రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్కు రాకపోవడంలో కేంద్ర ప్రభుత్వమే ప్రథమ ముద్దాయి అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఇవాళ రాష్ట్ర విభజనను మించి అఘాయిత్యం రాజ్యసభలో జరిగిందన్నారు. చేసిన చట్టాన్ని అమలు చేయలేని దుస్థితిలో కేంద్రం ఉందని ఉండవల్లి దుయ్యబట్టారు. అన్ని పార్టీలు కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.