహబూబాబాద్)లో కలిపేందుకు తాజా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిసింది. -
ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు
టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి నెక్కొండ: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రజల అభీష్టం మేరకే జరుగుతుందని టీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో నెక్కొండ మండలాన్ని మహబూబాబాద్ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రకటించిందన్నారు. ఆ మండలం మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నందున..ఆ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రకటించారన్నారు. నెక్కొండ మండలాన్ని వరంగల్ జిల్లాలో కలిపాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు వరంగల్ జిల్లాలో కలిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్ నబీ, వైస్ ఎంపీపీ దొనికెన సారంగపాణి, రామాలయ కమిటీ చైర్మన్ గన్ను కృష్ణ, నాయకులు అంబాల రాంగోపాల్, తాళ్లూరి లక్ష్మయ్య, చల్లా చెన్నకేశవరెడ్డి, మారం రాము, పొడిశెట్టి సత్యం, గరికపాటి కృష్ణారావు, పలుసం విశ్వనాథం, లావుడ్యా హరికిషన్‌నాయక్, కందిక మాణిక్యం, చల్లా వినయ్‌రెడ్డి, పాష తదితరులు పాల్గొన్నారు. ‘మిషన్ కాకతీయ’ను సద్వినియోగం చేసుకోవాలి నర్సంపేట రూరల్: మిషన్ కాకతీయు పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం వుండలంలోని లక్నేపల్లి శివారులోని పెద్ద చెరువు, కొత్తచెరువు పునరుద్ధరణ పనులను ఎంపీపీ బాదావత్ భద్రవ్ముతో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయున వూట్లాడారు. కార్యక్రవుంలో సర్పంచ్ కొడారి కవితారవి, ఎంపీటీసీ పరాచికపు శ్యాంసుందర్, టీఆర్ఎస్ వుండల అధ్యక్షుడు వుచ్చిక నర్సయ్యు, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, కుంచారపు వెంకట్‌రెడ్డి, ఏఈ యూదగిరి పాల్గొన్నారు. -
జిల్లాకో ప్రణాళిక ఉండాలి
సీజనల్ వ్యాధులపట్ల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భిన్నమైన భౌగోళికాంశాల సమాహారంగా ఉన్నందున ఆయా జిల్లాలకు సంబంధించి ప్రత్యేక పరిస్థితులు, ప్రాధాన్యతలను నిర్దేశించుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే జిల్లా సమస్యలపై ప్రతిరోజూ అరగంట సేపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. ‘అంటురోగాలతో ఆదిలాబాద్ జిల్లాలో మరణాలు’ అనే మాట ఇక నుంచి వినపడకూడదన్నారు. ‘‘గిరిజనులకు ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. వారికొచ్చే రోగాలకు పౌష్టికాహార లోపం కారణమనే విషయాన్ని తెలియజెప్పాలి. సాంస్కృతిక సారథులతో స్థానిక గోండు భాషలో సాంస్కృతిక కార్యక్రమాలు రూపొం దించాలి. 40-50 బృందాలతో ప్రదర్శనలు చేపట్టి చైతన్యపరచాలి’’ అని ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, వాటిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ, స్వైన్ ఫ్లూ తదితర ప్రాణాంతక వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి. సరిపడేన్ని మందులు అందుబాటులో ఉంచాలి. ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో కలెక్టర్లు నిరంతరం సమన్వయం చేసుకోవాలి. వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి’’ అని చెప్పారు. జిల్లా కేంద్ర, ఏరియా దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన నిధులను పారదర్శకతతో ఖర్చు చేయాలని అన్నారు. చక్రవడ్డీలా అభివృద్ధి... రాష్ట్ర అభివృద్ధి చక్రవడ్డీ మాదిరి రెట్టింపు కావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పెరిగే అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని పాలనా ఫలాలు ప్రజలకు అందేలా ప్రణాళికలు రచించడమే ప్రభుత్వం బాధ్యతగా సీఎం అభివర్ణించారు. ‘‘దేవుని దయ వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువగానే తెలంగాణలో అభివృద్ధి సూచీ కనిపిస్తున్నది. కాలం ఇలాగే అనుకూలిస్తే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2019-20 వరకు బడ్జెట్ అంచనా రూ.2 లక్షల కోట్లకు చేరుతుంది. అయిదేళ్లలో సహజంగా రెట్టింపు అవుతుంది. అంటే నాలుగు లక్షల కోట్లు. అంచనాలకు మించి మరో రూ.లక్ష కోట్లు జమై 2024 నాటికే రూ.5 లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్ అంచనా వ్యయం చేరుకుంటుంది’’ అని వివరించారు. హెలికాప్టర్లో ట్రాఫిక్ కంట్రోల్ ‘‘మీరిట్లనే ఉండిపోతరని ఎందుకు అనుకుంటరు. హైదరాబాద్ ట్రాఫిక్‌ను భవిష్యత్‌లో హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షించే పరిస్థితులు వస్తాయి’’ అని కలెక్టర్లతో సీఎం వ్యాఖ్యానించారు. తాగునీరు, సాగునీరు పునరుద్ధరణే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొద్ది కాలంలోనే పూర్తవుతాయన్నారు. తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఇప్పట్నుంచే రూపకల్పన చేయాలన్నారు. ‘‘2024 కల్లా రూ.5 లక్షల కోట్లతో ఎంతో రిచ్‌గా ఉంటాం. తాగునీరు, సాగునీరు మీద యుద్ధం అయిపోతే తర్వాత పేదరికం కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు ఈబీసీ ల్లో ఉన్న ఒక్కొక్క పేద కుటుంబాన్ని టార్గెట్ చేసి అభివృద్ధి చేస్తాం’’ అని అన్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా సదస్సులో చర్చించారు. 23 జిల్లాలతో ముసాయిదా 74 కొత్త మండలాలు.. 9 కొత్త డివిజన్లు కలెక్టర్ల వర్క్‌షాప్‌లో ఇదే నమూనాపై చర్చ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావటంతో ఏయే ప్రాంతాలు కొత్త జిల్లా కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయన్న ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికలతో పాటు భూపరిపాలన విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసే లా ముసాయిదాను రూపొందించింది. కొత్త జిల్లాలు, వాటికి సంబంధించిన జనాభా, విస్తీర్ణంతోపాటు ఎన్ని మండలాలు వాటి పరిధిలోకి వస్తాయనే వివరాలను అందులో పొందుపరిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 459 మండలాలకు అదనంగా 74 కొత్త మండలాలను, 44 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో 9 డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక కసరత్తు జరిగింది. ఈ నమూనా ఆధారంగానే రెండు రోజుల పాటు కలెక్టర్ల వర్క్‌షాప్‌లో చర్చలు జరిగాయి. -
కొత్తా జిల్లాలండి..!
మహానగరంలో రెండు, ప్రాంతాలతో మరొకటి పెరగనున్న రెవెన్యూ డివిజన్లు, మండలాలు కలెక్టర్లతో సమీక్ష తర్వాత ప్రకటన! సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. జంట జిల్లాల్లో తొలి నుంచి నెలకొన్న జిల్లాల విభజన గందరగోళానికి సిటీలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల వర్క్ షాపులో కొంత స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ సదస్సులో జంట జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా జిల్లాల పునర్వవ్యస్థీకరణ కసరత్తును సీసీఎల్ఏ పూర్తి చేసినట్టు తెలిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఉనికి, రూపు రేఖలు, చారిత్రక ప్రాధాన్యత దెబ్బతినకుండా జంట జిల్లాలను మూడు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జంట జిల్లాల్లో కొత్తగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి (వికారాబాద్ కేంద్రం) జిల్లాలు ఆవిర్భవించే అవకాశముంది. అదే విధంగా జంట జిల్లాలో కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు, 10 మండలాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 20 మండలాలు, సికింద్రాబాద్ జిల్లా పరిధిలో 23 మండలాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 20 మండలాలు ఉండనున్నట్టు తెలుస్తోది. రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ కేంద్రంగా గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని మండలాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. అధికారుల నివేదిక ఆధారంగా ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలకు సంబంధించిన అంశాలపై జంట జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత మళ్లీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. -
కొత్త జిల్లాలపై కదలిక..!
* ‘పునర్వ్యవస్థీకరణ’ నివేదిక తయారీలో కలెక్టర్ బిజీ * సమగ్ర సమాచారం సేకరించాలని సర్కారు ఆదేశం * నెలాఖరులోపు వివరాలు పంపే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: కొత్త జిల్లాల ఏర్పాటుపై కదలిక మొదలైంది. జిల్లా లు, మండలాల పునర్వ్యవస్థీకరణకుగాను నిర్దేశిత సమాచారాన్ని తక్షణమే పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. వీటి ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది జూన్ 2వ తేదీలోపు నూతన జిల్లాలను ప్రకటించాలని భావిస్తోంది. దీంతో ఆరు రకాల అంశాలపై నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలను పంపాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఫార్మెట్ (నమూనా)లను పంపింది. కోరిన సమాచారాన్ని సేకరించడంలో యంత్రాంగం తలమునకలైంది. సమగ్ర సమాచారం మండలాల భౌగోళిక స్వరూపం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, విద్యాసంస్థలు, భూ వినియోగం, పట్టణ జనాభా, అక్షరాస్యత, లింగ నిష్పత్తి, రవాణా వ్యవస్థ, మండలాలు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని నివేదించాలని సూచించింది. దాదాపు 180 అంశాలకు సంబంధించిన వివరాలను సాధ్యమైనంత త్వరగా తమకు పంపాలని ఆదేశించారు. ప్రతి మండలానికి సంబంధించిన నైసర్గిక స్వరూపం, మ్యాపులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర విషయాలను కూడా నివేదికలో పొందుపరచాలని నిర్దేశించారు. దీంతో నూతన జిల్లాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో కదలిక వచ్చింది. నగరీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. జనసంఖ్య 40 లక్షలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో 2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు కాస్తా పదిహేనుకు చేరాయి. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలోని గొల్కోండ, సికింద్రాబాద్, చార్మినార్పేరుతో కొత్త జిల్లాలను ప్రకటిస్తే ...హైదరాబాద్ జిల్లాకు అదనంగా కొత్త ప్రాంతాలను కలపాల్సి ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు మాత్రమే ఉన్నాయి. ఈ కసరత్తు తర్వాతే.. కొత్త మండలాలు/ రెవెన్యూ డివిజన్లపై కసరత్తు పూర్తయిన తర్వాతే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పష్టత రానుంది. ఈ తరుణంలోనే మండలాల సరిహద్దులు, చారిత్రక నేపథ్యం, దర్శనీయ స్థలాలు, రవాణా సౌకర్యం తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి తుది నివేదికను పంపనుంది. ఉప్పల్‌లో టీడీపీకి పూర్వ వైభవం ఉప్పల్: ఉప్పల్‌లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కందికంటి అశోక్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగుదేశం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శిగా ఉప్పల్‌కు చెందిన కందికంటి అశోక్ కుమార్ గౌడ్‌ను నియమించడంతో స్థానిక టీడీపీ నాయకులు ఆయనను ఉప్పల్‌లో ఆదివారం ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసి పార్టీ పూర్వ వైభవ ం తీసుకు వస్తామన్నారు. వచ్చే బల్దియా ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌ను టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆశోక్‌ను సత్కరించిన వారిలో బొబ్బాల రమణారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అరిటి కాయల భాస్కర్, కొట్టాల బాలరాజు, పబ్బతి శేఖర్‌రెడ్డి, కల్లూరి వేణు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కందికంటి నిఖిల్ గౌడ్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా 14 జిల్లాలు
కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై నేడు కే బినెట్ భేటీలో చర్చ ఏపీ డిస్ట్రిక్ట్ ్స (ఫార్మేషన్) చట్టాన్ని వర్తింపజేయడంపై నిర్ణయం మరో పది వేల ఉద్యోగాలు, నూతన మద్యం విధానంపై చర్చ ప్రాజెక్టుల ఎస్కలేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా చర్చ హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం-1974ను తెలంగాణకు వర్తింపజేయాలని భావిస్తోంది. తెలంగాణ డిస్టిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్-2015 పేరుతో స్వల్ప మార్పులతో ఈ చట్టాన్ని అమలు చేయనుంది. బుధవారం మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు నెలల తర్వాత జరుగుతున్న కేబినెట్ భేటీ కావటంతో పలు కీలకమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను పునర్విభజించి 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. సీఎం కె.చంద్రశేఖర్‌రావు వివిధ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యానికి వీలుగా జిల్లాల సంఖ్యను పెంచనున్నారు. ఈ నేపథ్యంలో చట్టం అమల్లోకి తీసుకురావటం ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుతమున్న ప్రతిపాదనల ప్రకారం.. మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, వరంగల్ జిల్లాలో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కొత్త జిల్లాలుగా ఏర్పడతాయి. రంగారెడ్డి జిల్లాకు బదులుగా వికారాబాద్‌ను జిల్లాగా మార్చటంతోపాటు హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా మార్చే ఆలోచనలున్నాయి. దశలవారీగా వీటిని పునర్విభజించాలని.. తొలిదశలో జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న వాటిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చీప్ లిక్కర్‌పై చర్చ కొత్తగా అమల్లోకి తీసుకురానున్న మద్యం విధానంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసిన ఈ ఫైలును అధికారులు కేబినెట్ ఆమోదానికి పంపారు. రూ.15, రూ.30 బాటిళ్లలో చీప్ లిక్కర్‌ను విక్రయించాలనే నిర్ణయం ప్రభుత్వం తుది పరిశీలనలో ఉంది. మరో పది వేల ఉద్యోగాలపై.. ఈ ఏడాది 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రకటించారు. జూలైలో 15,552 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. మిగతా పది వేల పోస్టుల భర్తీకి లక్షలాది మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్న ఈ ఫైలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. కేబినెట్లో చర్చకు రానున్న మరిన్ని అంశాలు.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఎస్కలేషన్ పెంపు చేయాలనే ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ల మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా చర్చ జరిగే అవకాశముంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకానికి రిజర్వేషన్లపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ)పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాలనే డిమాండ్‌పై చర్చ జరగనుంది. ప్రతిపాదిత జిల్లాలు ►మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి ►మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్‌కర్నూల్ ►నల్లగొండలో సూర్యాపేట.. ►వరంగల్‌లో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి ►ఖమ్మంలో భద్రాచలం ►కరీంనగర్లో జగిత్యాల.. ►ఆదిలాబాద్‌లో మంచిర్యాల ► హైదరాబాద్ ను 4 జిల్లాలుగా.. రంగారెడ్డికి బదులుగా వికారాబాద్‌ను జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదనా ఉంది -
నవ తెలంగాణలోనూ.. నయవంచనేనా!
మెదక్: నిజాం నవాబుల ఖిల్లాగా.. కాకతీయుల దుర్గంగా.. చారిత్రక రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన మెతుకుసీమ.. వర్తమాన కాలంలో తన రాజసాన్ని కోల్పోతోంది. మెదక్ పేరును తనలో ఇముడ్చుకుని.. జిల్లా కేంద్రాన్ని కోల్పోయిన పట్టణానికి.. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా న్యాయం జరుగుతుందనుకుంటే నయవంచనే మిగిలిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను త ప్పుతూ పాలకులు తీసుకున్న నిర్ణయంతో మెదక్ ప్రజలు భగ్గుమన్నారు. కాగా సుమారు ఆరు దశాబ్దాల పోరాటం.. లక్షలాది జనాల ఆరాటంగానే మిగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకు నడిబొడ్డున ఉంది మెదక్ పట్టణం. మంజీరా నది ఒడ్డున..ప్రపంచ ప్రసిద్ధి పొందిన కరణామయుని కోవెలకు నిలయంగా.. శత్రుదుర్భేద్యమైన ఖిల్లాకు నిదర్శనంగా.. సుమారు 70 వేల జనాభాతో విరాజిల్లుతోంది పట్టణం. నిజాంకాలంలో నాలుగు జిల్లాలకు సుభాగా ఉండేది. ప్రస్తుతం మెదక్ పేరుతో జిల్లా ఉన్నప్పటికీ సంగారెడ్డి కేంద్రం గా పాలన కొనసాగుతోంది. కేవలం పాలకుల సౌకర్యం కోసమే ఈ మార్పు జరిగిందన్న ఆరోపణలున్నాయి. సుమారు ఆరు దశాబ్దాలుగా జిల్లా కేంద్రం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. అప్పట్లో సామాజిక ఉద్యమకారుడు రాందాస్ మెదక్ జిల్లా కేంద్రం కోసం 40 రోజుల ఆమరణ దీక్ష చేశారు. మెదక్ జిల్లా కేంద్ర సాధన సమితి, రిటైర్డు ఉద్యోగులు, యువకులు, న్యాయవాదులు ఉద్యమానికి ఊపిరి పోస్తూనే ఉన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం.. గత ఏప్రిల్ 24 న మెదక్ పట్టణానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూటికి నూరు పాళ్లు మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నవ తెలంగాణలో తమకు భవిష్యత్తు ఉందని పట్టణ ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ మేరకు గతంలో కూడా మెదక్ కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి తదితర ప్రాంతాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి. సిద్దిపేటలోకి రామాయంపేట, చిన్నశంకరంపేట! కాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రస్తుతమున్న 10 జిల్లాలకు తోడు మరో 7 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సీఎం కేసీఆర్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ను ఆదేశించారు. ఇందులో మెదక్ జిల్లా నుంచి సిద్దిపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు కోసం నిర్ణయించినట్లు తెలిసింది. కాగా మెదక్ సమీపంలో ఉన్న రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలను సైతం సిద్దిపేట జిల్లాలోకే వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. భగ్గుమన్న మెదక్ ఎన్నోయేళ్లుగా తాము కన్న కలలను కల్లలు చేస్తూ సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై శుక్రవారం సర్వత్రా నిరసనలు పెల్లుబికాయి. ఈ క్రమంలో మెదక్ పట్టణ బంద్‌తోపాటు నిరసన ర్యాలీలు, న్యాయవాదుల విధుల బహిష్కరణ, చిన్నశంకరంపేటలో నల్లగుడ్డలు కట్టుకుని నిరసనలు తెలిపారు. మెదక్‌ను ప్రత్యేక జిల్లాగా, లేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుంటే నిరవధిక ఆందోళనలు చేపడతామని జిల్లా కేంద్ర సాధన సమితి హెచ్చరించింది. -
కామారెడ్డి అటేనా!
కొత్త జిల్లాల ఏర్పాటు విషయం జిల్లాలో కలవరం రేపుతోంది. అసలే చిన్నగా ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి మరి కొన్ని మండలాలు ఇతర జిల్లాలలో కలుస్తాయని వినిపిస్తున్న వార్తలతో ప్రజలలో ఆందోళన మొదలైంది. అప్పుడే ఎవరు ఎటువైపు వెళతారనేది చర్చ కూడా జరుగుతోంది. నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మొట్టమొదట ఇందూరు జిల్లాగా క్రీ.శ.1876లో ఏర్పడింది. అప్పుడు ఇందులో నిజామాబాద్, నిర్మల్, ఆ ర్మూర్, భీమ్‌గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ముథోల్, న ర్సాపూర్ తాలుకా కేంద్రాలు ఉండేవి. 1905లో జరిగిన జిల్లాల పునర్విభజనలో నిర్మల్, నర్సాపూర్ తాలుకాలు కొత్తగా ఏర్పడిన ఆదిలాబాద్ జిల్లా లో కలిశాయి. ఆదిలాబాద్ ప్రాంతంలోని ముథోల్, బాన్సువాడలోని కొం త భాగాన్ని నాందేడ్ జిల్లాలో కలిపారు. ఈ సమయంలోనే ఇందూరు ని జామ్ పేరుతో నిజామాబాద్ జిల్లాగా రూపాంతరం చెందింది. ఈ జిల్లా లో కేవలం ఐదు తాలూకాలు నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ ఉండేవి. 1931లో ఎల్లారెడ్డి, బోధన్ తాలుకాల నుంచి పలు గ్రామాలను విడదీసి బాన్సువాడను తాలూకాగా ఏర్పాటు చేశారు. 1956 లో నాందేడ్ జిల్లా మహారాష్ట్ర పరిధికి వెళ్లింది. అక్కడి దెగ్లూర్ తాలుకాలోని బిచ్కుంద, జుక్కల్ కేంద్రాలను నిజామాబాద్‌లో కలిపారు. 1958 లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ తాలుకాలోని కొన్ని గ్రామాలను, మద్నూర్ ప్రాంతంలోని మరికొన్ని గ్రామాలను తీసుకుని మద్నూరు తాలుకాను ఏర్పాటు చేశారు. 1979 డిసెంబర్ నెలలో కామారెడ్డి తాలుకాలోని కొన్ని గ్రామాలను విడదీసి దోమకొండ కేంద్రంగా, ఆర్మూర్‌లోని కొన్ని గ్రామాలను విడదీసి భీమ్‌గల్ పేరుతో కొత్త తాలుకాలను ఏర్పర్చారు. వీటితో కలుపుకొని నిజామాబాద్ జిల్లాలో తాలుకాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. తరువాత ఇవి 36 మండలాలుగా విడిపోయాయి. ఇప్పుడిలా! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇందుకోసం రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఏడు జిల్లాలను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. మెదక్ జిల్లాలోని సిద్ధిపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. ఈ జిల్లా పరిధిలోకి నిజామాబాద్‌లోని కామారెడ్డి డివిజన్ బదిలీ కానుందని తెలుస్తోంది. ఈ డివిజన్లోని ఏడు మండలాలు ఆ జిల్లా పరి ధికి వెళ్తాయని సమాచారం. దీంతో జిల్లాలోని 36 మండలాలలో ఏడు మండలాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కామారెడ్డినే జిల్లా కేంద్రంగా చేయాలని కొంత కాలంగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తే కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలు జగిత్యాలకు బదిలీ అవుతాయని భావిస్తున్నారు. అవసరమైతే భీమ్‌గల్ మండలాన్ని చేర్చే విషయం కూడా పరిశీలిస్తారని అంటున్నారు. దీంతో నిజామాబాద్ అతి చిన్న జిల్లాగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.