ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని రూపురేఖలు, నిర్మాణానికి సలహాల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ‘రాజకీయ’ కమిటీని నియమించింది. ఈ కమిటీలో అందరూ పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రి అనుంగులే తప్ప అసలు ఓ నగర నిర్మాణానికి అవసరమైన నిపుణులు లేకపోవడం విమర్శలకు దారితీసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాంతం ఎంపిక, దానికి మౌలిక వసతుల కల్పన, ఇతరత్రా అవసరాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తవుతోంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించడం, అందులోనూ పారిశ్రామికవేత్తలనే నియమించడం, ఇతర రంగాల నిపుణులకు చోటు కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరోపక్క.. విజయవాడ - గుంటూరు మధ్యనే రాజధాని అంటూ ముఖ్యమంత్రితోసహా మంత్రులంతా ఇప్పటికే పలుమార్లు ప్రకటించి గందరగోళం సృష్టిస్తున్నారు.
Published Mon, Jul 21 2014 7:53 AM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement