చిన్నబోయిన పెద్ది
తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన వారిలో నలుగురు ప్రజాప్రతినిధులు పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వీరు ఉద్దేశపూర్వకంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డిని దూరం పెడుతున్నారని టీఆర్‌ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారుు.రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పలు ఉప ఎన్నికల్లో పదేపదే చెప్పిన కేసీఆర్... జిల్లాలో ఉద్యమ నేతగా వ్యవహరించిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి రాజకీయంగా ఎలా అండగా నిలుస్తారని గులాబీ వర్గాల్లో ఇప్పుడు చర్చజరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాలో టీఆర్‌ఎస్‌ను అన్నీ తానై నడిపించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇటీవలి కాలంలో స్తబ్దుగా ఉంటున్నారు. జిల్లాలో ఎక్కడైనా, ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారులకు ఇబ్బంది వస్తే... ఆయన వెంటనే అక్కడ వాలేవారు. అందరికీ అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు చక్కబెట్టేవారు. అలాంటి సుదర్శన్‌రెడ్డి ఇప్పుడు టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు అన్ని కీలక సందర్భాల్లో పార్టీ తరఫున పెద్ది క్రియాశీలకంగా వ్యవహరించారు.
టీఆర్‌ఎస్ హవాలో సైతం నర్సంపేటలో ఎమ్మెల్యేగా ఓడిపోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. మొదటి నుంచీనుంచీ ఉద్యమంలో ఉన్నా... తాను ఎలా ఓటమి చెందానని మదనపడుతున్నారు. ఈ కారణాలతోనే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయాల్లో ఆయనను అనునయించి... క్రియాశీలకం చేయాల్సిన పార్టీ ప్రజాప్రతినిధులు ఈ పనిచేయడం లేదని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం జిల్లాలో టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారిలో మధుసూదనాచారి మాత్రమే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. మిగిలిన వారందరూ ఆ తర్వాత పార్టీలో చేరిన వారే. వీరందరినీ టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పాత్ర ఉంది. తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన వారిలో నలుగురు ప్రజాప్రతినిధులు పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వీరు ఉద్దేశపూర్వకంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డిని దూరం పెడుతున్నారని టీఆర్‌ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారుు.
విద్యార్థి దశ నుంచే ఉద్యమం
నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటర్మీడియుట్‌లోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. అనంతరం గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత నల్లబెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1998లో యుూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంలోనే ఆ పార్టీలో చేరారు. అదే సంవత్సరంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో నల్లబెల్లిలో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిపై విజయుం సాధించారు. ఆ తర్వాత ప్రతక్ష్య ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2004లో పొత్తులో భాగంగా నర్సంపేట స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కె.లక్ష్మారెడ్డి పోటీ చేశారు. ఈయన విజయానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి చేశారు. 2005లో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా నర్సంపేట సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు. ఈయన గెలుపు కోసం ఆ ఎన్నికల్లో పెద్ది కృషి చేశారు. పెద్ది సుదర్శనరెడ్డి 2013 వరకు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడి వ్యవహరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఉండకూడదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణరుుంచడంతో పెద్ది.. ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. 2013లో జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను టి.రవీందర్‌రావుకు అప్పగించడంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు.
2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది క్రమక్రమంగా పార్టీకి దూరమయ్యారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో జిల్లా కన్వీనర్‌గా వ్యవహరించిన వారు స్తబ్దుగా ఉండిపోయారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు వరుసగా పార్టీని వీడుతూ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి గులాబీ దళానికి నేతృత్వం వహించారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు నిరాహార దీక్ష, ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో పెద్ది కీలకంగా వ్యవహరించారు. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులకు టీఆర్‌ఎస్ తరఫున అన్ని సమయాల్లో అందుబాటులో ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్న సమయంతోపాటు తెలంగాణ ఆవిర్భావం వరకు జరిగిన అన్ని సందర్భాల్లోనూ జిల్లాలో ఆయన టీఆర్‌ఎస్‌కు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఏక కాలంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. వరంగల్ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి చేశారు. ఇలా తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్ కీలక కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి... నర్సంపేటలో ఎమ్మెల్యేగా ఓటమి చెందడం ఆయనను కుంగదీసింది.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. పెద్ది సుదర్శనరెడ్డి మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పలు ఉప ఎన్నికల్లో పదేపదే చెప్పిన కేసీఆర్... జిల్లాలో ఉద్యమ నేతగా వ్యవహరించిన పెద్ది సుదర్శనరెడ్డికి రాజకీయపరంగా ఎలా అండగా నిలుస్తారనేది గులాబీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.