చంద్రబాబు మంచి స్నేహితుడు: దిగ్విజయ్ | Chandrababu Naidu is a good friend of mine says Digvijay Singh | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 3 2013 12:48 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని, ఆయన కూడా తనను టార్గెట్ చేయడం సంతోషమేనని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై మంగళవారం నాడు న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విభజనకు అన్ని పార్టీలూ సరేనన్న తర్వాత మాత్రమే తాము ముందుకెళ్లామని, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. విభజన గురించి అన్ని అంశాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తోందని, ఆంటోనీ కమిటీతో ఎవరైనా వచ్చి అన్ని అంశాలను చర్చించవచ్చని దిగ్విజయ్ తెలిపారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందంటూ వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా, దాని గురించి మాత్రం సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement