ప్రభుత్వ నోటిఫికేషన్ బట్టి జిల్లా కమిటీలు : సీపీఎం
సీపీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేశాక పార్టీపరంగా నూతన జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీపీఎం నిర్ణయించింది. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు కార్యదర్శులుగా ఎవరిని నియమిస్తే బావుంటుందన్న దానిపై కూడా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. శుక్రవారం ఎంబీభవన్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసమావేశంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకర ణపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉంది, దానిని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటన్న దానిపైనా చర్చించారు.