టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి
నెక్కొండ: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రజల అభీష్టం మేరకే జరుగుతుందని టీఆర్‌ఎస్ నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో నెక్కొండ మండలాన్ని మహబూబాబాద్ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రకటించిందన్నారు. ఆ మండలం మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నందున..ఆ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రకటించారన్నారు. నెక్కొండ మండలాన్ని వరంగల్ జిల్లాలో కలిపాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు వరంగల్ జిల్లాలో కలిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్ నబీ, వైస్ ఎంపీపీ దొనికెన సారంగపాణి, రామాలయ కమిటీ చైర్మన్ గన్ను కృష్ణ, నాయకులు అంబాల రాంగోపాల్, తాళ్లూరి లక్ష్మయ్య, చల్లా చెన్నకేశవరెడ్డి, మారం రాము, పొడిశెట్టి సత్యం, గరికపాటి కృష్ణారావు, పలుసం విశ్వనాథం, లావుడ్యా హరికిషన్‌నాయక్, కందిక మాణిక్యం, చల్లా వినయ్‌రెడ్డి, పాష తదితరులు పాల్గొన్నారు.
‘మిషన్ కాకతీయ’ను సద్వినియోగం చేసుకోవాలి
నర్సంపేట రూరల్: మిషన్ కాకతీయు పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం వుండలంలోని లక్నేపల్లి శివారులోని పెద్ద చెరువు, కొత్తచెరువు పునరుద్ధరణ పనులను ఎంపీపీ బాదావత్ భద్రవ్ముతో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయున వూట్లాడారు. కార్యక్రవుంలో సర్పంచ్ కొడారి కవితారవి, ఎంపీటీసీ పరాచికపు శ్యాంసుందర్, టీఆర్‌ఎస్ వుండల అధ్యక్షుడు వుచ్చిక నర్సయ్యు, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, కుంచారపు వెంకట్‌రెడ్డి, ఏఈ యూదగిరి పాల్గొన్నారు.