హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీ వ్యవహారంగా తీసుకోవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రెండువారాల పాటు కొనసాగే హరితహారం అధికారులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా గ్రామ సర్పం చుల పని తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని స్పష్టంచేశారు.