కొడంగల్ ఎమ్మెల్యే, టీటీడీపీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజీనామాపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనూహ్యంగా స్పందించారు. రేవంత్ రాజీనామా విషయం తనకు తెలియదని, ఒకవేళ అలా జరిగినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.