► ప్రజలు, పరిపాలన సౌలభ్యం ప్రకారం నిర్ణయం
► డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
ములుగు: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాల పునర్విభజన శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతుందని, ప్రజలు గమనించాలని డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రూ. కోటితో మం జూరైన ఎంపీడీఓ కార్యాలయ నూతన భవనానికి నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, గిరిజన శాఖ మం త్రి అజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడి యం మాట్లాడుతూ ప్రజలు, పరిపాలన సౌల భ్యం ప్రకారం అన్ని రకాలుగా విశ్లేషణలు జరిపి న తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. జిల్లాల ఏర్పాటకు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు జిల్లా అంశాన్ని వక్రీరించి ప్రజలను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. స్థానికంగా జరుగుతున్న ఉద్యమాలు, ప్రజల మనోభావాలను సీఎం దృ ష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలను సమన్వయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని తెలిపారు.
250 గురుకుల పాఠశాలలు
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహించడానికి 250 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం అన్నారు. షెడ్యూల్ కులాల కోసం 100, ఎస్టీకు 50, మైనార్టీల కోసం 70, మరో 30 డిగ్రీ ఎస్సీ బాలికల కోసం మంజూరు చేసినట్లు చెప్పారు. మంత్రి చందూలాల్ సూచన మేరకు ములుగు డిగ్రీ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ, తహసీల్దార్ కార్యాలయ నూతన భవన మంజూరుకు జిల్లా నిధుల నుంచి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ పద్మ, ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ములుగు, ఏటూరునాగారం ఎంపీపీలు భూక్య మంజుల, మెహిరున్నీసా, జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ, ఆర్డీఓ మహేందర్‌జీ, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి, సర్పంచ్ సాగర్, ఎంపీటీసీ సభ్యులు పోరిక విజయ, గోవింద్‌నాయక్, సంపత్‌రావు, శిరీష, జానమ్మ, టీఆర్‌ఎస్ ములుగు, వెంకటాపురం మండల అధ్యక్షులు గట్టు మహేందర్, పోరిక హర్జినాయక్ పాల్గొన్నారు.