నవంబర్ 8.. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయం.. ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్‌లోని నల్ల కుబేరులు ప్రముఖ నగల దుకాణాలకు క్యూ కట్టారు! దాచుకున్న నల్లధనంతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. దీంతో ఐదు ప్రముఖ దుకాణాల్లో 24 గంటల్లోనే ఏకంగా రూ.470 కోట్ల మేర బంగారం విక్రయాలు జరిగాయి. ఇలా బంగారం కొనుగోలు చేసిన వారిలో ఓ ప్రముఖ మీడియా అధిపతితో పాటు యువతలో మంచి క్రేజ్ ఉన్న ప్రముఖ హీరో సతీమణి, కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అఖిల భారత సర్వీసు అధికారులు కూడా ఉన్నారు. వీరిలో మీడియా అధిపతితో పాటు, ప్రముఖ హీరో సతీమణి చెరో రూ.25 కోట్లకు మించి బంగారం కొనుగోలు చేశారు. తమ దగ్గర కోట్లలో ఉన్న పెద్ద నోట్లు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వీరంతా ప్రత్యామ్నాయంగా ఇలా బంగారం కొనుగోలును ఎంచుకున్నారు.