government notification
-
ప్రభుత్వ నోటిఫికేషన్ బట్టి జిల్లా కమిటీలు : సీపీఎం
సీపీఎం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేశాక పార్టీపరంగా నూతన జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీపీఎం నిర్ణయించింది. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు కార్యదర్శులుగా ఎవరిని నియమిస్తే బావుంటుందన్న దానిపై కూడా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. శుక్రవారం ఎంబీభవన్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకర ణపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉంది, దానిని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటన్న దానిపైనా చర్చించారు. -
డీఎస్సీ అభ్యర్థులు డీలా
డీఎస్సీ ఫలితాలు ఆలస్యం కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 15 నాటికే ఉపాధాయ్య నియామకాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆ హామీ నెరవేరలేదు. డీఎస్సీ నిర్వహణ, ఫలితాలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడం తో మెరిట్ జాబితా విడుదల, నియామకాల ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. - మెరిట్ జాబితా మరింత ఆలస్యం - న్యాయపరమైన చిక్కులే కారణం - ఉపాధ్యాయ నియామకాలు ఎప్పటికో...? సాక్షి,చిత్తూరు: డీఎస్సీ అభ్యర్థులు డీలా పడ్డారు. మెరిట్ జాబితా కోసం ఎదురు చూపులు తప్పడంలేదు. న్యాయపరమైన చిక్కులంటూ రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేయడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది నవంబర్ 20న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 1336 ఉపాధ్యాయపోస్టులకు సంబంధించి తొలుత 42 వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 37,268 మంది అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. మే 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహించింది. జూన్ 3న విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. జూన్ 9 నాటికి మెరిట్ లిస్ట్ జిల్లాలకు పంపి 15 నాటికే ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ప్రకటించారు. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో విద్యాశాఖ మెరిట్ జాబితా విడుదలను వాయిదా వేసింది. డీఎస్సీ ప్రశ్నాపత్రాల కీ లోని తప్పులపై 1,836 కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ ప్రాథమిక కీ పైనే 3 వేలకుపైగా అభ్యంతరాలు విద్యాశాఖకు అందినట్లు సమాచారం. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు వచ్చినా విద్యాశాఖ ఫైనల్ కీ విడుదలలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వీటిన్నింటినీ అంశాల వారీగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు సరిచేసుకోవాల్సి ఉంది. అనంతరం ఈ నివేదికలను ట్రిబ్యునల్‌కు సమర్పించాలి. ఆపై ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాల మేరకు అభ్యర్థుల మెరిట్ జాబితా, నియామకపు ఉత్తర్వులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు డీఎస్సీ -2014 నిర్వహణ పైనే మరో కేసు ఉంది. డీఎస్సీ 2014ను గతకంటే భిన్నంగా నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. గతంలో టీచర్ ఎలిజబులిటి టెస్ట్ (టెట్)ను నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వారికి డీఎస్సీ (టీచర్ రిక్రూట్మెంట్ -టెర్ట్)ను పెట్టేవారు. ఈ సారి టెట్, టెర్ట్లను కలిపేసి డీఎస్సీ నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానంలో ఇప్పటికే కొందరు సవాల్ చేస్తున్నారు. ఈ వివాదాలన్నింటికీ తెరపడాల్సి ఉంది. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల, ఉపాధ్యాయ నియామకాలు మరింత ఆలస్యం కానున్నాయి. డీఎస్సీ రాసిన అభ్యర్థుల్లో మరింత ఆందోళన నెలకుంది. -
లైన్ క్లియర్
- గుంటూరు రైల్వేలైను డబ్లింగ్‌కు మోక్షం - రూ.20కోట్ల విడుదలకు అనుమతులు - రాజధానికి పెరగనున్న కనెక్టివిటీ తెనాలి-గుంటూరు మధ్య రైల్వేలైను డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడేళ్ల జాప్యం తర్వాత ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన కొద్దిరోజులకే పనుల ప్రారంభానికి రూ.20 కోట్ల నిధులు విడుదల చేసింది. గుంటూరు, చెన్నై- విజయవాడ మార్గంలోని తెనాలి జంక్షన్ మధ్య రెండోలైను నిర్మాణంతో సీఆర్డీఏ పరిధిలోని పట్టణాలు, న గరాల మధ్య ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. గుంటూరుకు కొత్తరైళ్ల రాక పోకలకు, మెట్రో నగరాలకు వెళ్లే పలు రైళ్లను తెనాలికి పొడిగించే అవకాశ మూ ఏర్పడుతుంది. ప్రయాణ సౌకర్యాలు విస్తృతం రైల్వేలైను డబ్లింగ్ ఫలితంగా ప్రయాణ సౌకర్యాలు విస్తృతం కానున్నాయి. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య ఇప్పటికే పరిమితంగా సర్క్యులర్ రైళ్లు నడుస్తున్నాయి. డబ్లింగ్ తర్వాత మరికొన్ని సర్క్యులర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. విజయవాడలో మెట్రో రైల్వే ప్రాజెక్టు రానున్నందున సర్క్యులర్ రైలు నుంచి విజయవాడలో మెట్రోను అందుకుని అక్కడ ఏ ప్రాంతానికైనా తక్కువ వ్యయంతో చేరుకునేలా ప్రయాణ సౌలభ్యం సమకూరుతుంది. రాజధానికి కొత్తరైళ్లు నడిపేందుకు వెసులుబాటూ చిక్కుతుంది. గుంటూరుకు వచ్చే బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వంటివి తెనాలి వరకు పొడిగించవచ్చు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రేపల్లె-తెనాలి రైల్వేలైన్‌ను డబ్లింగ్ చేయగలిగితే తీరప్రాంతం నుంచి కనెక్టివిటీ పెరుగుతుంది. స్థల సేకరణకు నోటిఫికేషన్ తెనాలి : తెనాలి నుంచి 24.38 కిలోమీటర్ల దూరంలోని గుంటూరుకు ఉన్న సింగిల్ లైనుకు అదనంగా మరో లైను నిర్మాణానికి ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఎంతో కాలమైనా పరిపాలన అనుమతుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. మొత్తం రూ.147 కోట్లతో రెండోలైను నిర్మాణానికి నిబంధనల ప్రకారం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), రాష్ర్ట ప్రభుత్వం చెరి సగం భరించాల్సి ఉంది. రోశయ్య సీఎంగా ఉండగా, తెనాలి-గుంటూరు, శ్రీకాళహస్తి-నడికుడి మధ్య డబ్లింగ్ పనులకు 50 శాతం నిధులు ఇచ్చేందుకు సుముఖత చూపారు. ఆ తరువాత అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు గుంటూరు రాజధానిగా ఎంపిక చేశాక కదలిక వచ్చింది. తెనాలి-గుంటూరుతోపాటు విజయవాడ-గుడివాడ-నరసాపురం-భీమ వరం-మచిలీపట్నం రైల్వేలైను డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులకు రూ.120 కోట్లకు కార్యనిర్వాహక అనుమతులు మంజూరు చేస్తూ మే నెలాఖరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.1,140 కోట్లు అంచనా. ఇందులో విజయవాడ-మచిలీపట్నం రైలుకు రూ.100 కోట్లు కేటాయించారు. తెనాలి-గుంటూరు మధ్య గతంలోనే అవసరమైన భూమిని సేకరించగా, ప్రస్తుతం మరో 10 ఎకరాల స్థలసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అంగలకుదురు, సంగంజాగర్లమూడి, వడ్లమూడి, శేకూరు, వేజండ్ల గ్రామాలకు చెందిన 89 మంది రైతుల నుంచి ఈ స్థలాన్ని సేకరించాల్సి ఉంది. న్యాయమైన పరిహారం ఇస్తే సమ్మతిస్తామని ఇటీవల సంబంధిత రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ (2)తో ఏర్పాటైన సమావేశంలో అంగీకరించారు. -
ఇచ్చినట్లే ఇచ్చి!
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో 98 గ్రామ పంచాయతీ పోస్టులను భర్తీ చేస్తామని గత ఏడాది ఆగస్టు 14న ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించడంతో 11,221 మంది నిరుద్యోగులు అష్టకష్టాలకోర్చి దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ,ఎస్టీలు మినహాయించి మిగిలిన వర్గాలకు చెందిన నిరుద్యోగులందరూ రూ.50లకు డీడీ తీయాలనే నిబంధన విధించారు. పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలలోనే ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. డిగ్రీ పాస్ అయినట్లయితే 25 మార్కులను వెయిటేజీగా ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన డిగ్రీ ఉత్తీర్ణులైన కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులే ఎక్కువ పోస్టులను దక్కించుకునే వీలుంది. అయినప్పటికీ డిగ్రీలో 85 శాతానికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వేలాది మంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే తమనే రెగ్యులర్ చేయాలని జిల్లాలోని కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పలువురు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో గత ఏడాది అక్టోబర్‌లోనే ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రిబ్యునల్ స్టెటస్కో ఇచ్చింది. కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి తాజాగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) కేశవరావు ఈ నెల 3న పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఓఏ నెంబర్ 8212/2013 మేరకు ఒక లేఖను రాశారు. ఎట్టకేలకు ఆ ప్రతులు జిల్లా అధికార యం త్రాంగానికి చేరాయి. ఈ నెల 20న జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల్లో 96 మందిని రెగ్యులర్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శులకు సంతోషం కలిగించినా.. ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. తాము చెల్లించిన మొత్తాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి అందిన దరఖాస్తులను అబియెన్స్‌లో ఉంచుతామని డీపీవో శోభాస్వరూపరాణి తెలిపారు. -
తోలు ఒలుచుడే
హైదరాబాద్‌కు చెందిన హెచ్‌కేఆర్ రోడ్ వేస్ లిమిటెడ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్ల ప్రకారం.. కారు, జీపు, వ్యాన్లకు కిలోమీటర్‌కు 50 పైసలు, లోకల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, మినీ బస్‌కు రూపాయి, బస్, ట్రక్కు రూ.2 చొప్పున, మల్టీ యాక్సిల్ వెహికల్స్, హెవీ కన్స్ట్రక్షన్ వెహికల్స్‌కు రూ.5కు మించకుండా టోల్ వసూలు చేయాలని పేర్కొంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నుంచి ఇటు రామగుండం, అటు సిద్ధిపేట, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు చేదు వార్త. ఇకపై మీ ప్రమాణం మరింత ఖరీదవనుంది. టోల్ పేరిట ఈ రహదారిపై వెళ్లే ప్రయాణికుల తోలు ఒలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే... ప్రయాణ ఖర్చులతో పాటు టోల్ ఫీజుతో మీ జేబులు లూటీ కావటం ఖాయమైంది. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారిపై మూడు చోట్ల టోల్ వసూలు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 28.200 కిలోమీటర్ల నుంచి 235.058 కిలోమీటర్ల వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిన నిర్మించిన రహదారిపై టోల్ వసూలు చేయనున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రహదారి నిర్మాణ సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన హెచ్‌కేఆర్ రోడ్ వేస్ లిమిటెడ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగించింది. ఈ రహదారిని వినియోగించుకునే ప్రతి వాహనదారు నుంచి టోల్ వసూలు చేసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. మెదక్ జిల్లా సిద్ధిపేట సమీపంలోని దుద్దెడ వద్ద, జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రేణికుంట, రామగుండం మండలం బసంత్‌నగర్ వద్ద టోల్ గేట్లను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్ల ప్రకారం కారు, జీపు, వ్యాన్లకు కిలోమీటర్‌కు 50 పైసలు, లోకల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, మినీ బస్‌కు ఒక రూపాయి, బస్, ట్రక్కు రూ.2 చొప్పున, మల్టీ యాక్సిల్ వెహికల్స్, హెవీ కన్స్ట్రక్షన్ వెహికల్స్‌కు రూ.5కు మించకుండా టోల్ వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టోల్ వసూలుకు రంగం సిద్ధమవటంతో ఈ రహదారిపై వెళ్లే బస్సులకు ఆర్టీసీ సైతం అంతమేరకు అదనపు చార్జీలను వసూలు చేసే అవకాశముంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులపై చార్జీల మోత మోగనుంది. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు.. అతుకుల బొంతలా ఈ రహదారి నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. ఈ రహదారి నిర్మాణం నాసిరకంగా ఉందని.. ఫోర్లేన్కు సంబంధించి నిబంధనలు పాటించలేదని వెల్లువెత్తిన ఆరోపణలపై వేసిన శాసనమండలి సబ్ కమిటీ నివేదిక సైతం చర్చకు నోచుకోలేదు. ఈలోగా... టోల్ వసూలుకు కాంట్రాక్టు కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై సర్వత్రా విమర్శలు పెల్లుబికుతున్నాయి.